కియా సెల్టోస్ 2023 SUVకి భారీ డిమాండ్‌.. తక్కువకాలంలోనే లక్ష బుకింగ్‌లు.. ఏంటీ కారు ప్రత్యేకత?

కియా సంస్థ భారత్‌లో (Kia India) తక్కువ కాలంలోనే ప్రముఖ కార్ల తయారీ సంస్థగా ఎదిగింది. ఈ సంస్థ తన తయారీ ప్లాంట్‌లో దేశంలోనే కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో మాత్రమే ఉంది. ప్రస్తుతానికి ఎలక్ట్రిక్‌ వాహనాలు మినహా భారత్‌లో విక్రయించే అన్ని వాహనాలను ఈ ప్లాంట్‌ నుంచే తయారు చేస్తుంది.

గత కొన్ని నెలల క్రితం కియా ఇండియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను (Kia Seltos 2023) విడుదల చేసింది. పాత మోడల్‌ సెల్టోస్‌ తరహాలోనే ఈ కొత్త మోడల్‌ కూడా భారీ డిమాండ్‌ను సొంతం చేసుకుంది. గత జులైలో ఈ SUVను భారత్‌లో లాంచ్‌ చేసింది. ఇప్పటి వరకు కియా సెల్టోస్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ 1,00,000 బుకింగ్‌లను అందుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

kia seltos facelift cross 1 lakh bookings in india

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌కు (Kia Seltos Facelift) భారీ బుకింగ్‌లు వెనుక.. గత మోడల్‌తో పోలిస్తే కారు డిజైన్ సహా ఇంటీరియర్‌ మార్పులే కారణం అని తెలుస్తోంది. దీంతోపాటు పాత మోడల్‌ కంటే ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ మెరుగైన భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. దీంతోపాటు మరిన్ని కీలక ఫీచర్లను కలిగి ఉంది.

కియా కొత్త సెల్టోస్‌ కారు ధర రూ.10.89 లక్షల నుంచి రూ.20.30 లక్షల వరకు ఉంది. ఈ కారు మూడు ఇంజిన్‌ ఆప్షన్‌లలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. కియా సెల్టోస్‌ 2023.. 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో 133bhp శక్తి, 144Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్‌, CVT గేర్‌బాక్స్‌ ఆప్షన్‌లలో లభిస్తుంది.

kia india has surpassed 1 lakh bookings

దీంతోపాటు ఈ కారు 1.5 లీటర్‌ GDi టర్బో పెట్రోల్‌ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 158bhp శక్తి, 253Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7 స్పీడ్‌ DCT గేర్‌బాక్స్‌, 6 స్పీడ్‌ క్లచ్‌లెస్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌లో అందుబాటులో ఉంటుంది. అలాగే 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌తో 114bhp శక్తిని, 250Nm గరిష్ఠ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజిన్‌ను బట్టి MT, iMT, AT, IVT, DCT ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌లలో అందుబాటులోకి వస్తుంది.

కియా సెల్టోస్‌ 2023 ఫీచర్లు : కియా సెల్టోస్‌ కొత్త కారు లోపలి భాగంలో టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ యానిట్‌ ఉంటుంది. ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే, కార్‌ టెక్‌కు సపోర్టు చేస్తుంది. కొత్త కియా సెల్టోస్‌లో డ్యూయల్‌ జోన్‌ ఆటోమేటిక్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ వ్యవస్థ, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, 360 డిగ్రీల కెమెరా, LED హెడ్‌లైట్లు, బంపర్‌ డిజైన్‌కు ఆకట్టుకుంటుంది.

ADAS సహా కీలక సేఫ్టీ ఫీచర్లు : 2023 కియా సెల్టోస్‌ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, బ్రేక్‌ అసిస్ట్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, ట్రాక్షన్ కంట్రోల్‌, హిల్‌ డిసెంట్‌ కంట్రోల్‌ మరియు హిల్‌ హోల్డ్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లను కొత్త కియా సెల్టోజ్ కలిగి ఉంది. మరియు అత్యంత కీలక ఫీచర్‌ అయిన ADAS (అడ్వాన్సడ్ డ్రైవర్‌ అసెస్టెన్స్‌ సిస్టమ్‌ను) ను కలిగి ఉంటుంది.

జనవరి 2024లో కియా సెల్టోస్‌ ఫేస్‌లిఫ్ట్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో డీజిల్‌ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ SUV ప్రారంభ ధర రూ.11,99,900 (ఎక్స్‌షోరూం) గా ఉంది. హైఎండ్‌ మోడల్‌ రూ.18,27,900 (ఎక్స్‌షోరూం) గా ఉంది. ఈ డీజిల్‌ వేరియంట్‌ 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంది. 114bhp శక్తి 250Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 6-స్పీడ్‌ iMT, 6-స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌తో జతచేయబడి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 6, 2024, 15:53 [IST]
English summary
Kia india surpassed 1 lakh bookings record with the 2023 seltos
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+