మార్కెట్‌లో మంచి కారు.. అక్టోబర్‌లో సేల్స్‌ తగ్గాయి అయినా కానీ అప్పు చేసి మరీ కొనవచ్చు!

మార్కెట్‌లో హ్యుందాయ్‌ వెన్యూకి (Hyundai Venue) భారీ డిమాండ్‌ ఉంది. కొద్ది రోజుల క్రితమే ఈ ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ వెన్యూని సరికొత్త అడ్వెంచర్‌ వెర్షన్‌లో తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ పాపులర్ హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీ పలు వేరియంట్లు, 3 ఇంజిన్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ఎస్‌యూవీ ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో వస్తుంది. మార్కెట్‌లో హ్యుందాయ్ కార్లలో వెన్యూ వెర్షన్లు సరికొత్త రికార్డుని నెలకొల్పుతున్నాయి. హ్యుందాయ్ వెన్యూకి సంబంధించి అక్టోబర్‌ 2024 అమ్మకాల నివేదిక విడుదల అయ్యింది. ఆ వివరాలు ఈ కథనంలో..

తాజాగా విడుదలైన అమ్మకాల ప్రకారం గత నెలలో హ్యుందాయ్ వెన్యూ అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. అయినా కానీ మార్కెట్‌లో ఈ కారుకి మంచి డిమాండ్ ఉంది. హ్యుందాయ్ వెన్యూ అక్టోబర్ 2024 లో మొత్తం 10,901 యూనిట్లను విక్రయించింది. హ్యుందాయ్ వెన్యూ గత ఏడాది అక్టోబర్‌ 11,581 యూనిట్లతో పోల్చిస్తే సేల్స్‌ తగ్గాయి. గత ఏడాదితో పోల్చితే ఈ అమ్మకాలు 6 శాతం క్షీణించాయి.

Hyundai Venue October 2024 Sales Report

మార్కెట్‌లో హ్యుందాయ్ వెన్యూ కొన్ని మార్పులతో పాటు అత్యంత శక్తివంతమైన డీజిల్ ఇంజిన్‌తో సహా కొన్ని అప్‌డేట్స్‌తో మంచి అమ్మకాలను రాబడుతోంది. ఈ హ్యుందాయ్ వెన్యూలో LED టెయిల్‌లైట్స్‌, సిల్వర్ ఫాక్స్ బాష్ ప్లేట్‌తో పాటు రియర్ బంపర్‌తో కూడిన స్కూప్-అవుట్, బ్లాక్ కలర్ ప్లాస్టిక్‌తో జత చేసిన నంబర్ ప్లేట్ సెక్షన్ వంటివి ఉన్నాయి.

ఇక దీని ఇంటీరియర్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేకు సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు డిజిటల్ డ్రైవర్-సైడ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇందులోని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గూగుల్ అసిస్ట్, అమెజాన్ అలెక్సాకు సైతం సపోర్ట్ చేస్తుంది. అలాగే హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్టివిటీ కార్ సూట్ ద్వారా 60కి పైగా కనెక్టివిటీ కార్ ఫీచర్లను కలిగి ఉంది.

Hyundai Venue Sales

డ్రైవర్ సైడ్ డిజిటల్ డిస్ ప్లే, వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్‌, ఎయిర్ ప్యూరిఫైయర్, కూల్డ్ గ్లో బాక్స్, క్రూయిజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వెన్యూలో 1.5-లీటర్ 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ కలదు. ఇది క్రెటా మాదిరిగానే పవర్‌ని అలాగే టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఇందులోని తాజా డీజీల్‌ ఇంజిన్‌ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్‌కి బదులుగా ఇప్పుడు 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తోనూ లభిస్తుంది. ఈ హ్యుందాయ్ ఎస్‌యూవీలోని ఇంజిన్ 113.5bhp పవర్, 250nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇతర ఇంజిన్ ఆప్షన్స్‌ 1.2-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ కూడా ఉన్నాయి. ఇవి కూడా మంచి ఫర్ఫామెన్స్‌ని అందిస్తాయి.

Hyundai Venue Features

ఇందులోని 1.2-లీటర్ ఇంజిన్ 83bhp పవర్, 114nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఇందులోని 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 120 bhp పవర్, 172 nm టార్క్‌ని విడుదల చేస్తుంది. 1.2-లీటర్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కానీ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ AMT లేదా 7-స్పీడ్ DCTతో అందించబడుతుంది.

ఈ హ్యుందాయ్‌ వెన్యూ డీజీల్‌ వెర్షన్‌ 20 కి.మీ మైలేజీని ఇస్తుంది. అలాగే పెట్రోల్ వెర్షన్స్‌ 18 నుంచి 19 కి.మీ మైలేజీని అందిస్తాయి. ఇది ఏడు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇది E, E+, ఎగ్జిక్యూటివ్, S, S+/S(O), SX, SX(O) వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. పైన చెప్పిన విధంగా SUV అడ్వెంచర్ ఎడిషన్‌లోనూ అందుబాటులో ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, November 9, 2024, 17:28 [IST]
English summary
Hyundai venue october 2024 sales report and specifications details in telugu
Read more on: #hyundai #car sales #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+