11 నెలల్లో ఏకంగా లక్ష మందికి పైగా కొన్న కియా మోడల్ ఇదే.. రూ.8 లక్షల కారునే ఎక్కువగా కోరుకున్న జనం

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ ఇండియా (Kia india)లో లాంచ్ అయిన అనతి కాలంలోనే వేగంగా భారత మార్కెట్లో దిగ్గజ కార్ల కంపెనీగా అవతరించింది. దాదాపు అన్ని నగరాల్లో కూడా కియా వాహనాలు కనిపిస్తుంటాయి. టాటా మోటార్స్, మహీంద్రా వంటి దిగ్గజ కార్ల తయారీ కంపెనీలకు ధీటుగా ప్రతి ఏటా సేల్స్ పరంగా దూసుకుపోతోంది. భారతీయ వినియోగదారులకు బాగా ఇష్టమైన ఎస్‌యూవీ (SUV)లు, ఎంపీవీ (MPV)లను కియా విడుదల చేస్తూ మంచి మార్కెట్ వాటాను సాధిస్తుంది. కేవలం ఐదు సంవత్సరాల కాలంలోనే భారతీయ వినియోగదారులకు అత్యంత ఇష్టమైన కార్ల కంపెనీల్లో టాప్ 5 బ్రాండ్‌లలో ఒకటిగా మారింది. కియా కార్లలో ఎక్కువగా సెల్టోస్ మోడల్ కంపెనీకి మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత సోనెట్ (Sonet) కూడా ఎక్కువ మంది కస్టమర్లకు చేరి మెరుగైన సేల్స్‌ను సాధించింది.

తాజాగా విడుదలైన డేటా ప్రకారం, కియా సోనెట్ భారతీయ మార్కెట్లో 2024 జనవరి నుంచి నవంబర్ నెల వరకు లక్షకు పైగా అమ్మకాలను నమోదు చేసి సేల్స్‌లో సరికొత్త మైలు రాయికి చేరుకుంది. 11 నెలల కాలంలోనే సోనెట్ మొత్తం 1,03,353 యూనిట్ల సేల్స్ సాధించింది. 2024 నవంబర్‌లో సోనెట్‌ను దాదాపు 9255 మంది కొనుగోలు చేశారు. గత ఏడాది(2023) నవంబర్ నెలతో పోలిస్తే ఇది 43.87 శాతం వృద్ధి.

Kia Sonet Crossed 1 Lakh Sales Units

కియా సోనెట్ 2024లో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3XO, మారుతీ బ్రెజ్జా వంటి కార్లతో పాటు రికార్డు సేల్స్‌ను నమోదు చేసింది. సోనెట్ మోడల్ గత ఏడాది జూన్ నుంచి నవంబర్ మధ్య కాలంలో కూడా 9,000కు పైగా యూనిట్ల అమ్మకాలను సాధించింది. అలాగే 2024 మాత్రం ఇంతకంటే ఎక్కువ సేల్స్‌ను నమోదు చేసి సోనెట్ కియాకు బెస్ట్ కారుగా నిలిచింది.

2024 సెప్టెంబర్ పండుగ సీజన్‌లో 10,335 మంది ఈ కారును కొనుగోలు చేశారు. కియా సోనెట్ అప్‌డేట్ ఫీచర్లతో వచ్చింది. దీని బేస్ వేరియంట్ ధర రూ.7.99 లక్షల ధరకు అందుబాటులో ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ.15.76 లక్షలుగా ఉంది. ఈ ధరలు ఎక్స్ షోరూమ్‌వి. కియా సోనెట్ మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. రెండు పెట్రోల్, డీజిల్ ఆప్షనలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Kia Sonet Crossed 1 Lakh Sales

మొదట 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 120 bhp పవర్, 172 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండోది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇది 83 bhp పవర్, 115 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే 1.5-లీటర్ డీజిల్ ఆప్షన్‌లో 116 bhp పవర్, 250 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

ఇక గేర్‌బాక్స్ విషయానికి వస్తే, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌‌కు 7-స్పీడ్ DCT, 6-స్పీడ్ iMTని, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు 5 స్పీడ్ మాన్యువల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌కు iMT, 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జోడించారు. కియా సోనెట్ మైలేజ్ కూడా బాగానే వస్తుంది లీటర్ పెట్రోల్‌కు దాదాపు 18.4 కి.మీల నుంచి 24.1 కి.మీల వరకు వస్తుంది.

Kia Sonet Sales Units In India

కియా సోనెట్ అన్ని వర్గాల వారికి అందుబాటు ధరలో లభించడంతో పాటు, మైలేజ్ కూడా ఎక్కువగా వస్తుండటంతో ఈ కారును ఎక్కువ మంది వినియోగదారులకు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. రానున్న రోజుల్లో ఈ కారు ఇంకా మరిన్ని సేల్స్‌ను సాధిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, December 23, 2024, 17:12 [IST]
English summary
Kia sonet crossed 1 lakh sales units in 2024 january to november
Read more on: #kia motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+