ఊహించని ధరలో 'జీప్' స్పెషల్ ఎడిషన్ కారు లాంచ్.. ప్రీమియం కారు ఫీచర్లతో ఫుల్-ఫ్యాక్డ్ వెర్షన్
అమెరికన్ స్టైల్ కార్లకు ఇండియాలో మంచి ఆదరణ లభిస్తోంది. జీప్ ఇండియా నుంచి మెరిడియన్ 7 సీట్ల కారుగా విక్రయిస్తుంది. ప్రస్తుతం మెరిడియన్ కొత్త స్పెషల్ ఎడిషన్‌ను 'ఎక్స్' పేరుతో తీసుకువచ్చింది. కొత్త జీప్ మెరిడియన్ ముఖ్యంగా పట్టణ రహదారుల్లో మాత్రమే కాకుండా కఠినమైన ఆఫ్ రోడ్‌ల్లోనూ నడపవచ్చు. ఈ కారుని తక్కువ ధరకే తీసుకువచ్చనప్పటికీ జీప్ మెరిడియన్ కారు స్టైల్, టెక్నికల్ విషయంలో ఏమాత్రం రాజీపడలేదు. వాస్తవానికి, కొత్త మెరిడియన్ ఎక్స్ స్పెషల్ ఎడిషన్ ఇతర మెరిడియన్ కార్ల కంటే ఎక్కువ ప్రీమియంగా కనిపిస్తుంది. ఈ కొత్త మెరిడియన్ ఎక్స్ గురించి మరిన్ని వివరాలు మీకోసం..
కొత్త జీప్ మెరిడియన్ ఎక్స్ స్పెషల్ ఎడిషన్‌ని కేవలం రూ. 34.27 లక్షలు (ఎక్స్-షోరూమ్)వద్ద ఆ సంస్థ తీసుకువచ్చింది. జీప్ ధర ఇంత తక్కువా అని ఆశ్చర్యపోకండి. ఇప్పటి వరకు ఉందుబాటులో ఉన్న చవకైన జీప్ కార్లలో మెరిడియన్. ఇదే మెరిడియన్ వేరియంట్లలోని ఇతర కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో కొత్త జీప్ విషయంలో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఈ కారు ఊహాగానాలు పెరిగిపోతున్నాయి.

ఇక దీని డిజైన్ విషయానికి వస్తే కొత్త మెరిడియన్ ఎక్స్ స్పెషల్ ఎడిషన్ కారు చుట్టూ, అడుగు భాగంలో స్ట్రిప్డ్ ప్యానెల్స్ కలిగి ఉంటాయి. కారు పైకప్పు గ్రే కలర్‌లో లభిస్తుంది. అదేవిధంగా, అల్లాయ్ చక్రాలపై బూడిద(గ్రే) కలర్‌లో ఉన్నాయి. మెరిడియన్ ఎక్స్‌లో కొత్త సైడ్ మౌల్డింగ్, పెడల్ ల్యాంప్స్, క్యాబిన్ సరౌండ్ లైట్స్, సన్ షేడ్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, డ్యాష్ బోర్డ్ కెమెరా ఉన్నాయి.
ఈ కారులో ప్రీమియం కార్పెట్ మ్యాట్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు వెనుక సీట్ల ప్రయాణికుల కోసం ఎంటర్ టైన్ మెంట్ ప్యాకేజీని కూడా పొందవచ్చు. ఈ ప్యాకేజీ కోసం కస్టమర్లు అదనంగా అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇంజిన్, గేర్ బాక్స్ సెటప్‌లలో ఎలాంటి మార్పులు ఉండవు. ధర తక్కువ కావడం భారీ ఫీచర్లు ఉడటం వల్ల ఈ జీప్ సేల్స్ భారీగా ఉంటాయని ఆ సంస్థ భావిస్తోంది.
కొత్త మెరిడియన్ ఎక్స్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ కేవలం 10.8 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 198 కిలోమీటర్లుగా ఉంది. ఈ ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సుతో జతచేయబడింది. అదే విధంగా ఈ మోటార్ 168bhp మరియు 350Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
కొత్త మెరిడియన్ ఎక్స్ జీప్ బ్రాండ్ వ్యాల్యూకి తగినట్లుగా బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుందని జీప్ ఇండియా డైరెక్టర్ కుమార్ ప్రియాష్ తెలిపారు. తాజాగా ఈ కారు ధర విషయంలో జీప్ కొత్త ప్రయోగం చేసిందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. లిమిటెడ్ ఎడిషన్ అయినప్పటికీ దీని డిమాండ్ పెరుగుతుందని వారు తెలిపారు. ఇలాంటి స్పెషల్ ఎడిషన్ కార్లను ప్రవేశపెట్టడం యొక్క ప్రధాన లక్ష్యం కార్ల అమ్మకాలను పెంచడమే అని వారు వెల్లడించారు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








