Tata టియాగో iCNG, టిగోర్‌ iCNG ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ వేరియంట్లు విడుదల.. దేశంలోనే తొలిసారిగా...!!

టాటా మోటార్స్‌ సంస్థ దేశంలోనే తొలిసారిగా సీఎన్‌జీ వేరియంట్లను ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో అందుబాటులోకి తీసుకొచ్చింది. టాటా టియాగో iCNG, టాటా టిగోర్‌ iCNG వాహనాలను ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో విడుదల చేసింది. టాటా టియాగో iCNG కార్లు XTA, XZA+, XZA+ DT, XZA NRG వేరియంట్లు ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉన్నాయి.

టాటా టిగోర్‌ iCNG XZA, XZA+ వేరియంట్లు మాత్రమే ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉన్నాయి. Tata Tiago iCNG AMT వేరియంట్‌ ప్రారంభ ధర రూ.7.90 లక్షలు (ఎక్స్‌షోరూం), Tata Tigor iCNG AMT ప్రారంభ ధర రూ.8.85 లక్షలు (ఎక్స్‌షోరూం) గా ఉంది. iCNG AMT వాహనాల కోసం టాటా మోటార్స్‌ సంస్థ బుకింగ్‌లను ప్రారంభించింది. అయితే ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్ మినహా ఈ కార్లలో ఎటువంటి మార్పులు చేయలేదు.

indias first CNG AMT Models

ఈ వాహనాలు 1.2 లీటర్‌ 3 సిలిండర్‌ నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. పెట్రోల్‌ వెర్షన్‌ 86bhp శక్తి, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే CNG వేరియంట్‌లో 73bhp శక్తి, 95Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే పవర్‌ మరియు టార్క్‌ ఉత్పత్తిలో గణనీయమైన మార్పును గమనించవచ్చు.

టాటా టిగోర్‌, టియాగో సీఎన్‌జీ వెర్షన్‌లు ఇప్పటి వరకు 5-స్పీ్డ్ మాన్యువన్ గేర్‌బాక్స్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇప్పటి నుంచి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ వేరియంట్‌లోనూ అందుబాటులో ఉంటుంది. ఈ ఆటోమేటిక్‌ ట్రాన్సిమిషన్‌ వేరియంట్‌తో కీప్ ఫంక్షన్‌ కూడా అందించ బడుతుందని తెలుస్తోంది.

టాటా టిగోర్‌ సీఎన్‌జీ, టాటా టియాగో సీఎన్‌జీ ఆటోమేటిక్ వేరియంట్లు 28.06 km/kg మైలేజీని అందిస్తాయి. దీంతోపాటు ఆటోమేటిక్‌ వేరియంట్లు కొత్త రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. టాటా టియాగో iCNG AMT టోర్నాడో బ్లూ రంగులో, NRG వేరియంట్‌ గ్రాస్‌ల్యాండ్‌ బీజ్‌ మరియు టిగోర్‌ iCNG AMT మెటోర్‌ బ్రాంజ్‌ రంగుల్లో లభిస్తుంది.

ఈ వాహనాల విడుదల సందర్భంగా టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ లిమిటెడ్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ అమిత్ కామత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన AMT వేరియంట్ల కారణంగా గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

టాటా సీఎన్‌జీ వాహనాల్లో ట్విన్ సిలిండర్ టెక్నాలజీ, హై ఎండ్‌ ఫీచర్‌, సీఎన్‌జీ డైరెక్ట్ స్టార్ట్‌ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయని కామత్‌ వెల్లడించారు. ఈ సీఎన్‌జీ సెగ్మెంట్‌లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చేందుకు టాటా మోటార్స్‌ సంస్థ సిద్ధంగా ఉందన్నారు. గత రెండు సంవత్సరాల కాలంలో భారత్‌లో 1.30 లక్షల CNG వాహనాలను విక్రయించినట్లు కామత్ వెల్లడించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, February 8, 2024, 16:19 [IST]
English summary
Indias first cng amt models tata tiago icng and tigor icng launched
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+