భారతీయులు ఎక్కువగా ఏ కలర్‌ కార్లను ఇష్టపడుతున్నారో తెలుసా.. వాటిని చూస్తే మనసు పారేసుకుంటారు.!!

కారు కొనడమనేది చాలా మందికి కల. జీవితంలో ఒక్కసారైనా తమ బడ్జెట్‌(Cars Colours) ధరలో తమకు నచ్చిన కారున కొనుగోలు చేస్తారు. అయితే ఎవరైనా సరే కారు కొనేముందు చాలా విషయాలను పరిశీలిస్తారు. ధర, మైలేజ్‌, పనితీరు ఇలా చాలా చూస్తారు. కానీ వీటి తర్వాత మరో ముఖ్యమైనది కలర్‌. అవును కారు కలర్‌ కూడా కస్టమర్ల ఫేవరెట్లలో ఒక భాగమే.

డ్రెస్‌, చెప్పులు, ఇంట్లో ఫర్నీచర్స్, బైక్‌.. ఇలా ఏవైనా సరే ప్రజలు తమకు నచ్చిన కలర్‌లోనే కొంటుంటారు. ఆ కలర్‌ సెలెక్షన్ అనేది వారి అభిరుచిని తెలియజేస్తుంది. అందుకే కొత్త కారు కొనుగోలు చేసినప్పుడు దాని కలర్ విషయంలో కూడా అసలు కాంప్రమైజ్ అవ్వరు. తమకు నచ్చిన, కావాల్సిన కలర్‌నే కొనుగోలు చేస్తారు.

Indians-Prefer-These-Colour-Cars-Mostly

అందుకే ఆటో మొబైల్ తయారీ కంపెనీలు కూడా కస్టమర్లు ప్రిఫర్‌(New Car Colours) చేసే కలర్స్‌లోనే కార్లకు పెయింట్‌ ఫినిషింగ్ చేస్తుంటారు. ఈ ప్రాధాన్యత లగ్జరీ కార్లలో కూడా ఉంది. ఇంకా సెలబ్రిటీలు తాము అంతకుముందే కొనుగోలు చేసిన ఖరీదైన కారుకు లక్షలు ఖర్చులు చేసి మరీ తమకు నచ్చిన కలర్‌ పెయింటింగ్‌తో కారును సిద్ధం చేయిస్తారు.

ఇక ఈ విషయం పక్కన పెడితే ఇటీవల ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది. భారత ప్రజలు ఏ కలర్‌ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారనే దానిపై అధ్యయనం చేశారు. సాధారణ కార్లు, ప్రీమియం కార్లు, లగ్జరీ కార్లు ఇలా వివిధ రకాల కార్లను కొనుగోలు చేసిన వారి అభిరుచిని పరీశిలిస్తే.. కస్టమర్లు ఎక్కువగా ఏ కలర్‌ కార్లను కొనుగోలు చేస్తున్నారో తెలుసా.??

Indians-Prefer-These-Colour-Cars-Mostly

SUVలు మరియు లగ్జరీ కార్లను కొనుగోలు చేసేవారు తమ ఫేవరెట్‌ ఎవర్‌గ్రీన్ కలర్‌గా బ్లాక్(Black Colour Edition) కలర్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారట. ఆ తర్వాత బ్లూ కలర్‌ కార్లను ఎక్కువగా సెలెక్ట్‌ చేస్తున్నారట. అయితే గతంలో ఎక్కువగా కొత్త కారు కొనుగోలు చేసేవారు ఎక్కువగా తెలుపు రంగు కలర్ కార్లకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈ సారి నివేదికలో కూడా వైట్‌ కలర్‌ టాప్‌లో ఉంటుందనే అంచనాలను మార్చేసింది.

భారత మార్కెట్లో లగ్జరీ కార్లకు, ఎస్‌యూవీలకు ప్రాధాన్యత పెరుగుతుండటంతో కలర్‌ సెలెక్షన్‌ కూడా దీనిని ప్రభావితం చేస్తుంది. ఈ క్రమంలో కస్టమర్లు ఎక్కువగా బ్లాక్‌, గ్రే వంటి అక్రోమాటిక్‌ కలర్స్‌ నుంచి కొంచెం డిఫరెంట్‌గా కూడా ఆలోచిస్తున్నారు. సిల్వర్‌, వైట్‌, గ్రే కలర్‌ మార్కెట్లో మార్కెట్లో ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తున్నా.. చాలా మంది కస్టమర్లు కూడా బ్లూ(Blue Colour Cars) కలర్‌ కార్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

Indians-Prefer-These-Colour-Cars-Mostly

అందుకే మార్కెట్లో కార్ల తయారీదారులు ఎక్కువగా నీలం మరియు ఎరుపుతో సహా విలక్షణమైన షేడ్స్‌ను అందించడం ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో SUVలు మరియు లగ్జరీ కార్లను కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు ఎక్కువగా ఎవర్‌గ్రీన్‌ కలర్‌కు నలుపు కలర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. తర్వాత ఎక్కువగా బ్లూ కలర్‌ను ప్రిఫర్‌ చేస్తున్నారు.

దీని తర్వాత మరో కొత్త ట్రెండ్‌.. ఆటో మేకర్లు ఎక్కువగా బ్లాక్‌ కలర్‌ కార్లను స్పెషల్‌ ఎడిషన్‌గా పరిచయం చేస్తూ మార్కెట్లో ఆ కలర్‌కు ఉన్న ప్రత్యేకతను తెలియజేస్తున్నారు. పలు ఆటో కంపెనీలు తమ ప్రముఖ కార్‌ మోడళ్లను ప్రత్యేకంగా బ్లాక్‌ కలర్‌ ఎడిషన్‌లో పరిచయం చేయడాన్ని చూస్తూనే ఉన్నాం. వీటికి ఆదరణ కూడా పెరుగుతుండటం విశేషం.

Indians-Prefer-These-Colour-Cars-Mostly

ఇక SUV కొనుగోలుదారులు ఎక్కువగా ఆకుపచ్చ(Green) కలర్‌కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారట. ఈ కలర్‌ కార్లను కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని నివేదికలు చెబుతున్నారు. ఇక రేర్‌ కలర్‌ గోల్డ్‌ రంగు. కొత్త కారు కొనుగోలు చేసేవారిలో బంగారు రంగు సెలెక్షన్‌ చాలా వరకు పడిపోయింది. చాలా అత్యల్ప సంఖ్యలో వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక సిల్వర్‌ కలర్‌కు కూడా ప్రాధాన్యత తగ్గిపోయింది.

Indians-Prefer-These-Colour-Cars-Mostly

మొత్తంగా కొత్త కారు కొనుగోలు చేసేవారు నీలం, నలుపు మరియు ఆకుపచ్చ కలర్‌లకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఇవి టాప్‌లో ఉన్నాయి. ఇంకా తెలుపు రంగును ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇంకా తయారీదారులు కస్టమర్ల ప్రాధాన్యత ఆధారంగా ఆ కలర్స్‌లోనే ఎక్కువగా ప్రొడక్షన్‌ చేస్తుండటం విశేషం.

More from DriveSpark

Article Published On: Tuesday, March 26, 2024, 9:47 [IST]
English summary
Indians prefer mostly these colours while buying a new car check full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+