భారత్‌లో అడుగుపెట్టిన 'వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్'.. 561 కి.మీ రేంజ్, ప్రపంచంలోనే తోపు కారు ధర ఎంతంటే?
కియా ఇండియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (Kia EV9 Electric SUV) ని లాంచ్ చేసింది. భారత మార్కెట్‌లో లాంచ్ చేసిన రెండవ ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం కియా ఈవీ6 కియా నుంచి కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ కారుని ప్రముఖులు, సినీ స్టార్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. తాజాగా కియా విడుదల చేసిన ఈవీ9 ఎలక్ట్రిక్ కారు ధరను రూ.1.29 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ కియా ఈవీ9 మోడల్ జీటీ లైన్ అనే ఒక వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.
ప్రపంచ మార్కెట్‌లో కొనుగోలుకి అందుబాటులో ఉన్న ఈ కారు 2024లో వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా నిలించింది. ప్రపంచంలోనే తోపు కారుగా పేరుగాంచిన ఈ కియా ఈవీ9 తాజాగా భారత్‌లో కాలుమోపింది. ఈ కొత్త కియా ఈవీ9 మోడల్ కియా ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యూలర్ ప్లాట్‌ఫామ్ (E-GMP)తో వస్తుంది. ఇదే ఫ్లాట్‌ఫామ్‌ని రానున్న రోజుల్లో హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లలో వినియోగించనున్నారు.

కియా ఈవీ9లోని 282.6 kWh బ్యాటరీ ప్యాక్ ఫుల్ ఛార్జ్‌లో 561 కి.మీ రేంజ్‌ని అందిస్తుంది. ఈ ఎస్‌యూవీ డ్యూయల్ మోటార్ సెటప్‌తో వస్తుంది. ఇది 379 bhp, 700 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారుని 350 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 10-80 శాతం పూర్తి చేయడానికి కేవలం 24 నిమిషాలు మాత్రమే పడుతుంది.
ఈ కారు 0-100 కి.మీ వేగాన్ని కేవలం 5.3 సెకన్లలో అందుకుంటుంది. ఈ కొత్త కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కారులో ఇంటిగ్రేటెడ్ స్లీక్ LED DRLs, డిజిటల్ టైగర్ ఫేస్ గ్రిల్, స్టార్ మ్యాప్ ఎల్‌ఈడీ యాక్సెంట్స్ ఆకట్టుకుంటాయి. ముందు భాగంలో ఇది అగ్రెసివ్ ఫేసియా లుక్‌ని కలిగి ఉంటుంది. ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, స్క్వేర్డ్-ఆఫ్ వీల్ ఆర్చ్స్, 20-22 inches వీల్స్ ఉన్నాయి.

ఈ కియా డిజైన్‌లోనూ భారీ ఆకృతితో ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 200 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంది. ఈ కారు 5,015 ఎంఎం పొడవు, 1980 ఎంఎం వెడల్పు, రూఫ్‌లైన్స్‌తో కలిపి 1780 ఎంఎం ఎత్తు, ఇది 3100 ఎంఎం వీల్‌బేస్‌ని కలిగి ఉంది. ఇందులోని మూడు వరుసల సీట్లలో ప్రతీ వరుసలో ఇద్దరు చొప్పున 6 మంది హాయిగా వెళ్లవచ్చు.
ఈ ఎలక్ట్రిక్ కారు ఇంటీరియర్ డ్యాష్ బోర్డ్ క్లీన్ డిజైన్‌ని కలిగి ఉంది. కొత్త కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కారులో ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన విశాలమైన డిస్ప్లే ఉన్నాయి. ఫ్రంట్‌లో 12 వే ప్యాసింజర్ పవర్ సీట్, 8 వే అడ్జస్టబిలిటీ పంక్షన్స్‌తో వస్తుంది. ఇది కాకుండా, అటానమోస్ డ్రైవింగ్-అసిస్ట్ ఫీచర్లతో ఏడీఏస్ సూట్‌ని కలిగి ఉంది.
ఇందులో 10 ఎయిర్‌బ్యాగ్స్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ అండ్ అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హై బీమ్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఉన్నాయి. ఈ కారు BMW iX, ఆడి Q8 e-tron వంటి వాటికి గట్టి పోటీని ఇస్తుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








