జీప్ కార్ల కొనుగోలుకు ఇదే మంచి అవకాశం! ఎందుకో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

పండుగ సీజన్లో కొత్త కార్ల కొనుగోలుపైన మంచి ఆఫర్స్ లేదా బెనిఫిట్స్ లభిస్తాయని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారు జీప్ కంపెనీకి చెందిన కార్లను కొనుగోలు చేస్తే మంచి డిస్కౌంట్స్ పొందవచ్చు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

జీప్ కంపెనీ ఇప్పుడు కొన్ని ఎంపిక చేసిన మోడల్స్ మీద అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో జీప్ మెరిడియన్, జీప్ కంపాస్, జీప్ చెరోకీ మరియు జీప్ గ్రాండ్ రాంగ్లర్ ఉన్నాయి. అయితే ఈ కార్లను ఏప్రిల్ చివరి లోపల గోనుగోలు చేసే వారికి మాత్రమే ఈ ఆఫర్స్ లభిస్తాయి. కస్టమర్లు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఏప్రిల్ తరువాత బహుశా ఈ ఆఫర్స్ అందుబాటులో ఉండకపోవచ్చు.

Jeep Meridian Overland

జీప్ మెరిడియన్

ఈ నెలలో జీప్ మెరిడియన్ కొనుగోలుపైన కస్టమర్లు రూ.2.80 లక్షల విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్ మరియు మూడు సంవత్సరాల ఫ్రీ మెయింటెనెన్స్ ప్యాకేజీ, 2 సంవత్సరాల ఎక్స్టెండేడ్ వారంటీ వంటివి ఉన్నాయి. ఈ కారు 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి 170 హార్స్ పవర్ అందిస్తుంది. దీని ధర రూ.33.60 లక్షల నుంచి రూ.36.97 లక్షలు (ఎక్స్-షోరూమ్).

జీప్ కంపాస్

ఎక్కువమంది సెలబ్రిటీలకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు కూడా బాగా ఇష్టమైన జీప్ కంపాస్ కొనుగోలుపైనా కంపెనీ రూ. 1.55 లక్షల బెనిఫిట్స్ అందిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్స్, 3 సంవత్సరాల ఫ్రీ మెయింటెనెన్స్ ప్యాకేజ్ మరియు 2 సంవత్సరాల ఎక్స్టెండేడ్ వ్యారంటీ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహన కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Jeep Compass

జీప్ కంపాస్ మంచి డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇది దేశీయ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న టాటా హారియార్ మరియు మహీంద్రా XUV700 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. దీని ధర రూ. 20.69 లక్షల నుంచి రూ. 30.19 లక్షల (ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉంటుంది. ఈ నెలలో కొనుగోలు చేసే వారికి మాత్రమే కంపెనీ అందించే ఆఫర్స్ లభిస్తాయి.

జీప్ గ్రాండ్ చెరోకీ మరియు రాంగ్లర్

జీప్ కంపెనీ ఇప్పుడు గ్రాండ్ చెరోకీ మరియు రాంగ్లర్ కార్ల మీద కూడా భారీ తగ్గింపులు ప్రకటించింది. జీప్ గ్రాండ్ చెరోకీ కొనుగోలు మీద రూ.11.85 లక్షల డిస్కౌంట్ పొందవచ్చు. అంటే జీప్ గ్రాండ్ చెరోకీ కారును ఇప్పుడు రూ.68.50 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. ఈ అవకాశం కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే ఉంటుంది. కొందమంది డీలర్‌లు జీప్ రాంగ్లర్ మీద కూడా డిస్కౌంట్ అందిస్తున్నట్లు సమాచారం.

Jeep Grand Cherokee

గమనిక: జీప్ కంపెనీ యొక్క పైన వెల్లడించిన కార్లను కొనుగోలు చేస్తే తప్పకుండా ప్రయోజనాలను పొందవచ్చు. అయితే కంపెనీ అందించే ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంది. కాబట్టి జీప్ కంపెనీ అందించే ఈ ప్రయోజనాలను గురించి ఖచ్చితమైన వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి సమీపంలో ఉండే డీలర్‌షిప్లను సందర్శించే తెలుసుకోవచ్చు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, April 10, 2024, 14:56 [IST]
English summary
Jeep discount in april 2024 from meridian to grand cherokee
Read more on: #జీప్ #jeep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+