ఇకపై 'హ్యుందాయ్ కోనా ఈవీ' కొత్త కారు కొనలేరు.. ఎందుకంటే?

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మరియు వినియోగం పెరుగుతున్న సమయంలో కొత్త వాహనాలు కూడా లాంచ్ అవుతూ ఉన్నాయి. ఈ తరుణంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఇండియా తన పాపులర్ ఎలక్ట్రిక్ మోడల్ 'కోనా ఎలక్ట్రిక్'ను (Kona Electric) భారతదేశంలో నిలిపివేసింది. అయితే కంపెనీని గ్లోబల్ మార్కెట్లో కొత్త తరం కోనా ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. అయితే కోనా ఎలక్ట్రిక్ స్థానంలో హ్యుందాయ్ కంపెనీ 'క్రెటా ఎలక్ట్రిక్' కారును లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

హ్యుందాయ్ కంపెనీ తన బ్రాండ్ వెబ్‌సైట్ నుంచి కోనా ఎలక్ట్రిక్ కారును తీసివేసింది. అయితే ఇప్పటి వరకు అమ్ముడుపోకుండా డీలర్ల వద్ద ఉన్న స్టాక్ మీద కూడా కంపెనీ మంచి ఆఫర్స్ అందిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఉన్న కోనా ఎలక్ట్రిక్ కార్లను పూర్తిగా విక్రయించేసిన తరువాత మళ్ళీ కొత్త కోనా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి అవకాశం ఉండదు.

Hyundai Kona EV

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు సీకేడీ యూనిట్లుగా భారతదేశానికి వచ్చాయి. కంపెనీ ఈ కారును దేశీయ విఫణిలో ప్రారంభించిన సమయంలో రూ. 25.30 లక్షల ధరతో ప్రారంభించింది. అయితే కంపెనీ ఇటీవల ఈ కారు కొనుగోలుపైన ఏకంగా రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్స్ ప్రకటించింది. ఎంత డిస్కౌంట్స్ ప్రకటించినప్పటికీ ప్రత్యర్థుల పోటీ ఎక్కువైపోతోంది. అమ్మకాలు తాగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

అద్భుతమైన డిజైన్ కలిగిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు 39.2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ పొందింది. ఇది ఫ్రంట్ యాక్సిల్‌ మీద ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ 136 హార్స్ పవర్, 395 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు ఒక ఫుల్ చార్జితో 452 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.

Hyundai Kona EV Interior

భారతదేశంలో హ్యుందాయ్ కోనా 59నెలల్లో మొత్తం 2329 యూనిట్లను విక్రయించింది. అంటే నెలకు కేవలం 39 కార్లను మాత్రమే విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇండోనేషియా వంటి విదేశీ మార్కెట్లలో కంపెనీ కొత్త కోనా ఎలక్ట్రిక్ లాంచ్‌ చేయడానికి సన్నద్ధమవుతోంది. అయితే భారతదేశంలో మాత్రం కొత్త జనరేషన్ కోనా ఎలక్ట్రిక్ లాంచ్ గురించి అధికారిక వివరాలు వెల్లడి కాలేదు. అయితే కోనా స్థానంలో క్రెటా ఈవీ లాంచ్ చేసే అవకాశం ఉంది.

భారతదేశంలో క్రెటా ఈవీ త్వరలోనే లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ కారు కొన్ని డిజైన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా కొంతవరకు సాధారణ క్రెటాను పోలి ఉంటుంది. అయితే ఈ కారు యొక్క ఫీచర్స్ మరియు బ్యాటరీ వంటి వివరాలతో పాటు మోటార్ వివరాలు మరియు పర్ఫామెన్స్ వివరాలు కూడా అధికారికంగా తెలియాల్సి ఉంది. అంతే కాకుండా ధరలు కూడా లాంచ్ సమయంలో వెల్లడవుతుంది.

Hyundai Kona EV Charging

ఇండియన్ మార్కెట్లో కోనా ఎలక్ట్రిక్ ప్రారంభంలో కొంత ప్రజాదరణ పొందినప్పటికీ.. క్రమంగా ప్రత్యర్థులు తాకిడి పెరిగింది. దీంతో అమ్మకాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. 59 నెలల్లో కంపెనీ కేవలం 3000 యూనిట్లను కూడా విక్రయించలేకపోవడం అంటే.. ఇది అమ్మకాల్లో ఎంత వెనుకబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కారణాల వల్లనే మార్కెట్లో హ్యుందాయ్ తన కోనా ఈవీ కారును దేశీయ మార్కెట్లో నిలిపివేసింది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 26, 2024, 17:45 [IST]
English summary
Hyundai kona electric car discontinued in india check the details
Read more on: #hyundai #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+