ఆ కియా కారుపై భారీ ఆఫర్.. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకటన!
గత కొన్ని సంవత్సరాలుగా కియా మోటార్స్ (Kia Motors) దేశంలో దూసుకెళ్తుంది. ఆ కంపెనీ నుంచి విడుదలైన కార్లు దాదాపు మార్కెట్‌లో మంచి వాటాను కలిగి ఉన్నాయి. తాజాగా కియా 10 లక్షల యూనిట్ల సేల్స్ మార్క్‌ని చేరుకుంది. ఈ కంపెనీ నుంచి విడుదలైన కార్లు ఆకర్షణీయమైన డిజైన్లు, ఫీచర్లతో మార్కెట్‌లో కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు కూడా వాటిని ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారని ఇటీవలే పలు నివేదికలు వెల్లడించాయి. ఆ కంపెనీ 2019లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ 'సెల్టోస్' (Seltos) రాకతో దేశీయ కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. మొత్తం అమ్మాకాల్లో కియా సెల్టోస్ ఎస్‌యూవీ ఒక్కటటే 4,80,000 యూనిట్ల అమ్మకాలతో 48% వాటాను కలిగి ఉంది.
ప్రస్తుతం కియా సెల్టోస్ ఎస్‌యూవీ భారతదేశంలో లాంచ్ చేసి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ కారు సాధించిన మైలురాయికి గుర్తుగా దీని కొనుగోలుపై భారీ ఆఫర్‌ని ప్రకటించింది. అందులో భాగంగా ఇది 5 సంవత్సరాల వారంటీ రూ .60,000 విలువైన బెనిఫిట్స్ లభించనున్నాయి. దీనిపై మరింత సమాచారం కోసం మీ సమీప షోరూమ్‌ని సందర్శించండి.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్న సరికొత్త కియా సెల్టోస్ ఎస్‌యూవీ ధర రూ.10.90 లక్షల నుంచి రూ.20.37 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఇది HTE, HTK, HTK ప్లస్, HTX, HTX ప్లస్, GTX, GTX ప్లస్, GTX ప్లస్ (S), X-Line, X-Line ప్లస్ (S) వంటి మొత్తం 10 వేరియంట్లలో లభిస్తుంది.
ఈ కారు క్లియర్ వైట్, గ్లేసియర్ పెరల్ వైట్, అరోరా బ్లాక్ పెర్ల్, గ్రావిటీ గ్రే, స్పార్క్లింగ్ సిల్వర్ వంటి వివిధ ఆకర్షణీయమైన కలర్స్‌లో ఈ కారులో లభిస్తుంది. దీనిలో 5 మంది వరకు సులభంగా ప్రయాణించగలదు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి వీలుగా 433 లీటర్ల సామర్థ్యం గల బూట్ స్పేస్ ఇందులో కలదు.

కొత్త ఎస్‌యూవీ అత్యాధునిక డిజైన్ ను కలిగి ఉంది. ఇందులో LED హెడ్‌ల్యాంప్స్, LED డేలైట్ రన్నింగ్ లైట్స్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఈ కారు 6-స్పీడ్ మాన్యువల్ / ఆటోమేటిక్, 7-స్పీడ్ డీసీటీ (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పనిచేస్తుంది. కియా సెల్టోస్ వేరియంట్లను బట్టి లీటరుకు 17 నుంచి 20.7 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ 10.25 అంగుళాల డిస్ ప్లేలు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. కియా సెల్టోస్‌లో ఇంకా మరెన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆకర్షించే విధంగా ఫీచర్లను కంపెనీ అందించింది.

సెల్టోస్ ఎస్‌యూవీ ప్రయాణీకులకు మంచి సేఫ్టీని అందిస్తుంది. సేఫ్టీ ఫీచర్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఇబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), లెవల్ -2 (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. హోండా ఎలివేట్, ఎంజీ ఆస్టర్, హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి కార్లు ఈ కారుకు గట్టి పోటీనిస్తుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








