కేవలం ముగ్గురు మాత్రమే ప్రయాణించే సోలార్ కారు వచ్చేస్తుంది.. ఇక ఖర్చులకు బై బై చెప్పండి!

ఓవైపు ఇంధన ఖర్చులు పెరిగిపోతున్నాయి.. మరోవైపు కాలుష్యం కూడా పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కాస్త ప్రత్యామ్నాయంగా ఉన్నా.. వాటికి కూడా విద్యుత్ ఖర్చు చేయాల్సిందే! ఈ ఖర్చుల నుంచి తప్పించేలా సోలార్‌తో నడిచే ఎలక్ట్రిక్ కారు త్వరలో భారత్ మార్కెట్లోకి రానుంది. వాయ్‌వే అనే సంస్థ ఈవా పేరుతో సరికొత్త కారును తయారు చేసింది. దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కార్ ఇదే కావడం గమనార్హం. ఈ కారు విశేషాలు ఏంటి? దీన్ని ఎప్పుడు అందుబాటులోకి తేనున్నారు? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఆటోమొబైల్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వరల్డ్ ఫేమస్ ఆటోమొబైల్ ఎగ్జిబిషన్ "భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో" (Bharat Mobility Global Expo) వచ్చేస్తోంది. న్యూఢిల్లీ వేదికగా జనవరి 17 నుంచి 22 మధ్య ఈ ఈవెంట్ జరగనుంది. ఇక్కడే ‌వాయ్‌వే సంస్థ తన ఈవా సోలార్ కారును ప్రపంచానికి పరిచయం చేయనుంది.

India s Vayve EVA Car

ఈవా కారు ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు మోడల్. ఇందులో కేవలం ముగ్గురు మాత్రమే ప్రయాణించవచ్చు. ఈ కారు సీటింగ్ అరేంజ్మెంట్ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరికి మాత్రమే చోటు కల్పిస్తుంది. అంటే ఇది ఒక బైక్ లాంటి కారు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈవా కారును ఒక న్యారో స్ట్రక్చర్‌గా తీసుకురానున్నారు. దీని సాయంతో ఇరుకు రోడ్లైనా సరే హాయిగా వెళ్ళిపోవచ్చు.

ఫ్యూయల్‌తో నడిచే కార్ల కంటే తమ సోలార్ కార్ ద్వారా ఖర్చులు భారీగా తగ్గుతాయని వాయ్‌వే సంస్థ చెబుతోంది. ఉదాహరణకు.. అధిక మైలేజ్ ఇచ్చే కార్‌తో ఒక కిలోమీటర్‌కు రూ.5 ఖర్చు అయితే ఈవా కారు ద్వారా ఒక కిలోమీటర్‌కు కేవలం 50 పైసలు మాత్రమే ఖర్చవుతాయని చెప్పింది.

Vayve EVA Car

ఈ సదుపాయం కారణంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం చేయాలనుకునే వారిని ఇది ఎంతగానో ఆకర్షించనుంది. అంతేకాదు ఈ కారు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని ఆ సంస్థ అంటోంది. అదే సమయంలో ఈ కారు సోలార్ ఫెసిలిటీతో గనుక ఛార్జ్ చేస్తే సంవత్సరానికి 3,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అంతేకాకుండా ఈ కారు అత్యంత వేగంగా చార్జింగ్ అవుతుందని చెబుతోంది వాయ్‌వే సంస్థ.

Vayve 14 kWh బ్యాటరీ ప్యాక్ (IP68 రేట్)తో ఈ కారు ఉంటుంది. దీని ద్వారా ఇందులో ఉండే సింగిల్ 8.15 PS/40 Nm ఎలక్ట్రిక్ మోటారును శక్తి అందుతుంది. సూర్యకాంతి లేనప్పుడు తమ హై స్పీడ్ ఛార్జర్‌తో కనుక చార్జింగ్ చేసినట్లయితే.. కేవలం ఐదు నిమిషాలు చార్జింగ్ చేస్తే 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

ఇంత త్వరగా చార్జింగ్ అయ్యే సదుపాయం ఇతర ఏ కారులో లేనందున తమ సంస్థ.. ఈవీ రంగంలో ఒక విప్లవాత్మక మార్పు తెస్తుందని వాయ్‌వే సంస్థ భావిస్తోంది. అమ్మకాలు‌ కూడా విపరీతంగా ఉంటాయని ఆశిస్తోంది. ఇక స్పీడ్ విషయానికి వస్తే ఈవా సోలార్ ఎలక్ట్రికల్ కారు గరిష్టంగా 70kmph ప్రయాణిస్తుంది. 0 నుంచి 5 సెకండ్లలోనే 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

టు వీలర్ తరహాలో ఉండే దీని డిజైన్ కారణంగా ఇది నగరాల్లో ప్రయాణించడానికి అనువుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ కారులో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతోపాటు మ్యూజిక్ లిజనింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇక ఈ కారు ఫ్రీ లాంచ్ బుకింగ్స్ కూడా జనవరి నెలలో మొదలుకానున్నాయి. 2023 ఆటో ఎక్స్పోలో తొలిసారి ఈ కారును పరిచయం చేసినప్పటికీ ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఆ సంస్థ సిద్ధమవుతోంది.

More from DriveSpark

Article Published On: Friday, December 27, 2024, 11:11 [IST]
English summary
Indias first solar powered electric car vayve eva to be launched in auto expo 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+