హ్యుందాయ్ వెన్యూ కొత్త వేరియంట్.. అందరికీ ఇష్టమైన ఫీచర్‌తో - ధర తక్కువే!

దేశీయ విఫణిలో ఎన్ని కార్లు లాంచ్ అయినా.. ఎన్ని బైకులు లాంచ్ అయినా, కస్టమర్లు మాత్రం ఏదో ఒక కొత్తదనం కోరుకుంటారు. ఈ విషయాలను గ్రహించి వాహన తయారీ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేయడం, అప్డేటెడ్ కార్లను లాంచ్ చేయడం వంటివి చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్ ఇండియా' తాజాగా 'వెన్యూ ఎస్ (ఓ) ప్లస్' వేరియంట్‌ను ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ ఫీచర్‌తో లాంచ్ చేసింది. ఈ కారు ధర, ఇతర వివరాలను వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.

హ్యుందాయ్ ఇండియా లాంచ్ చేసిన కొత్త వెన్యూ ఎస్ (ఓ) ప్లస్ వేరియంట్ ధర రూ. 10 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు ఇప్పుడు అందరికీ ఇష్టమైన ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ ఫీచర్ పొందింది. ఈ వేరియంట్ 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే లభిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము.

Hyundai Venue S O Plus Launched

మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ వెన్యూ ఎస్ (ఓ) ప్లస్ వేరియంట్ ధర దాని 1.2 లీటర్ ఎస్ (ఓ) వేరియంట్ కంటే రూ. 12000 ఎక్కువ. అయితే ఇదే లైనప్‌లోని సన్‌రూఫ్ కలిగిన ఎస్ఎక్స్ వేరియంట్ ధర రూ. 11.05 లక్షలు. అంటే ఈ వేరినయ్ కంటే కూడా ఎస్ (ఓ) ప్లస్ వేరియంట్ ధర రూ. 1 లక్ష తక్కువని తెలుస్తోంది (పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

డిజైన్ పరంగా చూడ చక్కగా ఉన్న ఈ కారు ఎల్ఈడీ డీఆర్ఎల్, ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు, టెయిల్ లైట్, బ్రాండ్ లోగో మొదలైనవన్నీ కలిగి ఉంటుంది. ఈ కారులో లోపల వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేసే 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్స్ డిస్‌ప్లే ఉంటుంది.

Hyundai Venue

మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు అధునాతన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు రివర్స్ కెమెరా వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతకు పెద్ద పీట వేస్తాయి. కాబట్టి ప్రమాదంలో కూడా ఇవి కొంత రక్షణ అందిస్తాయి.

ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 82 Bhp పవర్ మరియు 113.8 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇదివరకే చెప్పుకున్నట్లు ఈ కారు కేవలం 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. కాగా హ్యుందాయ్ వెన్యూ ఇతర వేరియంట్స్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ వంటి ఆప్షన్లలో కూడా లభిస్తాయి.

Hyundai Venue Interior

హ్యుందాయ్ ఇండియా ఎప్పటికప్పుడు ఆధునిక కార్లను లాంచ్ చేయడం వల్ల ఎక్కువమంది ఈ బ్రాండ్ కార్లను ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. కంపెనీ గత జులై నెలలో మొత్తం 49013 వాహనాలను విక్రయించింది. ఎగుమతుల్లో 15550 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే అమ్మకాల పరంగా 2023 జులై కంటే 3.21 శాతం తక్కువ కావడం గమనార్హం. అయితే ఈ నెలలో మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, August 2, 2024, 17:30 [IST]
English summary
Hyundai venue s o plus launched with electric sunroof at rs 10 lakh
Read more on: #hyundai #new launches #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+