Kia నుంచి కొత్త ఎలక్ట్రిక్ వాహనం.. వేరియంట్‌ను బట్టి 400-500 కి.మీ రేంజ్?.. టెస్ట్ రైడ్ వీడియో వైరల్..!
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఫలితంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు వినియోగదారులు అవసరాలకు అనుగుణంగా సరికొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో మాత్రమే తయారీ ప్లాంట్‌ను కలిగి ఉన్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా (Kia India) తాజాగా కొత్త ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తోంది.
తన ఎలక్ట్రిక్ వాహనాల ఫోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించాలని భావిస్తున్న దక్షిణ కొరియాకు చెందిన కియా సంస్థ ఇప్పటి వరకు భారత్‌లో EV6 ఎలక్ట్రిక్ వాహనాన్ని మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంది. తాజాగా కొత్త ఎలక్ట్రిక్ SUV EV9 (Kia EV9 EV) వాహనాన్ని రోడ్ టెస్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

గత సంవత్సరం జనవరిలో నిర్వహించిన ఆటో ఎక్స్‌పోలో ఈ EV9 ఎలక్ట్రిక్ కారును తొలిసారిగా పరిచయం చేసింది. కియా EV9 ఎలక్ట్రిక్ కారు 5,015 mm పొడవు, 1980 mm వెడల్పు, 1780 mm ఎత్తును కలిగి ఉంటుంది. మరియు 3100mm వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. మరియు విశాలమైన ఇంటీరియర్ సహా అత్యధిక బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది.
కియా EV9 ఎలక్ట్రిక్ కారు ఆకర్షణీయమైన డిజైన్, Z ఆకారంలోని DRLలతో కూడిన LED ల్యాంప్‌లు, బంపర్, క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్ వంటి డిజైన్‌ను కలిగి ఉంది. సైడ్ ప్రొఫైల్‌లో వీల్ ఆర్చ్‌లు, బాడీ క్లాడింగ్, ఫంక్షనల్ రూఫ్ రెయిల్, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్ డోర్ మౌంటెడ్ ORVMలు ఉన్నాయి. LED టెయిల్ ల్యాంప్స్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. మరియు స్పోర్టీ 21 అంగుళాల అల్లా్య్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.

కియా EV9 ఇంటీరియర్‌లో ఆకట్టుకొనే విధంగా ఉంది. మరియు కీలక ఫీచర్లను కలిగి ఉంది. 3 జోన్ క్లైమెట్ కంట్రోల్, వెంటిలేటెడ్ మరియు హీటెడ్ ఫ్రంట్, వెనుక సీట్లను కలిగి ఉంది. హీటెడ్ స్టీరింగ్ వీల్, రీజనరేటివ్ బ్రేకింగ్ ప్యాడిల్ షిఫ్టర్లు, పుల్ డిస్‌ప్లేతో కూడిన ఎలక్ట్రానిక్ రియర్ వ్యూ మిర్రర్, ఆటోమేటిక్ డిఫాగ్ సిస్టమ్, పవర్ టెయిల్‌గేట్ వంటి ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది.
దీంతోపాటు ప్యాసింజర్ ఆర్మ్ రెస్ట్, కప్ హోల్డర్‌లు, భారీ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు నావిగేషన్‌తో కూడిన 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే స్క్రీన్ మరియు 5.3 అంగుళాల క్రైమేట్ కంట్రోల్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.

ఈ స్క్రీన్‌లు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, OTA అప్‌డేట్‌లు, డిజిటల్ కీ, ఫింగర్ ప్రింట్, USB-C పోర్టులు సహా కీలక భద్రతా ఫీచర్ అయిన ADAS అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి కీలక భద్రతా ఫీచర్లను కియా EV9 ఎలక్ట్రిక్ కారు కలిగి ఉంది. 2 వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.
మూడు వేరియంట్లలో కియా EV9 ఈవీ అందుబాటులో ఉంటుంది. 76.1kWh బ్యాటరీ, 215hp సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్ఠంగా 370 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. 99.8kWh బ్యాటరీ, 201hp సింగిల్ మోటార్ వేరియంట్ గరిష్ఠంగా 489 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. 379hp డ్యూయల్ మోటార్ వేరియంట్ 450 కి.మీ రేంజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కియా కొత్త ఎలక్ట్రిక్ కారు EV9 గురించి ఉత్పత్తి సహా విడుదలపై సంస్థ ఎటువంటి సమాచారం విడుదల చేయలేదు. దేశవ్యాప్తంగా కియా ఇండియాకు ఆంధ్రప్రదేశ్ అనంతరపురం జిల్లాలో మాత్రమే తయారీ ప్లాంట్‌ను కలిగి ఉంది. ఇక్కడ నుంచే తన అన్ని మోడల్‌లను ఉత్పత్తి చేస్తూ, దేశవ్యాప్తంగా విక్రయిస్తోంది. కేవలం EV6 ను మాత్రమే దిగుమతి చేసుకొని భారత్‌లో విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications








