సేఫ్టీలో హ్యుందాయ్ కారుకి 5 స్టార్ రేటింగ్.. పెద్దలు, పిల్లల రక్షణలో సూపర్ హిట్!
దేశంలో హ్యుందాయ్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీకి చెందిన కొన్ని కార్లు మార్కెట్‌ని శాసిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ అమ్మకాల్లో టాప్‌లో కొనసాగుతోంది. దీంతో పాటు, ఐ20, గ్రాండ్ ఐ10 నియోస్, ఎక్స్‌టర్ ఇతర కార్లు మార్కెట్‌లో సత్తా చాటుతున్నాయి. మారుతి తర్వాత దేశంలో ఎక్కువగా ఈ కంపెనీ కార్లనే జనాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రతీ నెల స్థిరమైన అమ్మకాలతో ఈ సంస్థకు చెందిన కార్లు మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ కంపెనీకి చెందిన ఓ కారు భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌తో అదరగొట్టింది. ఆ వివరాలు ఈ కథనంలో..
భారత్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో హ్యుందాయ్ టక్సన్ (Hyundai Tucson) ఎస్‌యూవీ 5 స్టార్ రేటింగ్‌ని సాధించింది. పెద్దలు, పిల్లల సేఫ్టీలో ఈ కారు మెరుగైన స్కోర్‌ని సాధించింది. పెద్దల ప్రొటెక్షన్ కేటగిరీలో 32కు పాయింట్లకు గానూ 30.84 స్కోర్‌ని సాధించింది. అలాగే పిల్లల సేఫ్టీలో 49 స్కోర్‌కి 41 మార్కులు సాధించింది. తద్వారా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ని పొందింది.

ఈ హ్యుందాయ్ టక్సన్ సేఫ్టీ పరంగా మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో ప్యాసింజర్ ప్రొటెక్షన్ కోసం 6-ఎయిర్‌బ్యాగ్స్, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), 360 డిగ్రీల కెమెరా ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ వంటి వివిధ సేఫ్టీ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
ఈ కారు ప్లాటినం, సిగ్నేచర్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధరలు రూ.29.02 లక్షల నుంచి రూ.35.94 లక్షల మధ్య ఉన్నాయి. ప్రస్తుతం ఈ కారు కొనుగోలుపై రూ. 85,000 అడిషనల్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఇందులో 5 మంది హాయిగా ప్రయాణించవచ్చు. దీని ధరకు తగినట్లుగానే ఇందులో భారీ ఫీచర్లను అందించారు.

ఈ హ్యుందాయ్ టక్సన్ 2 పవర్ట్రెయిన్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇందులో ఒకటి 2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 156 ps వద్ద 192 nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇక మరో 2-లీటర్ డీజల్ ఇంజిన్ 186 ps పవర్‌ని, 416 nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఈ ఎస్ యూవీలో ఏడబ్ల్యూడీ (ఆల్ వీల్ డ్రైవ్) టెక్నాలజీని అమర్చారు.
వేరియంట్లను బట్టి ఇది 6-స్పీడ్, 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది లీటరుకు 18 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్, అమెజాన్ గ్రే, స్టారీ నైట్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (10.25 ఇంచెస్), సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 540 లీటర్ల కెపాసిటీ గల బూట్ స్పేస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇక హ్యుందాయ్ లైనప్‌లలోనే 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ని పొందిన మొట్ట మొదటి కారుగా ఉంది. ఈ వార్త ఇప్పుడు వినియోగదారుల విశ్వాసాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. రాబోయే రోజుల్లో వివిధ హ్యుందాయ్ కార్లు కూడా ఇటువంటి రేటింగ్‌నే పొందే అవకాశం ఉంది. ఇక ఈ కారు జీప్ కంపాస్, సిట్రోయిన్ సీ5 ఎయిర్‌క్రాస్, ఫోక్స్‌వ్యాగన్ టైగూన్‌తో పోటీపడుతుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications