క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో కియా మోటార్స్‌కు చెందిన ఓ కారు సేఫ్టీలో భేష్ అని నిరూపించుకుంది. ముఖ్యంగా ఛైల్ట్ ప్రొటెక్షన్ విభాగంలో టాప్ స్కోర్‌ను సాధించింది. అయితే ఆ కారు ఏంటి.. ఏయే విభాగాల్లో ఎంత స్కోర్ సాధించింది.. పూర్తి వివరాలు ఈ కథనంలో..
కియా మోటార్స్‌కు చెందిన Kia Carens భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందింది. డిజైన్, లుక్, ఫీచర్లు, పర్ఫామెన్స్ పరంగా కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో 2024 కియా కేరెన్స్ ఇటీవల గ్లోబల్ NCAP లో క్రాష్ టెస్ట్ చేయబడింది. అడల్ట్ సేఫ్టీ విభాగంలో 3 స్టార్ రేటింగ్‌ను సాధించగా.. ఛైల్డ్ సేఫ్టీ విభాగంలో 5 స్టార్‌ను స్కోర్ చేసింది.

అడల్ట్ సేఫ్టీ ప్రొటెక్షన్ విభాగంలో, Kia Carens 34.00కి గాను 22.07 స్కోర్‌ను సాధించి, 3-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. డ్రైవర్ మరియు ప్రయాణీకుల తలలకు రక్షణగా ఉందని ప్రూఫ్ చేసుకుంది. అయినప్పటికీ, డ్రైవర్ మెడ యొక్క రక్షణలో కొంత బలహీనతను గుర్తించారు. కానీ డ్రైవర్, ప్రయాణికుడి ఛాతీకి తగినంత రక్షణను అందించింది.
కియా కేరెన్స్ ఫుట్‌వెల్ ప్రాంతం అంతగా అనుకూలంగా లేకపోవడం, బాడీ షెల్ అస్థిరంగా గుర్తించబడింది. ఇక సైడ్ ఇంపాక్ట్ విషయానికొస్తే.. తల, ఛాతీ, ఉదరం భాగాల్లో మంచి రక్షణను ప్రదర్శించింది. అయితే సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌ను నిర్వహించలేదు. కాగా కియా కేరెన్స్‌లో గ్లోబల్ NCAP ప్రమాణాలకు అనుగుణంగా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ESC)ను స్టాండర్ట్‌గా అందించింది.

కాగా కియా కేరెన్స్‌లోని సీట్ బెల్ట్ రిమైండర్ (SBR) సిస్టమ్‌లు, మొదటి మరియు రెండవ వరుసల కోసం అందుబాటులో ఉంచింది. అయితే ఇది ముందు వరుసకు మాత్రమే పనిచేస్తుంది. ఈ ప్రమాణాలతో పెద్దల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో కియా కేరెన్స్ మొత్తం 3-స్టార్ రేటింగ్‌ను ప్రదర్శించింది.
ఇక ఛైల్డ్ సేఫ్టీ ప్రొటెక్షన్ పరంగా, Kia Carens అద్భుతంగా పనిచేసిందని చెప్పొచ్చు. పిల్లల భద్రత విభాగంలో 49.00కి 41.11 స్కోర్‌ను సాధించింది. ఫలితంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ఇక ఫ్రంటల్ ఇంపాక్ట్‌లో 3 ఏళ్ల మరియు 18-నెలల వయస్సు ఉన్న పిల్లలకు చైల్డ్ సీట్లు వెనుకవైపు ఉన్నాయి. i-సైజ్ ఎంకరేజ్‌లు మరియు సపోర్ట్ లెగ్‌లు పిల్లల తలలకు పూర్తి రక్షణను అందిస్తాయి.

కియా కేరెన్స్‌లో సైడ్ ఇంపాక్ట్ విషయానికొస్తే ఛైల్డ్ రెస్ట్రెయింట్ సిస్టమ్స్ (CRS) రెండూ పూర్తి సైడ్ ఇంపాక్ట్ రక్షణను అందించిందని చెప్పొచ్చు. ఇక Kia Carens అన్ని వేరియంట్‌లలో అన్ని సీటింగ్ స్థానాల్లో 3-పాయింట్ బెల్ట్‌ల ఫెసిలిటీని స్టాండర్డ్ ఫీచర్‌గా అందించింది.
కియా కేరెన్స్ భద్రతకు సంబంధించిన కొన్ని సెక్టార్లలో అద్భుతమైన బలాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ, అడల్ట్ సేఫ్టీ విభాగంలో, పిల్లల భద్రతా నిబంధనలలో కొన్ని సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. ఆటో రంగంలో భద్రతా ప్రమాణాలు అభివృద్ధి చెందుతున్నందున.. ఆటో మేకర్లు తమ వాహనాల భద్రత లక్షణాలను మెరుగుపరుస్తూ ప్రయాణికుల భద్రత కోసం నిరంతరం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








