జస్ట్ సింగిల్ ఛార్జ్ చాలు.. 620 కి.మీలు కుటుంబంతో కలిసి హాయిగా వెళ్లండి.. ఇది మామూలు కారు కాదు మరి!

కుటుంబ కార్లకు ప్రాధాన్యత బాగా పెరిగింది. దీంతో తయారీదారులు సైతం అందుకు అనుగుణంగా ఎక్కువ మంది ఒకేసారి ప్రయాణించడానికి అనువుగా ఉండే ఫ్యామిలీ ఎస్‌యూవీ విభాగం కార్లను ఎక్కువగా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ SUVలు అధికంగా అందుబాటులో ఉండగా, హ్యుందాయ్ కంపెనీ ఒక ముందడుగు వేసి ఎలక్ట్రిక్ వేరియంట్‌లో కారును తీసుకొస్తుంది. ఈ మోడల్ పేరు 'హ్యుందాయ్ ఐయోనిక్ 9(Hyundai Ioniq 9)'. దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ అయినటువంటి హ్యుందాయ్ మొదటగా ఈ ఫ్యామిలీ కారును 2025 ఏడాదిలో మొదటి ఆరు నెలల్లో యునైటెడ్ స్టేట్స్‌, దక్షిణ కొరియాలో విడుదల చేస్తుంది. ఆ తరువాత దీన్ని యూరప్‌‌తో పాటు ఇతర దేశాల్లో అమ్మకానికి అందుబాటులో ఉంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ తయారీ దారులకు వ్యాపార పరంగా అతిపెద్ద గమ్యస్థానంగా ఉన్న భారత్‌లో కూడా లాంచ్ అవుతుంది.

హ్యుందాయ్ ఐయోనిక్ 9 పూర్తి ఎలక్ట్రిక్ వేరియంట్‌లో లభిస్తుంది. ఇది కుటుంబ మొత్తం కలిసి ఒకేసారి ప్రయాణించడానికి అనువుగా 7 సీటర్ ఆప్షన్‌లో లభిస్తుంది. ప్రస్తుతం, కంపెనీ ఇండియాలో ఐయోనిక్ 5 మోడల్‌ను మాత్రమే విక్రయిస్తుంది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు ఐయోనిక్ 9ను తీసుకొస్తుంది. ఈ మోడల్‌ను ఇటీవల లాస్ ఏంజిల్స్ ఆటో షోలో ఆవిష్కరించింది. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉంది.

Hyundai Ioniq 9 Electric

ఈ ఈవీ కారును ఈ-జీఎంపీ ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారు చేశారు. దీనిలో 110.3 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. దీన్ని పూర్తి ఛార్జింగ్ చేసినట్లయితే 620 కి.మీ వరకు ప్రయాణిస్తుందని సమాచారం. ప్రధానంగా ఇటీవల కాలంలో చాలా మంది బ్యాటరీ ఛార్జింగ్ సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో హ్యుందాయ్ దీనిపై దృష్టి సారించి తన కారుకు ఫాస్ట్ ఛార్జర్‌ను అందిస్తుంది.

50kW ఛార్జర్‌ ద్వారా వినియోగదారులు తమ కారును 24 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా 400V, 800V ఛార్జింగ్ కెపాసిటీ ఉంటుంది. LR RWD వేరియటంట్‌లో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 218 bhp పవర్, 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదని తెలుస్తుంది. ఇది స్టార్ట్ చేసిన 9.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వేగంతో దూసుకుపోతుంది.

Hyundai Ioniq 9 Electric Suv Front View

అదే 6.8 సెకన్లలో 80-120 kmph వేగాన్ని అందుకుంటుంది. మరో టాప్ వేరియంట్ మోటార్ 218 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గంటకు 5.2 సెకన్లలో 0-100 kmph, 3.4 సెకన్లలో 80-120 kmph వేగాన్ని చేరుకుంటుంది. 6, 7 సీట్ల ఆప్షన్‌లో లభిస్తున్న ఐయోనిక్ 9 క్యాబిన్ చాలా అందంగా ఉంటుంది. లోపల అధునాతన ఫీచర్లు ఉన్నాయి. వీటితో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవం కలుగుతుంది.

కారుల , 12-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ కర్వ్డ్ డిస్‌ప్లే,12-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, 8-స్పీకర్ సౌండ్, 14-స్పీకర్ బోస్ సిస్టమ్‌, రూఫ్-మౌంటెడ్ ఎయిర్ వెంట్స్, యాంబియంట్ లైటింగ్, మూడు వరుస సీట్లు కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. బయటి నుంచి కారు అందంగా ఉంటుంది. 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.

Hyundai Ioniq 9 Electric Suv

లోపల లగేజీ స్థలం కూడా ఎక్కువగా ఉంటుంది. కెపాసిటీ 620 లీటర్లుగా ఉంది. అదే సీట్లను మడత పెట్టినట్లయితే 1,323 లీటర్ల స్థలం వాడుకోవచ్చు. రెండు వరుస సీట్లలో మసాజ్ ఫంక్షన్ ఫెసిలిటీ ఉంటుంది. రెండో వరుస సీట్లను 180 డిగ్రీల వరకు రొటేషన్ చేసుకోవచ్చు. ప్రీమియం ఎలక్ట్రిక్ SUVకి గ్లోబల్ గానే కాకుండా ఇండియాలో కూడా మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందని హ్యుందాయ్ భావిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, November 22, 2024, 16:59 [IST]
English summary
Hyundai ioniq 9 electric suv launch range features all details
Read more on: #hyundai #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+