కియా నుంచి సీఎన్‌జీ కారు.. టెస్ట్‌ డ్రైవ్‌లో కనిపించిన కొత్త వెర్షన్‌.. కియా లవర్స్‌కి ఇక పండగే!!

కియా కారు లవర్స్‌కి ఆ సంస్థ త్వరలోనే గుడ్‌ న్యూస్‌ చెప్పనుంది. కియా సెల్టోస్‌ సీఎన్‌జీ వేరియంట్‌ని లాంచ్ చేయాలని ఆ సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఆ కారుకి సంబంధించి టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తూ కనిపించింది. ఈ చిత్రాలను మా డ్రైవ్స్‌పార్క్ టీమ్‌ తమ కెమెరాలో బందింఛింది. ఈ స్పై ఫోటోలు కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. ఈ కారులో కియా ఎలాంటి అప్‌డేట్స్ తీసుకురానుంది? త్వరలో రాబాయో కియా సెల్టోస్ మరియు ప్రస్తుత కియా సెల్టోస్ మధ్య తేడా ఏమిటి? తదితర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం.

ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో కియా సెల్టోస్ ఒకటిగా ఉంది. గత కొన్ని నెలలుగా ఈ కారు సేల్స్‌లో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు కంపెనీ విక్రయిస్తున్న బెస్ట్ సెల్లింగ్ కార్లలో కియా సెల్టోస్‌ ఒకటిగా ఉంది. కంపెనీ లైనప్‌లో ఇతర కార్లతో పోల్చితే సెల్టోస్‌ మొత్తం అమ్మకాల్లో అధిక వాటాను కలిగి ఉంది. ఇంకా ఆ సంఖ్యను సెల్టోస్‌ పెంచుకుంటూ వెళ్తుంది.

Kia-Seltos-CNG-Version-Spotted-In-Test-Drive

టర్బో సీఎన్‌జీ కారు టెస్టింగ్: కియా ఇటీవల సెల్టోస్‌ని కొత్త ఫీచర్లు మరియు కొత్త ఇంజిన్ ఆప్షన్స్‌తో అప్‌డేట్ చేసింది. కియా ఇటీవలే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ని విడుదల చేసింది. ఈ సందర్భంలో కంపెనీ సీఎన్‌జీ వేరియంట్‌ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ కారును భారత రికార్డుల్లో పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఈ ఫోటోలు ఇప్పుడు పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

కియా సెల్టోస్ సీఎన్‌జీ వేరియంట్‌ని 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో ప్రవేశపెట్టనుంది. ఈ ఇంజిన్ 1.5-లీటర్ ఇంజిన్‌గా అందించబడుతుంది. ఇది లాంచ్ అయితే టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే మొదటి సీఎన్‌జీ కారు అవుతుంది. దీంతోపాటు రెండు ట్యాంకుల డిజైన్‌తో సీఎన్‌జీ ట్యాంకును ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. టాటా మోటార్స్ ఇప్పటికే తన సీఎన్‌జీ కార్లలో 2-ట్యాంక్ సెటప్‌ని ప్రవేశపెట్టడంతో భారీ విజయాన్ని సాధించింది. దీంతో ఆ టాటా కార్ల అమ్మకాలు పెరిగాయి.

Kia-Seltos-CNG-Spotted

సీఎన్‌జీ కార్లలో బూట్ సదుపాయం పెద్ద సమస్యగా ఉంటుంది. పెద్ద సిలిండర్ కారణంగా ఎక్కువ బూట్ స్పేస్ తీసుకుంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఈ విధంగా సిలిండర్‌కి బూట్ ఏరియాలో ఎక్కువ స్థలం అవసరం ఉండదు. దీంతో ఎక్కువ సరుకులతో పాటు లాంగ్‌ జర్నీలో ఎక్కువ లగేజీని క్యారీ చేయవచ్చు.

ఇటీవలి రోజుల్లో భారతదేశంలో సీఎన్‌జీ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు, హ్యుందాయ్ సంస్థ కూడా డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని ప్రవేశపెడుతుండటంతో హ్యుందాయ్ మరియు కియా బ్రాండెడ్ కార్లలో సీఎన్‌జీ కార్లను జనాలు ఎక్కువగా కొనే అవకాశం ఉంది. కియా సెల్టోల్, కారెన్స్‌లో ఈ సెటప్‌ని పొందే అవకాశం ఉంది.

Kia-Seltos-Spy-Photos

సీఎన్‌జీ టెక్నాలజీని ప్రవేశపెట్టడంతో ఇంజిన్ శక్తి మరియు టార్క్‌ని కొద్దిగా కోల్పోయే అవకాశం ఉంది. పెట్రోల్ ఇంధనంతో నడిచేంత శక్తి సీఎన్‌జీలో లభించదు. ఈ ఇంజిన్ 7-స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ లేదా 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో జతచేయబడే అవకాశం ఉంది. ప్రస్తుతం కియా సెల్టోస్ 1.5-లీటర్ టర్బోఛార్జ్డ్‌ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

ఈ సెల్టోస్‌ లీటరుకు 17.9 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇక సీఎన్‌జీ వేరియంట్‌లో మైలేజీ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కారు కిలో సీఎన్‌జీ 22 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ కారు లాంచ్ సమయంలోనే ఈ కారులో లభించే పూర్తి స్పెసిఫికేషన్స్‌కి వివరాలు, మైలేజీ తదితర అంశాలు పూర్తి స్థాయిలో వెల్లడి అయ్యే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, July 11, 2024, 11:43 [IST]
English summary
Kia seltos cng version testing video spotted expected features and engine details in telugu
Read more on: #kia motors #spy pics #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+