CNG కార్లు మాములివి కావు బాబోయ్.. వీటి డిమాండ్ చూస్తే నోరేళ్లబెడతారు.. ఏకంగా 6 లక్షలకు పైనే
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఉండటంతో అందరి చూపు సీఎన్‌జీ(CNG), ఎలక్ట్రిక్ వాహనాలపై పడింది. దీంతో వీటి అమ్మకాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా CNG వాహనాల రిటైల్ అమ్మకాలు గత కొంత కాలంగా కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా విడుదలైన డేటా ప్రకారం, ఈ ఏడాది జనవరి నుంచి మొదలుకుని అక్టోబర్ వరకు మొత్తం సీఎన్‌జీ అమ్మకాలు 6,07,287 యూనిట్లుగా ఉన్నాయి. ఈ గణంకాలను చూసినట్లయితే ఇండియాలో సీఎన్‌జీ అమ్మకాల పట్ల ఉన్న ప్రజల నుంచి ఏ విధమైన డిమాండ్ ఉందో అర్ధం అవుతుంది. ఈ డేటాను పరిశీలిస్తే, ఇది మునుపటి సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే 43 శాతం ఎక్కువగా ఉంది. 2023 జనవరి నుంచి అక్టోబర్ వరకు అమ్మకాలు 5,90,000 యూనిట్లుగా ఉన్నాయి. దసరా, దీపావళి పండుగ సీజన్ కూడా అమ్మకాలు పెరగడానికి ఎక్కువగా దోహదపడింది. కంపెనీల వారీగా అమ్మకాలను ఒక సారి చూద్దాం
హ్యుందాయ్: ఆటోమొబైల్ పరిశ్రమలో చాలా కంపెనీల మధ్య పోటీ వాతావరణం ఉంది. దీంతో హ్యుందాయ్ కంపెనీ దీన్ని ఎదుర్కొడానికి వరుసగా CNG లను విడుదల చేస్తూ తన అమ్మకాలతో ఇతర కంపెనీలకు పోటీ ఇస్తుంది. డేటా ప్రకారం, హ్యుందాయ్ అక్టోబర్‌లో 9,725 యూనిట్ల సీఎన్‌జీ అమ్మకాలను నమోదు చేసింది.

అయితే మార్కెట్ వాటా గతేడాది 12.12% నుంచి 10.12%కి స్వల్పంగా తగ్గినప్పటికీ త్వరలో మరింత పెరిగే అవకాశం ఉంది. హ్యుందాయ్ తన సీఎన్‌జీ అమ్మకాలను పెంచుకోడానికి Aura కొత్త బేస్ వేరియంట్‌ను పరిచయం చేసింది. అలాగే, డ్యూయల్-సిలిండర్‌తో గ్రాండ్ i10 నియోస్ హ్యాచ్‌బ్యాక్‌ను కూడా విడుదల చేసింది. త్వరలో కంపెనీ మరిన్ని సీఎన్‌జీ వేరియంట్లను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది.
మారుతీ సుజుకీ: ఈ కంపెనీ ప్రస్తుతం 13 సీఎన్‌జీ మోడళ్లను విక్రయిస్తుంది. డేటా ప్రకారం, మారుతీ సుజుకీ ఈ సంవత్సరం 4,33,033 యూనిట్లను విక్రయించి 72 శాతం వాటాతో CNG విభాగంలో అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా కంపెనీ ఒక్క అక్టోబర్ నెలలోనే 70,281 సీఎన్‌జీలను విక్రయించి సరికొత్త రికార్డును సాధించింది. మారుతీ సుజుకీ ఇటీవలే సీఎన్‌జీ లైనప్‌కు నాల్గవ తరం స్విఫ్ట్‌ను జతచేసింది.
టాటా మోటార్స్: దేశీయ దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ CNG విభాగంలో ఇతర కంపెనీలకు బలమైన పోటీదారుగా ఉంది. అమ్మకాల్లో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ తర్వాత మూడో స్థానాన్ని ఆక్రమించింది. మొత్తంగా టాటా మోటార్స్ 2024 జనవరి నుంచి అక్టోబర్ నాటికి 94,374 సీఎన్‌జీ వాహనాలను విక్రయించింది. ఇది సంవత్సరానికి 104% వృద్ధి. కంపెనీ ఒక్క అక్టోబర్ నెలలోనే దాదాపు 16,586 వాహనాలను అమ్మడం గమనార్హం.
ముఖ్యంగా అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం దసరా, దీపావళి. పండుగల సమయంలో టాటా మోటార్స్ తన ఉత్పత్తులపై భారీ తగ్గింపులు, డిస్కౌంట్‌లను అందించడం ద్వారా జనాలు విపరీతంగా టాటా సీఎన్‌జీలను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. టాటా టియాగో, పంచ్, ఆల్ట్రోజ్, టిగోర్ వంటి సీఎన్‌జీ మోడళ్లను విక్రయిస్తుంది. వీటితో పాటు తన ఇతర మోడళ్లలో సైతం CNG లను తీసుకురావాలని ప్రయత్నిస్తుంది.
టయోటా: ఈ కంపెనీ కూడా క్రమంగా CNG మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి పెట్టింది. దీంతో గత పది నెలల కాలంలో టయోటా విక్రయాలు దాదాపు 12,355 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. ముఖ్యంగా పండుగల సమయం అక్టోబర్ నెలలో టయోటా సీఎన్‌జీ అమ్మకాలు 2,800 యూనిట్లుగా ఉన్నాయి. మిగతా నెలలతో పోలిస్తే ఈ ఒక్క నెలలోనే అమ్మకాలు ఎక్కువగా జరగడం గమనార్హం.


Click it and Unblock the Notifications








