మీకు తెలుసా.. కార్లలో ఈ ఫీచర్‌ను స్టేటస్ సింబల్‌గా చూస్తారట.. దీని కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు.!!
దేశంలో గత కొన్నేళ్లుగా కార్ల విక్రయాలు భారీగా పెరిగాయి. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ట్రెండ్‌ను పరిశీలిస్తే.. ఎకనామిక్ కార్ల పట్ల ప్రజల్లో మొగ్గు తగ్గినట్లుగా తెలుస్తోంది.. కాగా ప్రీమియం ఫీచర్లతో కూడిన వాహనాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగినట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు కార్లలోని వివిధ సెగ్మెంట్లలోని కాంపాక్ట్ SUVలను కొనేందుకు కస్టమర్లు ఉత్సాహం చూపిస్తున్నారు.
భారత్‌లో కార్ల విక్రయ గణాంకాలను పరిశీలిస్తే.. 2022లో 35,49,2013 యూనిట్ల కార్లు అమ్ముడైనట్లుగా జాటో డైనమిక్స్ ఇండియా వెల్లడించింది. వాటిలో 14,76,911 యూనిట్లు SUVలు కాగా, 12,43,685 యూనిట్ల హ్యాచ్‌బ్యాక్‌లు సేల్ అయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గణాంకాల ద్వారా SUVల అమ్మకాలు పెరగ్గా.. హ్యాచ్‌బ్యాక్‌లకు ప్రజల్లో డిమాండ్ తగ్గుతోందని అర్థమవుతోంది.

అయితే ఈ SUVలలో కూడా, ప్రజలు ప్రీమియం ఫీచర్లు కలిగిన కార్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారట. ముఖ్యంగా టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, కీలెస్ ఇగ్నిషన్, డ్యూయల్ జోన్ AC వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్న కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే వీటితో పాటు ఇటీవల కాలంలో ప్రీమియం ఫీచర్లలో ఓ ఫీచర్(Demand For Sunroof Feature)పై కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారట. అదేంటంటే..
కారు కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు సన్‌రూఫ్ ఫీచర్(Sunroof Feature)ను ఎక్కువగా ఇష్టపడుతున్నారట. గతంలో ఖరీదైన, ప్రీమియం కార్లకే పరిమితమైన ఈ ఫీచర్ ఇప్పుడు సాధారణ కార్లలో కూడా ప్రవేశపెట్టడంతో సన్‌రూఫ్ ఉన్న కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉందట. ఈ ఫీచర్ కారణంగా ఈ ఐదేళ్లలో కార్ల డిమాండ్ 26 శాతం పెరిగిందని జాటో డైనమిక్స్(Jato Dynamics India) వెల్లడించింది.

కాగా కస్టమర్లలో సన్‌రూఫ్ ఫీచర్‌కు ఉన్న డిమాండ్‌ను చూసి చాలా ఆటో కంపెనీలు రూ.10 లక్షల లోపు ధర కలిగిన కార్లలో కూడా ఈ ఫీచర్‌ను అందిస్తున్నాయి. తద్వారా దేశంలో సన్‌రూఫ్ ఉన్న కార్లకు డిమాండ్ పుంజుకుంది. జాటో డైనమిక్స్ ఇండియా నివేదిక ప్రకారం, సన్‌రూఫ్ ఉన్న కార్ల వాటా 2019లో 3 నుంచి 5 శాతం ఉండగా, అది 2023లో అది 26 శాతానికి పెరిగింది.
సన్‌రూఫ్ కార్లకు ఉన్న డిమాండ్‌తో ఇప్పుడు ఆటో కంపెనీలు దానిని తయారు చేయడానికి కొత్త ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. కాగా సన్‌రూఫ్ ఫీచర్ తర్వాత వైర్‌లెస్ ఛార్జింగ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, కీలెస్ ఇగ్నిషన్, డ్యూయల్ జోన్ AC ఫీచర్లను కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తేలింది. అయితే భారత్‌లో దాదాపు 85 శాతం కాంపాక్ట్ SUV కార్లు సన్‌రూఫ్ ఫీచర్‌తో వస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

సన్‌రూఫ్ ఫీచర్(Sunroof Feature Cars Demand)కు ఇంత డిమాండ్ ఉండటానికి కారణం.. భారత కస్టమర్లు సన్‌రూఫ్‌ను లగ్జరీ ఫీచర్‌గా భావించడమే. అంతే కాకుండా దీనిని వారు తమ స్టేటస్‌కు సింబల్‌గా కూడా భావిస్తున్నారు. కాగా సన్‌రూఫ్‌తో వచ్చే కార్ వేరియంట్‌లు సాధారణ కార్లతో పోలిస్తే రూ. 50,000 నుంచి రూ. 80,000 ఎక్కువ ఉంటున్నాయి.

దేశంలో సన్‌రూఫ్ ఫీచర్‌కు ఉ్నన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కూడా గత ఏడాది సన్‌రూఫ్ ఫీచర్‌తో బ్రెజ్జా SUVని మార్కెట్లోకి విడుదల చేసింది. కాగా ప్రస్తుతం భారత మార్కెట్లో రూ. 10 నుంచి రూ. 15 లక్షల బడ్జెట్‌లో వస్తున్న దాదాపు అన్ని కార్లలో సన్‌రూఫ్ ఫీచర్ స్టాండర్‌గా వస్తోంది.


Click it and Unblock the Notifications








