ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్‌లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
2024 వరల్డ్ కార్ అవార్డ్స్‌లో(World best car) కియా ఈవీ9 ఎస్‌యూవీ దుమ్ములేపింది. 2024 సంవత్సరానికి గానూ ఈ కారు ది బెస్ట్ ఈవీ కారు అవార్డుని దక్కించుకుంది. బీవైడీ సీల్ మరియు వోల్వో EX30 కార్లు తొలి మూడు స్థానాల్లో నిలిచి గట్టీ పోటినిచ్చాయి. అయితే చివరకు జెనీవా ఇంటర్‌నేషనల్ మోటర్ షోలో ఈవీ9 (Kia EV9) తొలి స్థానాన్ని సంపాదించింది.
29 దేశాల నుంచి దాదాపు 100 మంది ఆటోమొబైల్ జర్నలిస్ట్‌లు జూరీలో పాల్గొన్నారు. కార్ల పర్ఫామెన్స్ మరియు ఇతర ఫీచర్లను దృష్టిలో పెట్టుకుని వారు బెస్ట్ కార్‌ని ఎంపిక చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈవీ9 యొక్క డ్రైవింగ్ ఎక్స్‌పీరీయన్స్ (Driving Experience) ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని బెస్ట్ కారుగా ప్రకటించారు. ఎలక్ట్రిక్ కేటగిరీలో సైతం ఈ కారు గట్టి పోటీని ఎదుర్కొంది.

అవార్డు పొందాలంటే అర్హతలు: ఎలక్ట్రిక్ కార్లలో BMWi5 మరియు వోల్వో EX30 (Volvo EX30) కార్లు ఈవీ9 కి పోటీగా వచ్చాయి. అయితే ఎలక్ట్రిక్ కార్లు ఈ అవార్డులతో పోటీ పడాలంటే సంస్థ నుంచి కనీసం ఒక సంవత్సరానికి 5000 యూనిట్లకు మించిన ఉత్పత్తి, రెండు వేర్వేరు ఖండాల్లో (Continent) మార్కెట్‌లో ఈ కార్లు లభించాలి. అలాంటి సందర్భాల్లో మాత్రమే కార్లు అవార్డుల రేసులోకి వస్తాయి.
ఇతర సంప్రదాయ కార్లు 10,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం, లగ్జరీ కార్ కంటే తక్కువ ధర కలిగి ఉండాలి. దీనికి కూడా రెండు ఖండాలలోని మార్కెట్‌లో సేల్స్ ఉండాలి. అలాంటి సమయాల్లోనే ఆ సంస్థ కార్లు పోటీలో నిలుస్తాయి. తాజాగా ప్రకటించిన అవార్డులలో కియా సంస్థకు చెందిన మరో కారు సత్తా చాటింది.

వరల్డ్ కార్ అవార్డ్స్‌లో కియాకు ఈ విజయం కొత్తేమి కాదు. గతంలోనూ ప్రపంచ అవార్డుల్లో కియా అవార్డులను సాధించింది. 2023లో ప్రకటించిన అవార్డుల్లో కియా ఈవీ6 GT (Kia EV6 GT) వరల్డ్ ది బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డుని కైవసం చేసుకుంది. అలాగే 2020లో కియా టెలూరైడ్ (Kia Telluride) Soul EV టైటిల్‌ని సొంతం చేసుకుంది. ఈవీ9 విజయం సంస్థ నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.
వరల్డ్ కార్ అవార్డ్స్‌లో సాంప్రదాయ కార్లకంటే E-GMP (Electric- Global Modular Platform) ఆధారిత కార్లు మంచి పేరుని సంపాదిస్తున్నాయి. ఈ ఆధారిత కార్లు అయిన Ioniq 6 మరియు కియా ఈవీ6 GT గత రెండు సంవత్సరాలలో ఎక్కువ అవార్డులను అందుకున్నాయి. ఈ కార్ల సంస్థలు ఉత్పత్తి చేసే కార్లకు మార్కెట్‌లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది.
కియా బ్రాండింగ్‌పై ఉన్న నిబద్ధత మరియు కస్టమర్లు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఈ విజయం సాధ్యమైందని కియా సీఈవో హో సంగ్ సాంగ్ తెలిపారు. డిజైన్ ఎక్స్‌లెన్స్ మరియు బెస్ట్ పర్ఫామెన్స్ కార్లు అందించడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ కియా నుంచి అబ్బుర పరిచే ఉత్పత్తులను తీసుకువస్తామని ఆయన వెల్లడించారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








