ఆ కారుని గత నెలలో కేవలం 22 మంది మాత్రమే కొన్నారు.. బోరున ఏడుస్తున్న ఆ కంపెనీ!

హ్యుందాయ్ ఇండియా నవంబర్ నెలలో సేల్స్‌ డేటాను వెల్లడించింది. తాజాగా విడుల చేసిన అమ్మకాల్లో హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. హ్యుందాయ్ ప్రస్తుతం కోనా ఈవీ స్థానంలో అయోనిక్ 5ని విక్రయిస్తోంది. తాజా డేటా ప్రకారం నవంబర్‌ 2024లో కేవలం 22 అయోనిక్ 5 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఆరు నెలల్లో ఈ నవంబర్‌ కనిష్ఠ సేల్స్‌ని నమోదు చేయడం గమనార్హం. దీని అమ్మకాలను పెంచడానికి హ్యుందాయ్ సైతం రూ . 2 లక్షల డిస్కౌంట్‌ని అందిస్తోంది.

ఇక గత ఆరు నెలల్లో మొత్తం 191 కార్లను హ్యుందాయ్‌ విక్రయించింది. నెలవారీ అమ్మకాల గణాంకాలు పరిశీలిస్తే జూన్‌లో 30 కార్లు, జూలైలో 36 కార్లు, ఆగస్టులో 40 కార్లు, సెప్టెంబర్‌లో 31 కార్లు, అక్టోబర్‌లో 32 కార్లు, నవంబర్ లో కేవలం 22 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. నవంబర్‌లో కార్ల అమ్మకాలు ఊహించని విధంగా తగ్గడం వల్ల కంపెనీ ఆశ్చర్యానికి గురవతుతోంది.

Hyundai Ioniq 5 November 2024 Sales

ఈ హ్యుందాయ్‌ అయోనిక్ 5 వేరియంట్‌లో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ 46.05 లక్షలుగా ఉంది. ఈ అయోనిక్ 5 ఇంటీరియర్ డ్యాష్ బోర్డ్, డోర్ ట్రిమ్స్‌పై సాఫ్ట్ టచ్ ఫినిష్‌తో పర్యావరణ అనుకూల పదార్థాలను ఉపయోగించారు. ఇందులో పిక్సెల్ డిజైన్ ఆర్మ్రెస్ట్, సీట్ అప్హోల్స్టరీ, స్టీరింగ్ వీల్‌ కలవు. క్రాష్ ప్యాడ్, డోర్ ప్యానెల్ వంటి వివిధ భాగాలపై బయో పెయింట్ ఉపయోగించబడింది.

ఈ కారులో ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్‌ ఫంక్షన్స్‌ కోసం రెండు 12.3-అంగుళాల స్క్రీన్లు కలవు. అదనపు సౌలభ్యం కోసం ఇందులో హెడ్-అప్ డిస్ప్లేను కూడా అందించారు. సేఫ్టీ పంరగా ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, వర్చువల్ ఇంజిన్ సౌండ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, నాలుగు డిస్క్ బ్రేక్స్‌ ఉన్నాయి. అయోనిక్ 5 లో లెవల్ 2 ADAS సిస్టమ్‌తో పాటు 21 సేఫ్టీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

Hyundai Ioniq 5 Sales

ఓవరాల్‌గా ఈ కారులో కస్టమర్లకు నచ్చే అన్ని ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు 72.6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 631 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్‌ వెనుక వీల్ డ్రైవ్‌కి పవర్‌ని పంపిస్తుంది. 217 bhp పవర్‌ని, 350 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 800 వాట్ల వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

దీనిలోని అడ్వాన్స్‌డ్‌ ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 18 నిమిషాల్లో పది నుంచి ఎనభై శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అందువల్ల మీ సమయం ఆదా కానుంది. అయితే ఈ కారు ధర ఎక్కువగా ఉండటంతో చాలా మంది ఈ కారును కొనుగోలు చేయడానికి విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని ఫీచర్లు, ఫర్ఫామెన్స్‌ని బట్టి ధరను కంపెనీ నిర్ణయించింది. ఒకవేళ ధరను తగ్గిస్తే సేల్స్‌ పెరిగే అవకాశం ఉంటుంది.

Hyundai Ioniq 5 Price

ఈ కంపనీ నుంచి అందుబాటులో ఉన్న హ్యుందాయ్‌ టక్సన్‌ ఎస్‌యూవీ ధర సైతం ఎక్కువగానే ఉందని ఆటోమోబైల్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలే ఈ కారు BNCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్‌ రేటింగ్‌ని సాధించింది. ఈ కారు ప్రారంభ ధర రూ.29.09 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా ఉంది. అందువల్ల దీనిని జనాలు ఎక్కువగా కొనడం లేదు. నవంబర్‌లో కేవలం 88 యూనిట్లు మాత్రమే సేల్‌ అయ్యాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, December 9, 2024, 18:10 [IST]
English summary
Hyundai ioniq 5 november 2024 sales report check here
Read more on: #hyundai #car sales #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+