కియా నుంచి రాబోతున్న మరో కొత్త EV.. టాటా ఈవీలకు చెక్ పడుతుందా?
కియా సరికొత్త ఈవీ3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఈవీ9, ఈవీ6, ఈవీ5 తర్వాత వస్తున్న ఎస్‌యూవీ ఇదే కావడం గమనార్హం. దాని ముందు మోడళ్ల మాదిరిగానే E-GMP మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి పనిచేయనుంది. ఈ కారులోని ఇంటీరియర్‌లో అధునాతన సౌకర్యాలు ఉండనున్నాయి.
ఈ ఈవీ3 ఎలక్ట్రిక్ కారు జూన్ 2024 మొదటి వారంలో దక్షిణ కొరియా మార్కెట్లో విడుదల కానుంది. ఆ తర్వాత 2024 చివర్‌లో యూరప్, వచ్చే ఏడాది ప్రారంభంలో ఆసియా మార్కెట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 200,000 కియా ఈవీ3 యూనిట్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఫీచర్ల విషయానికొస్తే, ఈవీ3లో 12 ఇంచెస్ హెడ్-అప్ డిస్ప్లే, యాంబియంట్ లైటింగ్ మరియు డిజిటల్ డిస్ప్లేలు, హర్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ మరియు ADAS సూట్‌ని గమనించవచ్చు. దీనిలో వ్యక్తిగత ఏఐ అసిస్టెంట్ ఉంది. ఈ ఫీచర్ కలిగిన ఏకైక కారు కియా ఈవీ3. త్వరలో దశలవారీగా ఇతర ఈవీల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఈ కారులో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. స్టాండర్డ్ మోడల్ 58.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, లాంగ్-రేంజ్ వేరియంట్ 81.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ఫ్రంట్ యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ రెండు వెర్షన్లలో వస్తుంది. ఇది 201bhp పవర్ వద్ద 283ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 7.5 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్ట వేగం గంటకు 170 కిలోమీటర్లతో ప్రయాణిస్తుంది. లాంగ్ రేంజ్ వెర్షన్ 600 కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రయాణిస్తుందని తెలుపుతున్నారు. 400 వోల్ట్ కరెంట్‌తో దీని బ్యాటరీ 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేయడానికి 31 నిమిషాలు పడుతుంది. ఈ కారులో 460 లీటర్ల బూట్ స్పేస్ మరియు అదనంగా 25 లీటర్ల ఫ్రంక్ (కారు ముందు భాగంలోని స్పేస్) ఉన్నాయి.
ఈ ఎలక్ట్రిక్ కారు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ మరియు పెద్ద గ్లాస్ హౌస్ దాని సైడ్ ప్రొఫైల్‌కి మరింత లుక్‌ని అందిచనున్నాయి. ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో స్లోయింగ్ రూఫ్ లైన్, నిలువుగా ఉంచిన టెయిల్ ల్యాంప్స్, రియర్ స్పాయిలర్, డ్యూయల్ టోన్ బంపర్ మరియు ముందు మరియు వెనుక ఫెండర్లలో ట్రాపెజోడల్ క్రీజులు ఉన్నాయి. ఇంకా మరెన్నో అధునాతన ఫీచర్లను గమనించవచ్చు.

ఈవీ3లో GT-లైన్ వేరియంట్లు కూడా ఉన్నాయి. ఇవి స్పోర్టియర్ బంపర్స్‌తో వస్తాయి. కొలతల పరంగా చూస్తే ఈవీ 3 4,300 మిమీ పొడవు, 1,850 మిమీ వెడల్పు, 1,560 మిమీ ఎత్తు మరియు 2,680 మిమీ వీల్ బేస్‌ని కలిగి ఉంది.ఈ కియా ఎలక్ట్రిక్ కారు ధర 35,000 - 50,000 డాలర్లు (సుమారు రూ. 30 లక్షలు - రూ. 42 లక్షలు) ఉండవచ్చు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








