మరో ఆలోచన లేకుండా ఎలక్ట్రిక్ కారు కొనండి..! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 600.. భారీ స్కెచ్ వేసిన హ్యుందాయ్

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా ఎలక్ట్రిక్ వాహనాల(EV) వైపు చూస్తోంది. పెట్రోల్, డిజిల్ కంటే ఈవీ కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా భారత్‌లో ఒకప్పుడు ఈవీ సేల్స్ చాలా తక్కువ సంఖ్యలో ఉండగా, ఇప్పుడు అది చాలా పెరిగిపోయింది. ప్రజలు తమ ఆలోచన ధోరణిని మార్చుకుని ఈవీ కార్లు, స్కూటర్లు, బైకులను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో డిమాండ్‌కు అనుగుణంగా ఆటోమొబైల్ తయారీ కంపెనీలు వరుసగా కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈవీలను తయారు చేసే సంస్థలకు భారీగా ప్రోత్సాహాలను అందిస్తుంది. పన్నులు తగ్గింపులు, ప్లాంట్‌లను ఏర్పాటు చేయడం విషయంలో దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ కంపెనీలకు ప్రభుత్వం సాదరంగా స్వాగతం పలుకుతుంది. భారత్‌లో ఈవీల వ్యాపారం పెరగడానికి పెద్ద ఎత్తున అవకాశాలు ఏర్పడుతున్నాయి.

కొంతమంది పెట్టుబడిదారులు స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేస్తూ ఈవీలను మార్కెట్లోకి తీసుకొచ్చి సక్సెస్ కూడా అవుతున్నారు. పెట్రోల్, డీజిల్, CNG వాహనాల సంఖ్యతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడానికి తమ వంతుగా సహాయం చేస్తున్నారు. ఒక వైపు లాభాలను ఆర్జిస్తూనే, దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఈవీలను అందించడానికి తోడ్పాటు అందిస్తున్నారు. అయితే ఈవీ వాహనాలు పెరుగుతున్న కొద్ది ఛార్జింగ్ స్టేషన్లు మాత్రం పెరగడం లేదు.

HyundaiWill Set Up 600 Ev Charging Stations

ఈవీల వినియోగం మరింత వేగంగా పెరగకపోవడానికి ప్రధాన కారణం సరైన ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులో లేకపోవడమే. అందుకే కొంత మంది మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఇష్టపడటం లేదు. దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీలు చాలా కాలంగా కొత్త ఎలక్ట్రిక్ కార్లను వినియోగదారుల కోసం విడుదల చేస్తున్నాయి. వీటి సేల్స్ ఆశించిన స్థాయిలోనే ఉన్నప్పటికీ కూడా మరికాస్త పెరగడం లేదు.

దీనికి ప్రధాన కారణం దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్ల కొరత ఉండటం. దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుండగా, ఈవీ కార్ల తయారీదారులు తమ కార్ల కోసం ప్రత్యేకంగా హైవేలు, ఇతర ప్రధాన రోడ్లలో ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా పెడుతున్నారు. తాజాగా దేశీయ దిగ్గజ సంస్థ హ్యూందాయ్ కూడా ఈ సమస్యపై ప్రధానంగా దృష్టి సారించింది.

హ్యుందాయ్(Hyundai) దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవి ఉన్నప్పటికీ కూడా ఇతర పట్టణాల్లో మాత్రం అందుబాటులో లేవు. ఇప్పుడు హ్యూందాయ్ ఈ ప్రాంతాల్లోనే వినియోగదారుల కోసం ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తుంది. కంపెనీ ఒకటి రెండు కాకుండా ఏకంగా 600 ఛార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. దీంతో కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్య చాలా వరకు తగ్గుతుంది.

ఇవన్నీ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే కాకుండా ఈ సెంటర్లలో ఇతర కంపెనీలకు చెందిన ఈవీ కార్లను కూడా ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ అధికారులు పేర్కొన్నారు. 600 ఛార్జింగ్ సెంటర్ల ద్వారా హ్యుందాయ్ కార్లకు ఛార్జింగ్ సమస్య చాలా వరకు తిరిగి రాకపోవచ్చు. వినియోగదారులు తమ కార్లను ఈజీగా ఛార్జింగ్ చేసుకోవచ్చు.

ఇప్పుడు ఉన్న కార్లకే కాకుండా రానున్న హ్యూందాయ్ ఎలక్ట్రిక్ కార్లకు కూడా ఈ ఛార్జింగ్ సదుపాయాలు బాగా ఉపయోగపడుతాయి. హ్యూందాయ్ ప్రస్తుతం మార్కెట్లో ఐయోనిక్ 5 అనే సింగిల్ ఎలక్ట్రిక్ కారను మాత్రమే విక్రయిస్తుంది. దీని ధర ఎక్కువగా ఉండటం కారణంగా అమ్మకాలు ఎక్కువగా ఉండటం లేదు. అందుకే ఈ ఏడాది నవంబర్‌లో 22 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. క్రెటా ఎలక్ట్రిక్ కారు 2025 ఏడాదిలో మార్కెట్లోకి అమ్మకానికి రాబోతుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 10, 2024, 8:30 [IST]
English summary
Hyundai motor india will set up 600 public ev charging stations
Read more on: #hyundai motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+