రూ. 69 లక్షల ఖరీదైన లగ్జరీ కారుని కేవలం లక్షా 29 వేలకే సొంతం చేసుకోవచ్చు.. ఎలాగో ఇప్పుడే తెలుసుకోండి!

కియా మోటార్స్‌ (Kia Motors) తమ సంస్థకు చెందిన కార్లను నేరుగా వినియోగదారులకు విక్రయించడమే కాకుండా లీజ్ (Kia Lease) ప్రాతిపదికన కూడా అందిస్తుంది. దీని కింద మీరు ఈ కారుని పూర్తి మొత్తంలో చెల్లించాల్సిన అవసరం ఉండదు. నెలవారీ వాయిదాలు చెల్లించడం ద్వారా కారుని ఇంటికి తెచ్చుకోవచ్చు. ప్రస్తుతం ఆ కంపెనీ కియా సోనెట్‌, కియా సెల్టోస్‌, కియా కేరన్స్‌ కార్లను లీజ్‌ ప్రతిపాదికన అందిస్తుంది.

తాజాగా అత్యంత ఖరీదైన కియా EV6ని కూడా లీజ్‌ కింద అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారు ఎక్స్‌-షోరూమ్‌ ధర సుమారు రూ.64.11 లక్షల నుంచి 69.39 లక్షల మధ్య ఉంది. అయితే దీనిని మీరు కేవలం రూ.1.29 లక్షలకే లీజుకు ఇస్తున్నట్లు కియా వెల్లడించింది. అంటే భారీ ఖరీదైన ఈ కారును తక్కువ ధరలో ఇంటికి తీసుకువెళ్లవచ్చు అన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనంలో చూద్దాం.

Kia-EV6-Lease-Amount-Announced

ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు వాహనాలను నేరుగా వినియోగదారులకు విక్రయించకుండా లీజు ప్రాతిపదికన వాహనాలను విక్రయిస్తున్నాయి. దీంతో వినియోగదారులకు మరింత కారు సర్వీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. అదే సమయంలో వాహన తయారీదారులు కూడా నెలవారీ కిరాయి (Rent) లభిస్తుంది. ఇదొక రకంగా చెప్పాలంటే వారికి లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుతం కార్‌ బ్రోకరేజ్‌లు ఇలాంటి సర్వీస్‌ అందిస్తున్నాయి. దీనివల్ల ఎక్కువ మందికి కారు సర్వీస్‌లు అందుబాటులో ఉండనున్నాయి.

రెండు నెలల క్రితం కియా నా వాహనాలకు లీజు పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. కియా సోనెట్ కోసం నెలకు రూ.17,999, కియా సెల్టోస్ ధర నెలకు రూ.23,999, కియా కారెన్స్ కోసం నెలకు రూ.24,999 చెల్లిస్తే సరిపోతుంది. తాజాగా కియా ఈవీ6ను లీజుకు ఇవ్వనుంది. ఇంత ఖరీదైన కారు కేవలం నెలకు రూ.1.29 లక్షలకు అందుబాటులో ఉండనుంది.

Kia-EV6-Lease

ఈ మొత్తం చెల్లించిన లీజ్‌ అమౌంట్‌లో ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్, పికప్ అండ్ డ్రాప్, 24 గంటల రోడ్ అసిస్టెన్స్, వాహనానికి ఉచిత సర్వీస్ వంటివి కియా అందిస్తుంది. లీజు ప్రాతిపదికన కారు కొనుగోలు చేసే కస్టమర్లు నెలకు రూ.1.29 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. ఇక ఎలాంటి ఇతర ఖర్చులు వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ లీజు విధానంలో కొందరికీ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ముఖ్యంగా నాలుగు సెగ్మెంట్లలో ఉన్నవారు మాత్రమే కొనుగోలు చేయవచ్చని కంపెనీ కొత్త షరతు విధించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI)లో రిజిస్టర్ అయిన వైద్యులు, ఐసీఏఐ రిజిస్టర్డ్ చార్టర్డ్ అకౌంటెంట్లు ఈ కారును కొనుగోలు చేయవచ్చు. అంతే కాకుండా సొంతంగా బిజినెస్‌ చేసుకునే వారు, కొన్ని కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఈ కారును కొనుగోలు చేయవచ్చు.

Kia-EV6-Lease-Service-Price

ఈ కారులో 77.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 225.86 నుంచి 320.55 bhp పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీనిని కేవలం 18 నిమిషాల్లో 0-80 శాతం బ్యాటరీని ఛార్జ్ చేయగలదు. కారును ఛార్జ్ చేయడానికి ఒక డిసి ఛార్జర్‌ని కూడా అందించారు. దీనిలో 73 నిమిషాల్లో 10-80 శాతం బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. ఈ కారు గంటకు 192 KM వేగంతో ప్రయాణిస్తుంది.

దీని ఫుల్‌ ఛార్జ్‌పై 708 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇది కేవలం 5.2 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో ఏడీఏఎస్ సేఫ్టీ టెక్నాలజీ, 8 ఎయిర్ బ్యాగ్స్‌, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, 360 డిగ్రీల కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. గ్లోబల్ NCAP క్రాష్‌ టెస్ట్‌లో ఈ కారు 5 స్టార్ రేటింగ్‌ని సాధించింది.

డ్రైవ్స్‌పార్క్‌ వ్యాఖ్య: కియా ఈవీ6 కారును సొంతం చేసుకోవాలనుకుంటే రూ.64.11 లక్షల నుంచి రూ.69.35 లక్షల మధ్యలో ఉంది. మీరు అంత డబ్బు చెల్లించలేకపోతే, మీరు ఇంతకు ముందు చెప్పిన విధంగా ఈ కారును లీజుకు తీసుకోవచ్చు. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో నివసిస్తున్న చాలా మంది కారును సొంతం చేసుకోవడం కంటే లీజుకు తీసుకోవడం లాభదాయకం.

More from DriveSpark

Article Published On: Thursday, July 25, 2024, 13:17 [IST]
English summary
Kia ev6 now available for lease at rs 1 29 lakhs in india full details in telugu
Read more on: #kia motors #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+