హ్యుందాయ్‌ కార్లపై భారీ తగ్గింపు ఆఫర్లు.. ఫిబ్రవరి నెల చివరి వరకు మాత్రమే డిస్కౌంట్లు.. లిస్ట్‌!!

హ్యాందాయ్‌ మోటార్స్‌ (Hyundai Motors) సంస్థ తమ విక్రయాలను వృద్ధి చేసే చర్యల్లో భాగంగా అనేక మోడళ్లపై తగ్గింపు ధరలను ప్రకటన చేసింది. కొత్త వినియోగదారులు సహా పాత కస్టమర్లు కూడా తమ వాహనాలను అప్‌గ్రేడ్‌ చేసుకొనేందుకు ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్లలో నగదు తగ్గింంపు మరియు ఎక్స్చేంజీ బోనస్‌ సహా మరిన్ని ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది.

హ్యుందాయ్‌ i10 NIOS : హ్యాచ్‌బ్యా్క్‌ కొనుగోలు చేసేవారికోసం, హ్యుందాయ్‌ i10 NIOS పై తగ్గింపు ధరలను ప్రకటన చేసింది. ఈ కారు సీఎన్‌జీ వేరియంట్‌పై రూ.30000 క్యాష్‌ డిస్కౌంట్‌, రూ.10,000 ఎక్స్చేంజీ బోనస్‌, మరియు అదనంగా రూ.3000 ప్రత్యేక బోనస్‌ను ఇవ్వనుంది. అదే హ్యుందాయ్‌ i10 NIOS స్టాండర్డ్ వేరియంట్‌పై రూ.28000 తగ్గింపును పొందవచ్చు. అదే AMT వేరియంట్‌పై రూ.18000 వరకు తగ్గింపు ధరను పొందవచ్చు.

hyundai-grand-i10-nios

దీంతోపాటు హ్యుందాయ్‌ Aura and Verna సెడాన్లపైనా సంస్థ వివిధ డిస్కౌంట్‌ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. హ్యుందాయ్‌ Aura CNG వేరియంట్‌ రూ.33000 తగ్గింపు ప్రయోజనాలను పొందనుంది. అదే స్టాండర్డ్‌ వేరియంట్‌ అన్ని ఆఫర్లతో కలిగి రూ.18000 వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందవచ్చు.

హ్యుందాయ్‌ Verna అనేక వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కార్లపై రూ.15000 నగదు డిస్కౌంట్‌, రూ.20,000 ఎక్స్చేంజీ బోనస్‌ కింద గరిష్ఠంగా రూ.35000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ నెలలో మాత్రమే మరియు స్టాక్‌ ఉన్నంత వరకు మాత్రమే ఈ ప్రత్యేక ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని హ్యుందాయ్‌ వెల్లడించింది.

hyundai-verna-

దీంతోపాటు హ్యుందాయ్‌ టక్సన్‌ (Tucson SUV), వెన్యూ ( Venue ), అల్కజర్‌ (Alcazar) SUVలపైనా తగ్గింపు ధరను పొందవచ్చు. టక్సన్‌ SUV డీజిల్‌ వేరియంట్‌ పై రూ.50,000 వరకు తగ్గింపును పొందవచ్చు. పెట్రోల్‌ వేరియంట్‌లో రూ.4,00,000 వరకు తగ్గింపను పొందవచ్చు.

అలాగే వెన్యూ సబ్‌ కంపాక్ట్ SUVపై DCT వేరియంట్‌పై నగదు డిస్కౌంట్‌, ఎక్స్చేంజీ బోనస్‌ కింద రూ.25,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందవచ్చు. MT వేరియంట్‌ పై అన్ని ప్రయోజనాలు కలిగి రూ.30,000 వరకు పొందవచ్చు. అదే అల్కాజార్‌ SUV పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్లపై అన్ని ప్రయోజనాలతో కలిపి గరిష్ఠంగా రూ.35,000 వరకు పొందవచ్చు.

 hyundai-kona-ev

ఎలక్ట్రిక్‌ వాహనాలపైనా హ్యుందాయ్‌ సంస్థ తగ్గింపు ధరలను ప్రకటించింది. హ్యుందాయ్‌ కోనా ఎలక్ట్రిక్‌ వాహనంపై గరిష్ఠంగా రూ.4,00,000 వరకు నగదు తగ్గింపును పొందవచ్చు. ఈ కారు ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ తగ్గింపు ఆఫర్లు కేవలం ఫిబ్రవరిలో మాత్రమే లేదా స్టాక్‌ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Monday, February 5, 2024, 15:35 [IST]
English summary
Hyundai motors attracts with cash and exchange discounts on various models in feb 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+