కనీవినీ ఎరుగని రీతిలో దూసుకెళ్తున్న కియా సోనెట్.. అమ్మకాల్లో సరికొత్త రికార్డ్

దేశీయ మార్కెట్లో ప్రారంభం నుంచి అత్యధిక ప్రజాదరణ పొందిన 'కియా మోటార్స్' (Kia Motors) అమ్మకాల్లో దూసుకెళ్తోంది. కంపెనీ లాంచ్ చేసిన సోనెట్ ఇటీవల ఏకంగా 4 లక్షల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

కియా మోటార్స్ తన సోనెట్ SUVని 2020 సెప్టెంబర్ నెలలో ప్రారంభించింది. సంస్థ ఈ కారును లాంచ్ చేసి కేవలం నాలుగు సంవత్సరాల కంటే తక్కువ సమయంలోనే అమ్మకాల్లో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఇందులో దేశీయ అమ్మకాలు మాత్రమే కాకుండా.. ఎగుమతులు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే భారతదేశంలో మాత్రమే కాకుండా.. విదేశాల్లో కూడా ఈ కారుకు మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది.

2024 Kia Sonet

కియా మోటార్స్ యొక్క సోనెట్ SUV దేశీయ అమ్మకాలు 317754 యూనిట్లు కాగా, 85714 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. దేశంలో కంపెనీ యొక్క మొత్తం అమ్మకాల్లో సోనెట్ వాటా 33.3 శాతంగా ఉంది. ఇందులో కూడా పెట్రోల్ మరియు డీజిల్ కార్ల అమ్మకాలు వరుసగా 63 శాతం మరియు 37 శాతంగా ఉన్నట్లు సమాచారం. అంటే మార్కెట్లో డీజిల్ సోనెట్ అమ్మకాల కంటే.. పెట్రోల్ కార్లకు డిమాండ్ ఎక్కువని తెలుస్తోంది.

దేశీయ విఫణిలో అత్యధిక అమ్మకాలు పొందిన కియా సోనెట్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ కలిగి ఉంటుంది, డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ పొందుతుంది. దాదాపు 63 శాతం కస్టమర్లు సన్‌రూఫ్‌ కలిగిన సోనెట్ కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం.

2024 Kia Sonet Action Shot

మెడ్ ఇన్ ఇండియా కియా సోనెట్ SUV ఆఫ్రికన్, మిడిల్ ఈస్టర్న్ వంటి దేశాల్లో కూడా విక్రయించబడింది. కంపెనీ విదేశీ మార్కెట్లో కూడా సొనెట్ SUVని విక్రయించడానికి అనుకూలంగా లెఫ్ట్ అండ్ రైట్ డ్రైవ్ వెర్షన్లను తయారు చేస్తోంది. 2017లో కంపెనీ ఇండోనేషియాలో విక్రయించడానికి 7 సీటర్ సోనెట్‌ను తయారు చేసింది. అయితే ఊహించని రీతిలో ఈ కారు అమ్మకాలు సాగలేదు. దీంతో దీని ఉత్పత్తి నిలిచిపోయింది.

కియా సోనెట్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 4 వె పవర్ డ్రైవర్ సీటు, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

2024 Kia Sonet Interior

ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రినిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ మరియు ఫార్వర్డ్ కొలిషన్ వార్ణింగ్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కియా సోనెట్ ధర రూ. 7.99 లక్షల నుంచి రూ. 15.75 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ SUV మార్కెట్లో టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా మరియు మహీంద్రా XUV300 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, April 27, 2024, 11:35 [IST]
English summary
Kia sonet achieves 4 lakh milestone in sales
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+