ఈ కారుపై ఏకంగా రూ.12 లక్షల తగ్గింపు.. ఇతర వాటిపై రూ.4.95 లక్షల వరకు డిస్కౌంట్.. జీప్ ఇండియా బంపర్ ఆఫర్

ప్రస్తుత ఏడాది మరికొద్ది రోజుల్లో ముగుస్తుంది. దీంతో వాహన తయారీదారులు తమ పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి ఇయర్ ఎండ్ సేల్‌ను వరుస బెట్టి ప్రకటిస్తున్నారు. వినియోగదారులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. పండగల ఆఫర్లు ముగిసిన తరువాత కూడా 2024 స్టాక్‌ను పూర్తిగా అమ్మడానికి కస్టమర్లకు కంపెనీలు ఊహించని విధంగా ఎంపిక చేసిన పలు మోడళ్లపై భారీ ఎత్తున తగ్గింపులను ప్రకటిస్తున్నాయి. తాజాగా స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల కంపెనీ జీప్ ఇండియా తన కార్లపై కనివిని రీతిలో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేసిన పలు మోడళ్లపై కంపెనీ ఏకంగా రూ.4.95 లక్షల వరకు తగ్గింపులు అందిస్తుంది. జీప్ కంపెనీ స్పోర్ట్స్ యుటిలిటీ కార్లను తయారు చేయడంలో ప్రపంచలోనే అతి పెద్దదిగా ఉంది. ఇది అమెరికాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం. సాధారణంగా ఈ బ్రాండ్‌ వాహనాల ధరలు భారీగా ఉంటాయి.

ఈ నేపథ్యంలో మధ్యతరగతి వారు కొనుగోలు చేయడానికి ఆర్థికంగా ఆలోచిస్తుంటారు. అయితే ఇప్పుడు తన కార్లపై భారీ తగ్గింపులు ఇవ్వడంతో అందరూ కూడా పోటీ పడే అవకాశం ఉంది. జీప్ ఇండియా మెరిడియన్, కంపాస్, గ్రాండ్ చెరోకీ వంటి కార్లపై ఇయర్ ఎండ్ సేల్ డిస్కౌంట్‌లను అందిస్తుంది. పండగల సమయంలో కార్లను కొనుగోలు చేయలేని వారికి ఇది బంపర్ ఆఫర్. మోడల్ వారీగా తగ్గింపులను క్రింది కథనంలో చూద్దాం.

Jeep India Year End Offer Up To 4 95 Lakh

Jeep Meridian: జీప్ మెరిడియన్‌పై కంపెనీ రూ.4.95 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తుంది. వేరియంట్ ఆధారంగా తగ్గింపులు ఉన్నాయి. 2024 మోడల్‌పై రూ.1.85 లక్షల వరకు విలువైన కార్పొరేట్ డిస్కౌంట్, అదనంగా రూ.30,000 విలువైన ప్రత్యేక తగ్గింపు, ఇంకా, రూ. 2.80 లక్షల వరకు ప్రయోజనాలు, రూ.25,000 బోనస్ ఉన్నాయి. మొత్తంగా ఈ మోడల్‌పై వినియోగదారులు రూ.4.95 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

ఈ ఎస్‌యూవీ ప్రస్తుతం ఇండియా మార్కెట్లో రూ.24.99 లక్షల నుండి రూ. 38.49 లక్షల మధ్య కొనుగోలుకు ఉంది. ఈ మోడల్‌లోనే కంపెనీ ఇటీవల ఎంట్రీ-లెవల్ 5-సీటర్ వెర్షన్‌ను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. దీని లుక్ కూడా చాలా స్టైలీష్‌గా ఉంటుంది.

Jeep India Year End Offer Up To 4 95 Lakh On Meridian

Jeep Compass: జీప్ కంపాస్‌పై ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా కంపెనీ రూ.3.15 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలను అందిస్తుంది. 2024 మోడల్‌పై రూ. 1.40 లక్షల విలువైన కార్పొరేట్ ఆఫర్, అదనంగా రూ.15,000 ప్రత్యేక తగ్గింపును కంపెనీ కస్టమర్లకు అందిస్తుంది. ఇంకా కంపాస్ వార్షికోత్సవ ఎడిషన్‌కు రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా ఉంది. మొత్తంగా ఈ మోడల్‌పై దాదాపు రూ.4.70 లక్షల వరకు తగ్గింపు ఉంది.

Jeep Grand Cherokee: గ్రాండ్ చెరోకీ మోడల్‌పై కంపెనీ ప్రస్తుతం అత్యధికంగా రూ.12 లక్షల విలువైన ప్రయోజనాలు అందిస్తుంది. దీని ధర ఇండియాలో రూ.67.50 లక్షల వరకు ఉంది. ఇంత భారీ ధర కలిగిన మోడల్‌పై ఏకంగా రూ.12 లక్షల తగ్గింపు ఇవ్వడం ఒక సంచలనం అనే చెప్పాలి. ఇది 2.0-లీటర్, నాలుగు-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చింది. 272 bhp పవర్‌ను, 400 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Jeep India Year End Offer

ఈ తగ్గింపు ప్రయోజనాలు ఏరియాను బట్టి మారుతాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతాల ప్రకారం ధరలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి వినియోగదారులు ఇండియా వ్యాప్తంగా ఉన్న జీప్ ఇండియా డీలర్‌షిప్‌లలో సంప్రదించడం ఉత్తమం. ఇది లిమిటెడ్ కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి కార్లను కొనుగోలు చేయాలనుకునే వారు వెంటనే డీలర్లను కాంటాక్ట్ కాగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, November 21, 2024, 17:53 [IST]
English summary
Jeep india year end offer up to 4 95 lakh on meridian compass cherokee
Read more on: #jeep #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+