బడ్జెట్‌లో కియా ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తుంది.. టాటా కార్లకు ఇక కష్ట కాలమే!
ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా (Kia Motors) తన ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) లైనప్‌లో విస్తరించాలని యోచిస్తోంది. సిటీ అవసరాలతో పాటు హై పెర్ఫార్మెన్స్ ఉన్న ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఆటోమోటివ్ పరిశ్రమ ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. కియా E-GMP ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి పనిచేసే ఎలక్ట్రిక్ కారును మరింత విస్తరించడానికి ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఈవీ 6, ఈవీ 9 వంటి మోడళ్లకు కొనసాగింపుగా తక్కువ ధరలో అందరకీ అందుబాటులో ఈ లైనప్‌ని అందించనుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సిటీ రైడింగ్ కోసం పికాంటో ఎలక్ట్రిక్ కారును కియా విక్రయిస్తోంది. ఇదే మోడల్‌లో భారత్‌లో సరికొత్త ఎలక్ట్రిక్ కారుని తీసుకురావాలని యోచిస్తున్నట్లు కియా అధ్యక్షుడు హో-సంగ్ సాంగ్ తెలిపారు. దీంతో ఈ మార్కెట్ సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్‌ని ఏలేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారుని చాలా తక్కువ ధర కారును లాంచ్ చేయాలని కియా ఆలోచిస్తోంది.

ప్రస్తుతం పికాంటో ప్రపంచవ్యాప్తంగా 30,000 యూరోల (సుమారు రూ.28 లక్షలు) కలిగి ఉంది. దీనిని భారత్‌లో 20,000 యూరోల (సుమారు రూ.18.6 లక్షలు) ధర శ్రేణిలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ఈ కారుని పూర్తిగా తయారు చేసే అవకాశం ఉంది. దీంతో ఈ కారుని తక్కువ ధరకే విక్రయించనున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలను మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి కియా భారీ ప్రణాళికతో వస్తుంది. ఇది దేశంలో పర్యావరణ హితాన్ని పెంచనుంది. చౌకైన ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు, కంపెనీ లైనప్‌లోని స్టింగర్ సెడాన్ ఆధారంగా కొత్త మోడల్‌ని అభివృద్ధి చేయనున్నారు. ఇది హై-ఫర్ఫామెన్స్‌తో రానుంది. ఇది 600 bhp కంటే ఎక్కువ అవుట్‌పుట్‌తో ఈవీ 6 జీటీ కంటే ఎక్కువ శక్తితో గరిష్ట టార్క్‌తో ఈ ఎలక్ట్రిక్ కారు రానుంది.

భారత మార్కెట్ కోసం, కియా అద్భుతమైన ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈవీ9 మెయిన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అక్టోబర్ 3న లాంచ్ కానుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు గల మంచి భవిష్యత్తును సూచిస్తూ కియా మరిన్ని కాలుష్య రహిత మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఇప్పుడే లైనప్స్‌ని ప్రారంభిస్తుంది.
సిటీతో పాటు సరసమైన ధరలో మంచి హై ఫర్ఫామెన్స్ కలిగిన ఎలక్ట్రిక్ లైనప్స్ కోసం కియా ప్రతిష్టాత్మక ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు దేశంలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధం అవుతున్నాయి. అందుబాటు ధరలో మంచి ఫీచర్లు, హై టెక్నాలజీతో భారత్‌లో కార్లను విడదుల చేయనుంది. ఇది ఎలక్ట్రిక్ విభాగంలో కీలక అడుగుగా భావించవచ్చు.
డ్రైవ్స్‌పార్క్ కాన్సెప్ట్: సరసమైన సిటీ యూజ్ కార్ల నుంచి హై-ఫర్ఫామెన్స్ మోడళ్ల వరకు, ఎలక్ట్రిక్ వాహనాల లైనప్ కోసం కియా ప్రతిష్టాత్మకంగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువస్తుంది. భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో కీలక పాత్ర పోషించడానికి కంపెనీ కట్టుబడి ఉంది. ప్రస్తుతం కస్టమర్లు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగా ఈ లైనప్‌పై కియా కూడా ప్రత్యేక దృష్టి సారిస్తుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








