మార్కెట్లోకి కియా సెల్టోస్‌ రెండు కొత్త వేరియంట్లు లాంచ్‌.. ఫీచర్లు, స్పెక్స్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!!

భారత మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా(Kia India).. తన ప్రముఖ మోడల్‌కు సంబంధించి కొత్త వేరియంట్లను తీసుకువచ్చింది. కియా సెల్టోస్‌ HTK+ వెర్షన్‌ రేంజ్‌ను మరింత అప్‌డేట్‌ చేస్తూ అందులో రెండు కొత్త వేరియంట్లను లాంచ్ చేసింది. ఈ వెర్షన్‌లో ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయో.. ఈ కథనంలో తెలుసుకుందాం..

దేశంలో ఫోర్‌ వీలర్‌ సెగ్మెంట్‌లో రోజురోజుకీ విపరీతమైన పోటీ నెలకొంటోంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అత్యాధునిక డిజిటల్‌ ఫీచర్ల(New Launches)తో ఆటో మేకర్లు కార్లను లాంచ్‌ చేస్తున్నాయి. వీటితో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడళ్లలో కూడా అప్‌డేట్లను తీసుకువస్తూ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Kia-Seltos-New-HTK-Plus-Variants-Launch

ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో కియా కార్లకు ప్రజాదరణ అధికంగా ఉంది. కాగా కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కావడంతో కియా ఇండియా.. ఎంపిక చేసిన మోడళ్లపై 3 శాతం ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో కియా సెల్టోస్‌(Kia Seltos Facelift) ఫేస్‌లిఫ్ట్‌ను సంస్థ ఇటీవల లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే.. ఇప్పుడు సెల్టోస్‌ HTK+ వేరియంట్‌లో కొత్త మార్పులను తీసుకువచ్చింది.

కొత్త ఫేస్‌లిఫ్టెడ్ కియా సెల్టోస్‌(Kia Seltos)ని కొనుగోలు చేయాలనుకుంటునే కస్టమర్లకు ఇప్పుడు.. సెల్టోస్‌ పెట్రోల్ CVT మరియు డీజిల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కాంబినేషన్‌తో HTK+ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతే కాకుండా, ఈ మోడల్‌ను అద్బుతమైన ఫీచర్లతో కూడా అప్‌డేట్‌ చేసింది. ఈ కొత్త మోడల్‌లో డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్స్, డ్రైవ్,ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ ఇంకా కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Kia-Seltos-New-HTK-Plus-Variants-Launch

కొత్త సెల్టోస్ HTK+ (పెట్రోల్ CVT, డీజిల్ AT)లో LED DRLలు, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్‌తో కూడిన స్మార్ట్ కీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ డీఫాగర్, రియర్ వైపర్, వాషర్, క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ORVMలు, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్‌, వైర్‌లెస్ ఫోన్ ప్రొజెక్షన్‌తో కూడిన 8 అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్‌ను కూడా పొందవచ్చు.

ఇక ధరల విషయానికొస్తే కియా సెల్టోస్‌ HTK+ వేరియంట్‌లో పెట్రోల్‌ CVT మోడల్‌ రూ. 15.40 లక్షలతో కొనుగోలు చేయవచ్చు. కియా సెల్టోస్‌ HTK+ డీజిల్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ మోడల్‌ను రూ. 16.90 లక్షల ధరతో ప్రవేశపెట్టింది. ఇవన్నీ ఎక్స్‌-షోరూమ్‌ ధరలు.

Kia-Seltos-New-HTK-Plus-Variants-Launch

కొత్త లాంచ్‌పై కియా ఇండియా చీఫ్ సేల్స్ మరియు బిజినెస్ ఆఫీసర్ మ్యుంగ్-సిక్ సోహ్న్ మాట్లాడారు. సెల్టోస్ పట్ల భారత కస్టమర్లు చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు తెలిపారు. కొత్త తరం కస్టమర్ల కోసం కియా మోడల్స్‌ని ఎప్పటికప్పుడు అప్‍డేట్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.

రీఫ్రెష్డ్ 2024 Kia Seltos లో డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్ వంటి టాప్-ఎండ్ ప్రీమియం ఫీచర్లను జతచేయడం ద్వారా.. మోస్ట్ పాపులర్ వేరియంట్ HTK+ని మరింత అందంగా, స్టైలిష్ గా మార్చినట్లు మ్యుంగ్‌-సిక్‌ సోహ్న్‌ చెప్పుకొచ్చారు.

భారత మార్కెట్లో కియా సెల్టోస్‌ HTK+ లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు 20-35 శాతం వరకు ఉన్న అధిక డిమాండ్‌ను గుర్తిస్తూ, CVT మరియు AT ట్రాన్స్‌మిషన్‌లను పరిచయం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కొత్త వేరియంట్ల ద్వారా కస్టమర్లను సెల్టోస్ మరింతగా ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

More from DriveSpark

Article Published On: Monday, April 1, 2024, 14:21 [IST]
English summary
Kia india launches new variants of seltos htk plus price specs features details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+