డీజిల్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌లో కియా కేరెన్స్‌.. ఇప్పుడు 30 వేరియంట్లలో కొనేయొచ్చు.!!

భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉన్న ప్రముఖ MPV మోడళ్లలో కియా కేరెన్స్‌(Kia Carens) ఒకటి. దక్షిణ కొరియాకు చెందిన ఈ బ్రాండ్‌కు భారత మార్కెట్లో మంచి ప్రజాదరణ ఉంది. ఈ క్రమంలో కియా కేరెన్స్‌ను సంస్థ మరో కొత్త వేరియంట్‌లో అప్‌డేట్‌ చేసి తీసుకువచ్చింది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.

కియా కేరెన్స్‌ MPVకి సంస్థ రెండు కొత్త ఆప్షన్లను జోడించింది. దీంతో కియా కేరెన్స్‌(Kia India) మొత్తం ఇప్పుడు 30 ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. కియా కేరెన్స్‌లో కొత్త U2 1.5 VGT MT డీజిల్ ఇంజిన్‌ను కొత్త వేరియంట్లలో తీసుకువచ్చింది. కాగా Kia Carens ఇప్పటికే మూడు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Kia-Carens-Diesel-Variants-U2-1 5-VGT-MT

1.5-లీటర్ నేచురల్లీ అస్పిరేటెడ్‌ పెట్రోల్ మోటార్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ మోటార్ మరియు 1.5-లీటర్ టర్బో డీజిల్. ఇప్పుడు నాల్గవది, కొత్త డీజిల్ మోటార్ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌లో ప్రవేశపెట్టారు. కొత్త వేరియంట్లలో 6-సీటర్ మరియు 7-సీటర్ ఆప్షన్‌లు కూడా తీసుకురావడం కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ అని చెప్పవచ్చు.

ఈ వేరియంట్‌లో కియా కేరెన్స్‌ను సంస్థ కొత్త కలర్లలో కూడా ప్రవేశపెట్టింది. కేరెన్స్‌లో ప్యూటర్ గ్రీన్ షేడ్ అనే కొత్త కలర్‌ ఎంపికను తీసుకువచ్చింది. కొత్త వేరియంట్‌లు ప్రీమియం O(Kia Carens Premium O), ప్రెస్టీజ్ O(Prestige O) మరియు ప్రెస్టీజ్+ O(Prestige+ O) వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి.

Kia-Carens-Diesel-Variants-U2-1 5-VGT-MT

కియా కేరెన్స్‌ డీజిల్‌ వేరియంట్‌ ప్రీమియం O లో ఫీచర్ల విషయానికొస్తే ఇందులో కీలెస్ ఎంట్రీ, 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, షార్క్ ఫిన్ యాంటెన్నా, స్టీరింగ్ వీల్‌పై మల్టీ-ఫంక్షన్ కంట్రోల్స్ మరియు బర్గ్‌లర్ అలారం వంటి అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. మిగిలిన రెండు వేరియంట్లలో కూడా మరిన్ని ప్రీమియం ఫీచర్లతో వస్తాయి.

ముఖ్యంగా, ప్రెస్టీజ్ ప్లస్ O వేరియంట్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, LED మ్యాప్ ల్యాంప్స్ మరియు రూఫ్ ల్యాంప్స్ ఉన్నాయి. దీనితో పాటు 180 వాట్ల స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లను కూడా సంస్థ అందిస్తోంది. అదేవిధంగా, కంపెనీ కేరెన్స్‌ X లైన్ వేరియంట్‌ను కూడా కొద్దిగా అప్‌డేట్ చేసింది.

ఇందులో డాష్‌క్యామ్(Dash Cam), వాయిస్ కమాండ్‌(Voice Command)ల ద్వారా అన్ని విండోలను నియంత్రించే సదుపాయం పొందవచ్చు. కేరెన్స్‌ కార్ మోడల్‌లో ఇలాంటి మరెన్నో ఫీచర్లను చూడవచ్చు. కొత్త డీజిల్‌ ఇంజిన్‌, ఫీచర్లతో కియా కేరెన్స్ ధరల్లో కూడా సంస్థ మార్పులను తీసుకువచ్చింది.

కాబట్టి, ఇప్పుడు కియా కేరెన్స్‌ ప్రీమియం వేరియంట్‌ ధర రూ. 10.52 లక్షలుగా ఉంది. టాప్‌ స్పెక్‌ ధర రూ. 19.67 లక్షల్లో అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. కొత్తగా విడుదల చేసిన వేరియంట్ ధర రూ. 12.12 లక్షల ప్రారంభ ధర నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది కూడా ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 3, 2024, 9:41 [IST]
English summary
Kia india launches 6 seater refreshed 2024 carens and 1 5 diesel mt carens price specs details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+