Kia Sonet Facelift మైలేజీ వివరాలు వెల్లడి.. అధిక మైలేజీతో వాహనానికి భారీ డిమాండ్‌ ఉంటుందా?

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్‌ (Kia Sonet Facelift) మైలేజీ వివరాలను వెల్లడించింది. ఈ ఎస్‌యూవీ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. రూ.25 వేలు చెల్లించి ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. ఈ కియా సోనెట్‌ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్‌ త్వరలో లాంచ్‌ కానుంది.

కియా సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్ మైలేజీ వివరాలు : తాజాగా కియా సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్ వివరాలు (Kia Sonet Facelift mileage) వెల్లడయ్యాయి. పెట్రోల్ ఇంజిన్‌ వేరియంట్‌లు 18.79 కి.మీ - 19.20 కి.మీ మైలేజీ అందిస్తాయని పేర్కొంది. అదే డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్లు 18.60 కి.మీ - 22.40 కి.మీ మైలేజీని అందిస్తాయని సంస్థ తెలిపింది.

kia sonet facelift

రూ.25 వేలు చెల్లించి బుకింగ్ చేయవచ్చు : అధిక మైలేజీ కారణంగా ఈ SUVకి ఎక్కువ డిమాండ్‌ ఉంటుందని కియా భావిస్తోంది. డిసెంబర్‌ 20 అర్ధరాత్రి నుంచి బుకింగ్‌లను ప్రారంభించింది. కియా అధికారిక వెబ్‌సైట్‌ లేదా డీలర్‌షిప్‌ వద్దకు వెళ్లి బుకింగ్‌ మొత్తం రూ.25 వేలు చెల్లించి, ఆర్డర్‌ చేయవచ్చు.

సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్లు, గేర్‌బాక్స్‌లు : కియా సోనెట్‌ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్‌ 1.2 నేచురల్‌ ఆస్ఫిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌, 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ ఇంజిన్లు 5-స్పీడ్‌, 6-స్పీడ్‌ మాన్యువల్‌, 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌, 7-స్పీడ్‌ DCT గేర్‌బాక్స్‌ కూడా అందుబాటులో ఉంది.

kia sonet facelift news

సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు, రంగులు : కియా సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్‌ HTE, HTK, HTK+, HTX, HTX+, GTX, X-లైన్‌ అనే వేరియంట్లు సహా 11 రంగుల ఎంపికల్లో అందించబడుతుంది. గ్లేసియర్‌ వైట్‌ పెర్ల్‌, స్పార్క్లింగ్‌ సిల్వర్, గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్‌ పెర్ల్‌, ఇంటెన్స్‌ రెడ్‌, ఇంపీరియల్‌ బ్లూ, క్లియర్‌ వైట్‌, ప్యూటర్‌, ఆలివ్‌ సహా మరిన్ని రంగుల్లో అందుబాటులో ఉంది.

సోనెట్‌ కొత్త మోడల్‌ SUV ఆకర్షణీయమైన ఫీచర్లు సహా ఇంటీరియర్‌ కూడా ఆకట్టుకుంటుంది. కొత్త డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్‌ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, డ్రైవ్ మోడ్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, క్లైమేట్‌ కంట్రోల్‌, OTA అప్‌డేట్‌, 7-స్పీకర్‌ మ్యూజిక్ సిస్టమ్‌ వంటివి ఉన్నాయి.

kia sonet facelift interior

కియా సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్ SUV LED హెడ్‌ల్యాంప్‌, టెయిల్‌లైట్‌, ఆకట్టుకొనే LED ఫాగ్‌లైట్లు, ఆల్‌ వీల్‌ డిస్క్‌ బ్రేకులు, 16 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు వెనుకవైపు డిజైన్‌ కూడా ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ కారు అధికారికంగా లాంచ్ కానుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, January 6, 2024, 12:31 [IST]
English summary
Kia sonet facelift suv mileage figures revealed here are the specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+