Kia Sonet Facelift: ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్న కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్.. ఆ రోజే లాంచ్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియాకు చెందిన సోనెట్ సబ్-కాంపాక్ట్ SUV భారత మార్కెట్లో ప్రజాదరణ పొందింది. కాగా తాజాగా కియా ఇండియా ఈ సోనెట్ SUVని కొత్త అప్‌డేట్‌లతో ఆవిష్కరించగా.. త్వరలో లాంచ్ కానుంది. కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్, ఫీచర్ల గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో..
అప్‌డేటెడ్ 2024 Kia Sonet ఫేస్‌లిఫ్ట్ SUV ని జనవరి 12న మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు కియా ఇండియా తెలిపింది. కాగా SUV కొనుగోలు కోసం బుకింగ్‌లు ప్రారంభం కాగా రూ. 25,000 చెల్లించి కస్టమర్లు బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కొత్త Kia Sonet SUV డిజైన్ పరంగా ఇంకా అనేక కొత్త ఫీచర్లతో అప్‌డేట్ అయింది. మూడేళ్ల కిందట మార్కెట్లోకి లాంచ్ అయిన సోనెట్ ఫీచర్-లోడెడ్‌తోనే ఉంది.

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ 2024 SUV పెట్రోల్ మరియు డీజిల్‌తో సహా మూడు ఇంజిన్ ఆప్షన్లతో విడుదల కానుంది. 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 82 బిహెచ్‌పి పవర్ మరియు 115 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ SUV 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 118 bhp శక్తిని మరియు 172 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా ఈ ఇంజిన్ 6-స్పీడ్ iMT మరియు 7-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

కాగా కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ SUVలోని ఏకైక డీజిల్ ఇంజిన్ 1.5-లీటర్ యూనిట్ అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజిన్ 114 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ iMT మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో జతచేయబడి ఉంటుంది.
డిజైన్ పరంగా కొత్త కియా సోనెట్ కియా యొక్క అదే సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్‌తో వస్తుంది. Kia Sonet SUV యొక్క LED హెడ్‌లైట్ యూనిట్ కొత్త సెల్టోస్ మరియు కేరెన్స్‌లలో ఉపయోగించిన మాదిరిగానే ఉంటుంది. ఇంకా ఇందులో కొత్త LED DRLలు, రెండు చివర్లలో హెడ్‌ల్యాంప్‌లు ఉండగా.. SUV సిల్వర్ స్కిడ్ ప్లేట్‌లతో అడ్జస్టబుల్ బంపర్‌ను కలిగి ఉంది.

ఫీచర్ల విషయానికొస్తే కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్.. అప్‌డేటెడ్ అప్హోల్స్టరీతో కొత్త డ్యూయల్-టోన్ క్యాబిన్‌తో వస్తుంది. వేరియంట్ల ప్రకారం ఇంటీరియర్ ఆప్షన్లు ఉంటాయి. కాగా ఈ SUV యొక్క టెక్ లైన్ ట్రిమ్‌లు మూడు ఇంటీరియర్ ఆప్షన్లతో వస్తాయి. ఇందులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ యూనిట్, అదే పరిమాణంలో అప్‌డేటెడ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

ఇంకా కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, బోస్ సౌండ్ సిస్టమ్, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి ఇతర ఫీచర్లతో అప్‌డేట్ అయింది. హ్యాండ్స్-ఫ్రీ కనెక్టివిటీ మరియు ఫంక్షన్‌ల కోసం అలెక్సా వాయిస్ కమాండ్‌లను కూడా చూడవచ్చు. కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఏడు వేరియంట్లు HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+ లలో రానుంది.


Click it and Unblock the Notifications








