అయ్యే పాపం ఈ కారు పరిస్థితి ఇలా మారిపోయిందేంటి.. విషయం తెలిస్తే కన్నీళ్లాగవు.. షాక్‌లో హ్యుందాయ్
ఇండియాలో దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థగా ఉన్న హ్యుందాయ్ మోటార్స్ నుంచి విడుదలైన చాలా మోడళ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇటీవల ముగిసిన దసరా, దీపావళి పండుగల సమయంలో కూడా కంపెనీకి చెందిన పలు కార్లు అధికంగా అమ్ముడుపోయాయి. అయితే ఒక మోడల్ దీనికి భిన్నంగా తక్కువ విక్రయాలను నమోదు చేసింది. అదే హ్యుందాయ్ వెర్నా సెడాన్(Hyundai verna sedan). తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం, వెర్నా ఈ పండుగ సీజన్‌లో చాలా తక్కువ అమ్మకాల గణంకాలను నమోదు చేసింది. ఈ అక్టోబర్ నెలలో హ్యుందాయ్ వెర్నా 1,272 యూనిట్లు అమ్ముడుపోయింది. అయితే ఇది గత ఏడాది ఇదే నెలలో 2,313 యూనిట్లు అమ్మడు కాగా, ప్రస్తుత అక్టోబర్ నెలలో విక్రయాలు 45 శాతం వరకు తగ్గాయి.
మామూలుగా అయితే హ్యుందాయ్ వెర్నాకు దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో కంపెనీ కూడా ఈ పండుగల సమయంలో వెర్నా విక్రయాలు గత ఏడాది కంటే భారీగా ఉంటాయిని అంచనా వేసింది. అక్టోబర్ అందించిన ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఇతర తగ్గింపులు ఈ కారు విక్రయాలను పెంచడానికి ఉపయోగపడుతాయని భావించినప్పటికీ అంచనాలు మాత్రం తలక్రిందులు అయ్యాయి.

ఇండియా మార్కెట్లో వెర్నా సెడాన్ S, S,SX (O),EX అనే నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. ఈ కారులో 1.5 లీటర్ నేచురల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. S, EX ట్రిమ్‌లలో మాత్రం ప్రత్యేకంగా 1.5 లీటర్ నేచురల్ అస్పిరేట్ ఇంజిన్ ఉంటుంది. ఇది ప్రధానంగా 113.4 bhp పవర్, 144 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇవి 6-స్పీడ్ మాన్యువల్, iVT గేర్‌బాక్స్‌ను కలిగి ఉన్నాయి.
అదే S, SX (O) వేరియంట్‌లు మాత్రం 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తాయి. ఈ ఇంజిన్ 160 bhp పవర్, 253 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. వెర్నాలో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ డిస్‌ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లోపల టచ్ కంట్రోల్ సిస్టం, క్లైమేట్ కంట్రోల్, మంచి పాటల అనుభూతిని అందించడానికి బోస్ సౌండ్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.

వెర్నా క్యాబిన్ డిజైన్ చాలా అందంగా ఉంటుంది. మరిన్ని అదనపు ఫీచర్లు కూడా ప్రయాణికుల కోసం లోపల ఉన్నాయి. డ్యూయల్-టోన్ లేత గోధుమరంగు, లెదర్ అప్హోల్స్టరీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్,65+ బ్లూలింక్ కనెక్టివిటీ ఫీచర్‌లతో కొత్త 2-స్పోక్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్స్, ప్రయాణికుల భద్రత కోసం ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్) టెక్నాలజీ వంటివి ఉన్నాయి.
మరింత భద్రత కోసం ఫార్వర్డ్ కొలిషన్ అలర్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, హై బీమ్ అసిస్ట్,లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, అలాగే, రియర్ క్రాస్ ట్రాఫిక్‌తో పాటు స్టాప్ అండ్ గో వెండింగ్‌తో పాటు 17 లేటెస్ట్ భద్రత ఫీచర్లను వెర్నాలో అందించారు. ప్రధానంగా కారులో 6 ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. ఈ కారు గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన మరో విషయం ఉంది.

ప్రమాద సమయంలో కారులో ఉన్న ప్రయాణికుల రక్షణకు సంబంధించి గ్లోబల్ ఎన్‌సీఏపీ టెస్ట్‌ను నిర్వహించారు. దీనిలో పెద్దల రక్షణకు సంబంధించి 34 పాయింట్లకు 28.18 పాయింట్లు సాధించింది. అదే పిల్లల రక్షణ టెస్ట్‌లో 49 పాయింట్లకు 42 పాయింట్లను స్కోర్ చేసి, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. అయితే ఈ రేటింగ్ వచ్చినప్పటికి కూడా కొన్ని లోపాలు ఉన్నాయని టెస్ట్‌లో తేలింది.


Click it and Unblock the Notifications








