ఆంధ్రప్రదేశ్‌ వేదికగా చరిత్ర సృష్టించిన కియా మోటార్స్‌.. 5 ఏళ్లలోనే తిరుగులేని శక్తిగా అవతరణ!

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా భారత్‌లో అతి తక్కువ సమయంలోనే తిరుగులేని శక్తిగా అవతరిచింది. దేశంలో ఈ సంస్థ ప్రస్తుతం భారీ నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేసుకుంది. ఇప్పటి వరకు ఆ కంపనీ దేశంలో దాదాపు 10 లక్షల కియా కార్లు అమ్ముడయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ భారత్‌లో అడుగు పెట్టి కేవలం ఐదేళ్లు మాత్రమే అయింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 59 నెలలు మాత్రమే అయిందని చెప్పాలి. దీనిపై కంపెనీ 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాము సాధించిన రికార్డులను కంపెనీలను అధికారికంగా వెల్లడించనుంది.

కియా తన ఐదవ వార్షికోత్సవ సందర్భంగా 10 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది. అతి తక్కువ సమయంలో భారత ఆటోమొబైల్ ప్రపంచంలో పోటీని తట్టుకుని నిలబడటం కంపెనీ సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. దేశంలో మరే ఇతర కంపెనీలకు సాధ్యం కానీ విధంగా మార్కెట్‌లో నిలదొక్కుకున్న మారుతి, టాటా, హ్యుందాయ్‌లకు గట్టి పోటీని ఇచ్చింది.

Kia Celebrates 1 million Unit Sales in India

కియాఉత్పత్తులకు దేశంలో విపరీతమైన స్పందన లభిస్తోంది. మొట్టమొదటిగా దేశంలో ఆ కంపెనీ నుంచి కియా ఇండియాలో సెల్టోస్ (Seltos) లాంచ్ చేసింది. ఇది ఎస్‌యూవీ రూపాన్ని కలిగి ఉంది. ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కియా కారు కూడా ఇదే కావడం విశేషం. కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఈ కారు వాటా 48 శాతం వాటాను ఇది కలిగి ఉంది.

ఆ తర్వాత కియా సోనెట్ (Sonet) కంపెనీ రెండవ బెస్ట్ సెల్లింగ్ కారుగా ఉంది. ఆ తర్వాత కేరెన్స్ (Carens) మూడవ బెస్ట్ సెల్లింగ్ కారుగా ఉంది. మార్కెట్‌లో సోనెట్ 34 శాతం, కారెన్స్ 16 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ కార్ మోడళ్లతో పాటు కియా దేశంలో ఈవీ6 ఎలక్ట్రిక్ కార్ మోడల్‌ని కూడా అందిస్తుంది.

Kia EV6

కియా ఈవీ6 (Kia EV6) కొంచెం ప్రీమియం ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ కారు మోడల్‌గా ఉంది. ఇది కంపెనీలోనే అత్యంత ఖరీదైన ఉత్పత్తిగా ఉంది. దీనిని ఎక్కువగా సంపన్నులు, సెలెబ్రిటీలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ఈ కారు అమ్మకాలు కాస్త తక్కువగా ఉంటాయి. అయితే ఈవీ6 ఎలక్ట్రిక్ కారుకు కంపెనీ ఊహించిన దానికంటే మంచి ఆదరణ లభిస్తోందని కంపెనీ గతంలో తెలిపింది.

కియా త్వరలో మరికొన్ని కొత్త కార్ మోడళ్లను విడుదల చేయనుంది. కంపెనీ పాపులారిటీని కొనసాగించేందుకు త్వరలోనే ఈవీ9, క్లావిస్ (Clavis) వంటి కార్ మోడళ్లను విడుదల చేయనుంది. కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. ఈ కారు మోడల్‌కి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ, వివిధ అవార్డులు లభిస్తున్నాయి. అదేవిధంగా క్లావిస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ ఆధారంగా ఉండనుంది.

Kia EV9

భారత్‌లో ఈ కార్ల సెగ్మెంట్‌కి మంచి డిమాండ్ ఉండటం గమనార్హం. అందుకే ఈ సెగ్మెంట్‌పై దృష్టి సారించింది. అందులో భాగంగా కియా త్వరలో క్లావిస్ కారు మోడల్‌ని లాంచ్ చేయనుంది. ఇది 2025 నాటికి వస్తుందని భావిస్తున్నారు. త్వరలోనూ ఈ కంపెనీ నుంచి వచ్చే ఇతర కారు మోడళ్లకు కూడా ఇదే విధమైన రెస్పాన్స్‌ వస్తుందని కంపెనీ భావిస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, August 27, 2024, 16:34 [IST]
English summary
Kia india celebrates 1 million unit sales in just 5 years check details in telugu
Read more on: #kia motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+