అక్టోబర్‌ 3న కియా నుంచి రాబోతున్న అతిపెద్ద ఎలక్ట్రిక్‌ SUV.. 7 సీటర్‌, 541 కి.మీ రేంజ్‌, భారీ ఫీచర్లు!

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా తనదైన శైలిలో మార్కెట్‌లో కార్లను ఉత్పత్తి చేస్తూ భారతీయుల హృదయాలను గెలుచుకుంది. ఆ కంపెనీ నుంచి సెల్టోస్, సోనెట్, కేరెన్స్ మరియు కార్నివాల్ వంటి మోడళ్లకు జనాల్లో మంచి ఆదరణ ఉంది. ఇదే కాకుండా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలోనూ కియా ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే కంపెనీ లైనప్‌లోని ఎలక్ట్రిక్‌ కారు ఈవీ6 మార్కెట్‌లో దుమ్మురేపుతుంది. దీని ధరలు కొంచెం ప్రీమియం అయినప్పటికీ జనాలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ బ్రాండ్ ఇప్పుడు దేశంలో తన రెండవ ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయాలని యోచిస్తోంది. ఇది కూడా 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా అందుబాటులోకి రానుంది.

కియా నుంచి త్వరలో రాబోయే ఎలక్ట్రిక్ కారు పేరు ఈవీ9 (Kia EV9). దీనిని అక్టోబర్‌ 3, 2024న భారతీయ మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు కియా వెల్లడించింది. ఇది సెవెన్‌ సీటర్‌ ఆప్షన్‌లో అతిపెద్ద డిజైన్‌తో భారతీయ మార్కెట్‌లో అరంగేట్రం చేయనుంది. ఈ పండుగ సీజన్‌లో అతిపెద్ద విడుదలగా కియా ఈవీ9 నిలువబోతుంది. ఈ మోడల్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించగలదని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Kia-EV9-Electric-SUV-Launching-In-India-On-Oct-03

ఈ ఫ్లాగ్‌షిప్‌ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ హ్యుందాయ్ డెడికేటెడ్ ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌ (E-GMPO) ఆధారంగా నిర్మించబడింది. కియా ఈవీ9 పూర్తిగా విదేశాల్లో తయారైన సీబీయూ ప్రొడక్ట్‌గా భారత్‌లో లాంచ్ కానుంది. కంప్లీట్‌ బిల్ట్ అప్ యూనిట్ కావడంతో ధర పరంగా లగ్జరీ కార్లతో సమానంగా ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకుంటే దీని ధర సుమారు రూ.80 లక్షలు కంటె ఎక్కుడా ఉన్నాకానీ ఆశ్చర్యపోనవసరం లేదు.

ఇక దీని వెల్లడించిన కొలతల ప్రకారం భారీ ఆకారంలో వస్తుంది. ఇది 5,015 mm పొడవు, 1,980 mm వెడల్పు, 1,780 mm ఎత్తుని కలిగి ఉంది. అలాగే 3,100 mm వీల్‌బేస్‌తో కియా ఈవీ9 భారత్‌లోని ఇతర కార్లకంటే అతిపెద్ద డిజైన్‌లో వస్తుంది. ఇది చాలా పొడవు, భారీ ఆకృతి, ఇంటీరియర్‌లో ఎక్కువ స్పేస్‌ ఉండే అవకాశం ఉంది.

Kia-EV9-Electric-SUV-Launching-In-India-On-Oct-03

ఈ అతిపెద్ద ఎస్‌యూవీలో పెద్ద కుటుంబాలు ఇందులో సులభంగా ఎక్కువ దూరం ప్రయాణించేందుకు వీలుంటుంది. ఇక దీని డిజైన్ విషయానికొస్తే, ముందుగా దీని ఎక్స్‌టీరియర్‌లో 'డిజిటల్ టైగర్ ఫేస్' అనే సిగ్నేచర్ స్టైలింగ్, చిన్న క్యూబ్ ల్యాంప్స్, డిజిటల్ ప్యాటర్న్ లైటింగ్ గ్రిల్, వర్టికల్ హెడ్‌ల్యాంప్స్, ప్రత్యేకమైన 'స్టార్ మ్యాప్' LED డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి.

కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో పాలీగోనల్ వీల్‌ఆర్చ్‌లు, 21 ఇంచెస్‌ స్పోర్టీ అల్లాయ్ వీల్స్, బాడీ క్లాడింగ్, ఫంక్షనల్ రూఫ్ రైల్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్‌తో కూడిన డోర్ మౌంటెడ్ ORVMలు ఉంటాయి. ఇక దీని ఇంటీరియర్స్ విషయానికి వస్తే, వరల్డ్‌ క్లాస్ బెస్ట్ ఇంటీరియర్‌ ఫీచర్లను కలిగి ఉంటుందని లుక్‌ని బట్టి చూస్తే ఇట్టే అర్థం అవుతుంది.

Kia-EV9-Electric-SUV-Launching-In-India-On-Oct-03

ఇందులో నావిగేషన్‌తో కూడిన 12.3 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్‌ డ్రైవర్ డిస్ ప్లే స్క్రీన్, 5.3 అంగుళాల త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ స్క్రీన్, డిజిటల్ కీ, ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, USB-C పోర్ట్‌, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ప్రత్యేకతలుంటాయి.

ఆటోమేటిక్ డిఫాగ్‌ సిస్టమ్, ఫుల్ డిస్ ప్లేతో కూడిన ఎలక్ట్రానిక్ రియర్ వ్యూ మిర్రర్, హీటెడ్ స్టీరింగ్ వీల్, రీజెనరేటివ్ బ్రేకింగ్ ప్యాడిల్ షిఫ్టర్స్‌, స్మార్ట్ పవర్‌టెయిల్ గేట్‌ ఈ సరికొత్త కియా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఉండనున్నాయి. ఇందులోని 99.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే లీటరుకు 541 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

కియా ఈవీ9 ఫిక్స్డ్‌ పోర్టబుల్ ఛార్జింగ్ ఆప్షన్‌తో వస్తుంది. అల్ట్రా-ఫాస్ట్ 800V ఛార్జింగ్‌ని కలిగి ఉన్న ఈ ఎస్‌యూవీ కేవలం 15 నిమిషాల్లో 239 కిలోమీటర్ల రేంజ్‌ అందించగలదు. ఇందులోని హైవే డ్రైవింగ్ పైలట్ ఫీచర్ ద్వారా హైవేలపై హ్యాండ్స్ ఫ్రీ డ్రైవింగ్‌ని అనుమతించే Level 3 ADAS టెక్నాలజీ సైతం ఈ ఈవీలో ఉంది. అయితే ఈ టెక్నాలజీతో భారత్‌లో లాంచ్ అవుతుందో లేదో చూడాలి.

More from DriveSpark

Article Published On: Friday, August 16, 2024, 12:34 [IST]
English summary
Kia ev9 electric suv launching in india on october 3 check full details in telugu
Read more on: #kia motors #Kia EV9 #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+