కియా కారు సరికొత్త రికార్డు.. మధ్య తరగతి వాళ్లు కొనే ఏకైక కియా కారు ఇదే!

దేశంలో కియా కార్లకు మంచి మార్కెట్‌ ఉంది. కంపెనీ దేశంలో అడుగుపెట్టి కేవలం ఐదేళ్లలోనే కోట్ల సంఖ్యలో కస్టమర్లను సొంతం చేసుకుంది. ఈ కంపెనీ తొలుత 2019 లో సెల్టోల్‌ని భారతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. ఆ ఏడాది తర్వాత కియా 2020 సెప్టెంబర్‌లో సోనెట్ (Kia Sonet)ని ప్రవేశపెట్టింది. ఇది దేశంలోని కార్ల మార్కెట్‌లోనే ఓ గేమ్ ఛేంజర్‌గా ఎదిగింది. కియా సోనెట్ సెప్టెంబర్ 18, 2024 నాటికి భారతదేశంలో లాంచ్ అయి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ కారు ఇప్పుడు సరికొత్త మైలురాయిని చేరుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలపై ఓ లుక్కేయండి.

దేశంలో ఎన్నో కార్ల కంపెనీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా కొన్ని పూర్తిగా విఫలం అయ్యాయి. మరికొన్ని నిలదొక్కుకున్నా కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టడం లేదు. అయితే కియా మోటార్స్‌ మాత్రం దేశంలో అడుగుపెట్టిన కొద్ది రోజులకే జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్లింది. ఈ మధ్య కాలంలో సక్సెస్‌ సాధించిన కార్ల కంపెనీల్లో కియా ఒకటిగా ఉంది. ఎన్నో అంచనాల మధ్య కియా 2019లో సెల్టోస్ కారుతో భారత్‌లోకి ప్రవేశించింది.

Kia Sonet Crossed 4 5 Lakhs unit sales

కియా సెల్టోస్ అత్యంత విజయవంతమైన కారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే కియా సెల్టోస్‌ని భారతదేశంలో మొదటి కారుగా లాంచ్ చేసి కియా హిట్‌ టాక్‌ని సాధించింది. ఆ తర్వాత కియా 2020లో రెండు కార్లను విడుదల చేసింది. వాటిలో ఒకటి సోనెట్. వాస్తవానికి, ఇటీవలె కాలంలో సెల్టోస్ కంటే ఎక్కువగా సోనెట్ కార్లను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. దీని ధర రూ. 8- 15 లక్షలుగా ఉంది.

దీనికి ప్రధాన కారణం సోనెట్ కారు కాంపాక్ట్ డిజైన్‌ అని చెప్పవచ్చు. దీని ధరల చాలా తక్కువ. 2024 ఆగస్టు నాటికి ఈ కారు భారతదేశంలో మొత్తం 4,49,812 యూనిట్లు విక్రయించబడ్డాయి. ఇందులో 3,57,743 భారత్‌లో విక్రయించగా, 92,069 విదేశాలకు ఎగుమతి అయ్యాయి. గత నాలుగేళ్లలో కియా సోనెట్ 92,069 యూనిట్లను మన దగ్గరే తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేశారు.

Kia Sonet

సెప్టెంబర్ 2020 నుంచి ఆగస్టు 2024 వరకు 4,49,812 సోనెట్ కార్లు అమ్ముడయ్యాయి. ఈ నెల అమ్మకాల గణాంకాలను కలుపుకుంటే ఈ కారు కచ్చితంగా సోనెట్ కార్ల సంఖ్య 4.5 లక్షలు దాటుతుంది. సెప్టెంబర్ 2020 మార్చి 2021 మధ్య 63,717 సోనెట్ కార్లు, ఏప్రిల్ 2021 మార్చి 2022 మధ్య 73,864 సోనెట్ కార్లు, ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 మధ్య 94,096 సోనెట్ కార్లు అమ్ముడయ్యాయి.

అయితే 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు సోనెట్ కార్ల సంఖ్య స్వల్పంగా తగ్గి 81,384కు చేరింది. 2024 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు గత ఐదు నెలల్లో మొత్తం 44,582 సోనెట్ కార్లు అమ్ముడయ్యాయి. 2025 మార్చి చివరి నాటికి ఈ సంఖ్య లక్ష దాటుతుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Kia Sonet Sales Report

గత ఐదు నెలల్లో కియా కార్లలో సోనెట్ వాటా 43.04 శాతంగా ఉంది. గత నాలుగేళ్లలో కియా మొత్తం కార్ల అమ్మకాలలో సోనెట్ వాటా 37 శాతంగా ఉంది. కియా సోనెట్, సెల్టోస్, కారెన్స్‌లతో 5వ అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉంది. ప్రస్తుతం మొత్తం కార్ల అమ్మకాలలో కియా వాటా 9.40% వాటాగా ఉంది. ప్రతి 10 మందిలో ఒకరు కచ్చితంగా కియా కార్లను కొనుగోలు చేస్తారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 24, 2024, 9:57 [IST]
English summary
Kia sonet crossed 4 5 lakhs unit sales in india in just 4 years check full report here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+