సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్న హ్యుందాయ్ కార్లు.. ఇకపై మీరు ఊహించని ఫీచర్లు..
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్(Hyundai) ప్రపంచవ్యాప్తంగా తన వాహనాలను విక్రయిస్తుంది. ఇండియా చాలా కాలంగా అమ్మకాల్లో మెరుగైన గణంకాలు సాధిస్తూ, ఇక్కడి లోకల్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. హ్యుందాయ్ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అధునాతన ఫీచర్లను తన వాహనాల్లో అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో తన వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసం టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీతో ఇటీవల చేతులు కలిపింది. కస్టమర్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఈ సంస్థల మధ్య డీల్ కుదిరింది. దీని ప్రకారం, హ్యుందాయ్ గ్రూప్ ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను మరింత అప్‌డేట్ చేయడానికి గూగుల్ కంపెనీ తన వంతుగా సహకారం అందిస్తుంది. దీనికి సంబంధించిన డీల్‌పై ఇరు వర్గాల ఉన్నతాధికారులు ఒకరికొకరు పత్రాలను కూడా మార్చుకున్నట్లు తెలుస్తుంది.
హ్యుందాయ్ మోటార్ గ్రూప్, గూగుల్ కంపెనీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, ఈ కంపెనీ వాహనాల్లో గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ ఆపరేటింగ్ సిస్టమ్ (AAOS)ని అందిస్తారు. డ్రైవర్లకు తెలియని ప్రాంతాలకు వెళ్తున్న సమయంలో రూట్ మ్యాప్‌ను మరింత కచ్చితంగా అందించడానికి, అలాగే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టంను మరింత అప్‌డేట్ చేయడానికి గూగుల్ తన సేవలు అందిస్తుంది.

ఎప్పటికప్పుడు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టంను అప్‌గ్రేడ్ చేస్తూ API గూగుల్ మ్యాప్స్‌కు సంబంధించిన జియోలొకేషన్ సమాచారాన్ని చేరవేస్తుంది. నావిగేషన్ సిస్టంను తదుపరంలోకి తీసుకెళ్లడానికి హ్యుందాయ్ కార్లకు గూగుల్ సాఫ్ట్‌వేర్‌ను ఇస్తుంది. దీంతో డ్రైవర్లకు రూట్‌కు సంబంధించి స్పష్టమైన సమాచారం చేరడంతో పాటు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం అనుభవాలు మరింత మెరుగుపడుతాయి.హ్యుందాయ్ మోటార్ గ్రూప్ మొదటగా తన లగ్జరీ బ్రాండ్ కియా కార్ప్‌కు చెందిన వాటిలో లేటెస్ట్ నావిగేషన్ సిస్టంను అందించడానికి ప్లాన్ చేసింది.
అయితే దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. అన్ని కార్లలో కనిపించే వాటిలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం చాలా ముఖ్యమైనది. హ్యుందాయ్ దీన్ని మరో మెట్టుకు తీసుకెళ్లడానికి దీని ఇంపార్టెన్స్‌ను మరింత పెంచడానికి గూగుల్ కంపెనీతో ఈ డీల్ చేసుకుంది. రాబోయే రోజుల్లో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మరింత అధునాతనంగా మారుతుందని మార్కెట్ వర్గాల వారు భావిస్తున్నారు. ఇప్పటికే హ్యుందాయ్ వాహనాల్లో ప్రీమియం ఫీచర్లు ఉంటాయని పేరుంది.
ఇప్పుడు ఈ కొత్త సదుపాయంతో రానున్న రోజుల్లో అధునాతన ఫీచర్లతో కారును కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి హ్యుందాయ్ కార్లు సరైన ఎంపికగా ఉంటాయి. ఎక్కువ ధర కలిగిన కార్లలో ఈ నావిగేషన్ అప్‌డేట్‌ను ఇచ్చిన తరువాత ఇతర కార్లకు కూడా అందించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కంపెనీ రాబోయే నెలల్లో వరుసగా ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలని ప్లాన్ చేసింది. ఇప్పటికే కొన్ని మోడళ్లను ప్రకటించింది.
రాబోయే ఎలక్ట్రిక్ కార్లలో కూడా ఈ అధునాతన ఫీచర్లను అందించవచ్చు. అయితే ఏ మోడల్‌కు మొదటగా అందిస్తారో స్పష్టమైన సమాచారం ఏది లభించలేదు. ఏది ఏమైనా ఒక్క కారులో ఇచ్చిన తర్వాత విడతల వారీగా మిగిలిన కార్లలో కూడా అందిస్తారు. త్వరలో దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. హ్యుందాయ్ తన కార్లను మరింత అధునాతనంగా మార్చడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.
హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఉన్నతాధికారి సాంగ్ చాంగ్-హైయాన్ మాట్లాడుతూ, కస్టమర్-కేంద్రీకృత విలువలను మరింత పెంచడానికి వారికి అనువుగా ఉండే ఫీచర్లను అందించడానికి కంపెనీ కృషి చేస్తుంది. రానున్న రోజుల్లో మరిన్ని అధునాతన ఫీచర్లను అందిస్తామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే హ్యుందాయ్ త్వరలో భారతదేశంలో మరిన్ని కార్లను విడుదల చేయాలని ప్లాన్ చేసింది. కొత్త ఏడాదిలో ఇవి మార్కెట్లో సందడి చేయబోతున్నాయి.


Click it and Unblock the Notifications








