కారు కొనేవారు ఇప్పుడే ప్లాన్ చేసుకోండి.. ఏప్రిల్ 1 నుంచి ఈ కంపెనీ కార్ల ధరల పెంపు

భారత మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్.. ఏప్రిల్ 1 నుంచి తన ప్రముఖ మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కియా సెల్టోస్, సొనెట్ మరియు కారెన్స్‌తో సహా దాని అన్ని మోడళ్లపై 3 శాతం పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. కమోడిటీ ధరలు, మార్కెటింగ్ సంబంధిత పెంపుదల కారణంగానే ధరలను పెంచాలని నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది.

భారతదేశంలో కియా ఇప్పటివరకు 1.16 మిలియన్ యూనిట్ల కార్లను విక్రయించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో, కియా యొక్క(Kia Prices Hike) ప్రముఖ సెల్టోస్ మోడల్ 6,13,000 యూనిట్ల అమ్మకాలను అధిగమించి రికార్డు సృష్టించగా.. కియా సోనెట్ 3,95,000 యూనిట్ల అమ్మకాలను సాధించింది. కియా కారెన్స్ 1,59,000 యూనిట్ల అమ్మకాలను సాధించినట్లు కంపెనీ తెలిపింది.

Kia-India-Prices-Hike

ఈ క్రమంలో ఇటీవల కియా ఇండియా(kia India) తన నవీకరించబడిన 2024 కియా సెల్టోస్ SUV యొక్క డీజిల్ మాన్యువల్ వేరియంట్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి ధర రూ.11,99,900 నుండి రూ.18,27,900 ఎక్స్-షోరూమ్ మధ్యలో ప్రవేశపెట్టింది. ఇంకా కియా సెల్టోస్ SUV యొక్క కొత్త డీజిల్ వేరియంట్లు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో సంస్థ అందిస్తోంది.

కియా సెల్టోస్ డీజిల్ మాన్యువల్ వేరియంట్ ఇంజిన్ 114 bhp మరియు 250 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ iMT మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో జత చేయబడి ఉంటుంది. కస్టమర్లకు కియా సెల్టోస్ HTE, HTK, HTK+, HTX మరియు HTX+తో సహా ఐదు విభిన్న వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 6-స్పీడ్ డీజిల్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లో కొనుగోలు చేయవచ్చు..

దేశంలో కియా మోటార్స్ ఇండియా జర్నీ 2017 ఏప్రిల్ నుంచి ప్రారంభమైంది. అనంతపురం జిల్లాలో కొత్త తయారీ కేంద్రాన్ని నిర్మించడానికి కియా ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేయగా.. ఆగస్ట్ 2019లో భారీ ఉత్పత్తిని మొదలుపెట్టింది. కియా ఇప్పుడు 3,00,000 యూనిట్ల కార్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది..

ఇప్పటివరకు దేశంలో కియా ఇండియా సెల్టోస్, కార్నివాల్, సోనెట్, కేరెన్స్ మరియు ఈవీ6తో సహా ఐదు వాహనాలను భారతీయ మార్కెట్లో విక్రయిస్తోంది. కాగా కియా ఇండియా తన అనంతపురం ప్లాంట్ నుండి 1.16 మిలియన్ వాహనాల ఉత్పత్తిని పూర్తి చేయగా.. ఇందులో 9.1 లక్షల దేశీయ అమ్మకాలు మరియు 2.5 లక్షల ఎగుమతులు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది..

కాగా కియా ఇండియా కార్ల ధరల పెంపుపై సేల్స్ & మార్కెటింగ్ నేషనల్ హెడ్, హర్దీప్ సింగ్ బ్రార్ దీనిప మాట్లాడారు. తమ కస్టమర్లకు ప్రీమియం మరియు సాంకేతికంగా అధునాతన ఉత్పత్తులను అందించడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అయినప్పటికీ, మార్కెెట్ పరిస్థితులు పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా, ధరలను పెంచుతున్నట్లు వెల్లడించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, March 22, 2024, 15:31 [IST]
English summary
Kia india announces its line up models price hike from april 1st 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+