మీరు ఇంతవరకు ఎన్నడూ చూడని సరికొత్త డిజైన్.. చూస్తే వావ్ అంటారు.. ధర తక్కువ.. ఫెర్ఫామెన్స్ ఎక్కువ
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్(kia motors) ఇండియాలో అడుగుపెట్టినప్పటి నుంచి అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. దేశంలోకి ప్రవేశించిన కొద్ది కాలంలో ప్రతి నగరానికి తన కార్లను విస్తరించింది. ప్రస్తుతం చాలా మంది కియా కార్లను కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఇతర కంపెనీలకు కియా నుంచి పోటీ ఎక్కువ అయింది. పెట్రోల్, డీజిల్ మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ విభాగంలో సైతం కంపెనీ టాప్ కంపెనీల జాబితాలో ఉంది. తక్కువ ధరలో అదిరిపోయే సూపర్ లుక్‌తో కియా కార్లు జనాల ఆదరణను పొందుతున్నాయి. ప్రస్తుతం కియాలో సెల్టోస్, సోనెట్ ఎస్‌యూవీలు ఎక్కువ అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. SUV విభాగానికి ఇండియా మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న నేపథ్యంలో కంపెనీ కీలక నిర్ణయం తీసుకుని 2.0 వ్యూహాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా రాబోయే తన suv టీజర్‌ను విడుదల చేసింది.
కియా ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా విడుదల అయిన టీజర్‌లో కారు మొత్తం డిజైన్ కాకుండా సైడ్ ప్రొఫైల్ కనిపిస్తుంది. ఇది సాధారణ SUV డిజైన్‌కు కొంచెం భిన్నంగా ఉంది. ప్రధానంగా SUV కార్నివాల్ లిమోసిన్, EV9 డిజైన్ల నుండి ప్రేరణ పొందినట్టుగా సరికొత్తగా కనిపిస్తుంది. రాబోయే కొత్త కారు 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుందని తెలుస్తుంది.

ఈ కారు 6-స్పీడ్ ఐఏంటీ, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. IC ఇంజిన్ మోడల్స్‌ను విడుదల చేసిన కొన్ని నెలల తరువాత కంపెనీ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను సైతం విడుదల చేసే అవకాశం ఉంది. అయితే దీని గురించిన ఖచ్చితమైన వివరాలు కంపెనీ వెల్లడించనప్పటికి. మార్కెట్ వర్గాలు మాత్రం ఈవీ వెర్షన్ కూడా లాంచ్ అవుతుందని పేర్కొంటున్నారు.
ఈ కారు ఎలక్ట్రిక వెర్షన్‌లో ఫుల్ ఛార్జింగ్‌తో 350 కి.మీల రేంజ్‌ను అందిస్తుందరని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ కారు దేశంలో పలు రోడ్లపై టెస్టింగ్ చేసినట్లు కూడా కొంత సమాచారం ఉంది. అన్ని టెస్టింగ్‌లు పూర్తయిన తరువాత వచ్చే ఏడాది లేదా ఆ తరువాత మార్కెట్లో అధికారికంగా విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. కానీ దీని గురించి మరింత తెలియాల్సి ఉంది.

రాబోయే SUV డిజైన్ సరికొత్తగా ఉంటుంది. కారు ముందు భాగంలో L ఆకారపు LED టెయిల్ ల్యాంప్స్, నిలువుగా ఉండే LED డే టైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి. కారు వెనుక క్వార్టర్ ప్యానెల్‌కు బ్లాక్ కలర్‌లో సరికొత్త డిజైన్ ఉంటుంది. దీని ఫ్రంట్ కూడా చాలా అందంగా, స్టైలీష్‌గా ఉంటుందని కంపెనీ విడుదల చేసిన టీజర్‌ను బట్టి తెలుస్తుంది. ఇది ఫంక్షనల్ రూఫ్ రెయిల్‌లను కూడా కలిగి ఉంది.
ఎక్స్‌టీరియర్‌తో పాటు ఇంటీరియర్ డిజైన్ సైతం చాలా అందంగా ఉంటుంది. క్యాబిన్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. లోపల 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లెదర్ అప్హోల్స్టరీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, ఆండ్రాయిడ్ ఆటో ప్లే, మరికొన్ని స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు, మంచి సౌండ్ అనుభూతి కోసం బోస్ ఆడియో సిస్టమ్ ఉన్నాయి. దీని ధర కూడా చాలా తక్కువగా ఉండనుంది.
ఇదిలా ఉంటే కియా కంపెనీ నుంచి వచ్చిన కార్లు గత కొన్నేళ్లుగా అధికంగా అమ్ముడుపోతున్నాయి. అనంతపురం ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించిన కంపెనీ పలు రకాల మోడళ్లను వేగంగా ఉత్పత్తి చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలకు డిమాండ్ మేరకు సరఫరా చేస్తుంది. కియా మోటార్స్ త్వరలో సెల్టోస్, కార్నివాల్, సోనెట్, కేరెన్స్, ఈవీ6, ఈవీ9 అనే ఆరు వాహనాలను భారత మార్కెట్లోకి తీసుకువస్తోంది.


Click it and Unblock the Notifications








