అగ్రరాజ్యంలో కియా మోటార్స్ కీలక నిర్ణయం.. ఇప్పుడే తెలుసుకోండి
గ్లోబల్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన కియా మోటార్స్ (Kia Motors) ఇటీవల అమెరికన్ మార్కెట్లో విక్రయించిన కొత్త ఎలక్ట్రిక్ కారు ఈవీ9 (EV9) కోసం స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. కంపెనీ ప్రకటించిన ఈ రీకాల్ 2401 కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కార్ల మీద ప్రభావం చూపుతుంది. ఈ కార్లను కలిగి ఉన్న కస్టమర్లకు ఈ నెల చివరి నాటికి సమాచారం అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇంకటీ కియా ఈ ఈవీ9 కార్లకు ఎందుకు రీకాల్ ప్రకటించింది? రీకాల్ కోసం ఏమైనా చార్జీలు వేస్తారా? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
అమెరికన్ మార్కెట్లో విక్రయించబడిన కొన్ని కియా ఈవీ9 కార్లలో హెడ్‌లైనర్ ప్రొటక్షన్‌లో లోపం ఉన్నట్లు కంపెనీ గుర్తించి స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. అయితే ఈవీ9 కార్లలో ఇలాంటి సమస్య ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు, కస్టమర్లకు కూడా దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ భవిష్యత్తులో దీనికి సంబంధించిన ప్రమాదం తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న కియా ఈవీ9.. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) కి అందించిన పత్రాలలో.. కియా అమెరికా ఎంపిక చేసిన మోడల్‌లు క్రాష్ సమయంలో హెడ్‌లైనర్ రక్షణ అంత సురక్షితంగా లేదని వెల్లడించింది. మే నెలాఖరులో ప్రారంభం కానున్న ఉత్పత్తికి ముందు ప్రీ ప్రొడక్షన్ టెస్టింగ్ సమయంలో వాహన తయారీదారు ఈ సమస్యను కనుగొన్నారు. దీంతో కంపెనీ వెంటనే రీకాల్ ప్రకటించింది.
కొరియాలోని కియా యొక్క గ్వాంగ్‌మియాంగ్ ఆటోలాండ్ ప్లాంట్‌లో ఈవీ9 కోసం పరీక్షలు నిర్వహించారు. ఇందులో 2023 సెప్టెంబరు 25 మరియు 2024 మార్చి 21 మధ్య ఉత్పత్తి చేయబడిన ఈవీ9 కార్లలో సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. ఈ వాహనాలు ఫెడరల్ భద్రతా అవసరాలకు అనుగుణంగా లేవు. ఇది రాబోయే రోజుల్లో తమ కస్టమర్లను ఇబ్బందులో పడేస్తాయేమో అని రీకాల్ ప్రకటించింది.

హెడ్‌లైనర్ సమస్య కారణంగా ఎవరికీ ఎటువంటి గాయాలు లేదా క్రాష్ వంటివి జరగలేదు. ఈ సమస్య ఉన్న కార్ల ఓనర్లకు కంపెనీ త్వరలోనే నోటిఫికేషన్ లెటర్లను పంపించనున్నట్లు సమాచారం. ఈ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ ఎటువంటి రుసుము వసూలు చేయదు. సమస్య ఉన్న వాటిని గుర్తించి ఉచితంగానే భర్తీ చేస్తుంది. కాబట్టి కస్టమర్లు మళ్ళీ డబ్బు చెల్లించలేమో అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
కియా ఈ ఏడాది మే నెల చివర్లో తన జార్జియా ప్లాంట్‌లో అమెరికాలో స్థానికంగా అసెంబుల్ చేసిన మొదటి ఈవీ9 ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. అమెరికాలోని ఈ కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కారు 99.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో ఏకంగా 489 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది 389 Bhp పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

భారత్‌కు కియా ఈవీ9
కియా తన ఈవీ9 ఎలక్ట్రిక్ కారును భారతీయ మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ దీన్ని లాంచ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కారు వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును గెలుచుకుంది. కంపెనీ ఈ కారును భారతదేశంలో లాంచ్ చేయడానికి ముందు పలు విధాలుగా టెస్ట్ చేస్తోంది. కియా ఈవీ9 ఇప్పటికే టెస్టింగ్ సమయంలో పలుమార్లు కనిపించింది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








