అదృష్టవంతులు ఎవరో తెలుసా..? కొత్త కారును కొన్నవారే.. ఎందుకో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు!
మరికొద్ది రోజుల్లో 2024 ఏడాది ముగియనుంది. భారతీయ ఆటోమొబైల్ రంగం ఈ సంవత్సరంలో ఎంతో వృద్ధి చెందింది. దిగ్గజ వాహన తయారీ కంపెనీలు ఎన్నో ఎత్తుపల్లాలు చూశాయి. విక్రయాల పరంగా 2023 ఏడాది కంటే కూడా 2024లో ఎక్కువగా నమోదయ్యాయి. అధునాతన ఫీచర్లతో కూడిన కొత్త కార్లు చాలా వరకు ఈ ఏడాదిలోనే మార్కెట్లోకి వచ్చాయి. ఇవన్నీ కూడా దాదాపు మంచి అమ్మకాలను సాధించాయి. ఇదిలా ఉంటే ఆటోమొబైల్ తయారీ దారులు కస్టమర్లకు కొత్త ఏడాదిలో బ్యాడ్‌న్యూస్ అందించారు. రాబోయే 2025 ఏడాదిలో వాహనాల ధరలను పెంచుతున్నట్లు ఇటీవల వెల్లడించారు. నిర్వహణ ఖర్చులు, ఉత్పత్తి విలువ పెరగటం కారణంగా తయారీదారులందరూ బడ్జెట్ కార్ల నుండి మొదలుకుని ప్రీమియం, లగ్జరీ మోడళ్ల వరకు ధరలు పెంచడానికి సిద్ధమయ్యాయి.
చాలా కార్ల తయారీదారులు జనవరి 1, 2025 నుండి ధరలు పెంచబోతున్నారు. ఈ పెరుగుదల ఎంపిక చేసిన మోడల్, వేరియంట్‌ను బట్టి ఉంటుంది. కొత్త ఏడాదిలో కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారికి ఇది పెద్ద బ్యాడ్ న్యూస్. కొత్త కారును సొంతం చేసుకునే వారు వెంటనే ధరలు పెరగకముందే కొనడం చాలా ఉత్తమం. నెల రోజుల వ్యవధిలో ఎక్కువ ధర పెట్టి కొనడం కంటే ముందుగా త్వరపడటం బెస్ట్.

దేశీయ దిగ్గజ కంపెనీ MG మోటార్ ఇండియా Aster, Hector, కామెట్ ఈవీ, ZS ఈవీ, విండ్సర్ ఎలక్ట్రిక్ కార్లపై 3 శాతం ధరల పెరుగుదలను తాజాగా ప్రకటించింది. ఈ మోడళ్ల జనవరి 1 నుంచి పెరిగిన కొత్త ధరల ప్రకారం అందుబాటులో ఉంటాయి. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ కెపాసిటీ పెరగడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంపుదల చేయక తప్పట్టేదని కంపెనీ పేర్కొంది.
దేశీయ ప్రముఖ కంపెనీ మహీంద్రా కూడా వినియోగదారులకు గట్టి షాక్ ఇచ్చింది. కొత్త ఏడాది నుంచి స్కార్పియో & స్కార్పియో ఎన్,బొలెరో, బొలెరో నియో, బొలెరో నియో ప్లస్, XUV700, XUV 3XO, XUV400 EV, థార్, థార్ రాక్స్ ధరలను 3 శాతం వరకు పెంపుదలను ప్రకటించింది. ఇవన్నీ కూడా దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ వాహనాలుగా ఉన్నాయి.

భారత్‌తో వాహనాల అమ్మకాల్లో టాప్ స్థానంలో ఉండేటువంటి మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ తన అరేనా, నెక్సా పోర్ట్‌ఫోలియోల ద్వారా కార్ల ధరలను కొత్త ఏడాదిలో 4 శాతం వరకు పెంచడానికి సిద్థమైందని సమాచారం. అయితే కంపెనీ దీనిపై త్వరలో మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. సాధారణంగా మారుతీ కార్లు చాలా వరకు బడ్జెట్ ధరల్లోనే లభిస్తాయి. అయితే పెంపుదల నిర్ణయంతో కంపెనీ కార్లు మరింత ప్రియం కానున్నాయి.
మరో వాహన తయారీ కంపెనీ నిస్సాన్ కూడా మిగతా కంపెనీల బాటలోనే నడవడానికి సిద్ధమైంది. ఉత్పత్తి ఖర్చులు, నిర్వహణ ఖర్చులు పెరగడం కారణంగా కొత్త ఏడాదిలో వాహనాలనకు మరింత ఎక్కువ డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కంపెనీ ఫేస్‌లిఫ్టెడ్ మాగ్నెట్ SUV ధరను 2 శాతం పెంచనున్నట్లు తెలిపింది. మిగతా వేరియంట్ల వారీగా ధరల పెరుగుదల వివరాలను మరికొద్ది ప్రకటించే అవకాశం ఉంది.

దక్షిణ కొరియా బ్రాండ్ హ్యుందాయ్ ఇండియా కంపెనీ మిగతా వాటికంటే ముందుగానే రూ.25,000 ధర పెంపుధలను ప్రకటించింది. ప్రస్తుతం ఇది దేశీయంగా గ్రాండ్ i10,i20 వెన్యూ, టాప్ సెల్లింగ్ ఎస్‌యూవీ క్రెటా, ఎక్సెటర్ నుండి Ioniq 5 EV వంటి ప్రీమియం మోడళ్లను విక్రయిస్తుంది. కొత్త ఏడాదిలో వీటి ధరల్లో మార్పులు వస్తాయి. కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉంటే ఈ కొద్ది రోజుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం బెస్ట్.


Click it and Unblock the Notifications








