కియా కొత్త కారును చూసి అవాక్కైన పాప.. అదిరిపోతున్న ఇంటీరియర్.. దుమ్మురేపుతున్న టీజర్
ఇండియాలోకి అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే దిగ్గజ కార్ల తయారీ కంపెనీలకు పోటీ ఇచ్చేలా ఎదిగిన దక్షిణ కొరియా బ్రాండ్ కియా మోటార్స్(kia motors) గురించి అందరికీ తెలిసిందే. ఇతర దేశాల కంటే కూడా కియా కార్లు ఇండియాలో ఎక్కువగా అమ్ముడు పోతున్నాయి. ఈ ఏడాదిలో అధునాతన డిజైన్లతో కార్తను విడుదల చేసి సేల్స్ పరంగా టాటా మోటార్స్, మహీంద్రా, మారుతీ సుజుకీ వంటి దిగ్గజ వాహన తయారీ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చింది. కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించడానికి పెట్రోల్, డీజిల్ కార్లను విడుదల చేస్తూనే మరోవైపు ఎలక్ట్రిక్ కార్లను కూడా లాంచ్ చేస్తుంది. ఇటీవల కియా కంపెనీ సైరోస్( Kia syros) ఎస్‌యూవీ (SUV)ని ఆవిష్కరించగా, తాజాగా దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఈ కారు సొనెట్ తర్వాత కంపెనీ 2వ సబ్ 4మీ suvగా వస్తుంది.
కియా కంపెనీ నుంచి ఇప్పుడు విడుదలైన టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. దీనికి ప్రధాన కారణం తన కారు ప్రమోషన్‌ను ప్రత్యేకంగా ఒక చిన్న పాపతో చేసింది. టీజర్ చూసినట్లయితే సైరస్ కారు ముందు పాప నిలబడి ఉండటం అలాగే కారు ఇంటీరియర్‌ను సైతం చూపించడానికి సీటుపై కూర్చోవడం వంటివి చూడవచ్చు. కారు గురించి అన్ని వివరాలను వినియోగదారులకు చూపిస్తున్నట్లు టీజర్‌లో ఉంది.

ఈ టీజర్‌లో కారు ఇంటీరియర్ మొత్తం వివరించారు. లోపల చాలా అందంగా ఉంది. ముందు, వెనుక వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు, అలాగే, 60:40 స్ప్లిట్ వెనుక సీట్లు.ప్రత్యేకం. పనోరమిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, వెనుక AC వెంట్‌లు, వెనుక విండో షేడ్స్, ఇంకా డజన్ల కొద్ది ఫీచర్లు ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ కోసం 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, దీని ప్రక్కన 5-అంగుళాల టచ్‌స్క్రీన్, ఇంకా 12.3-అంగుళాల నాన్-టచ్ ప్యానెల్ ఉంది.
వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ప్రయాణంలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, లాంగ్ డ్రైవ్, ఫ్యామిలీతో కలిసి టూర్ల వెళ్లే సమయంలో ఎక్కువ లగేజీ పెట్టడానికి సరిపడినంత బూట్ స్పేస్ ఉన్నాయి. టీజర్‌లో పాప, కారు ఎక్స్‌టీరియర్ డిజైన్ చూసి ఆశ్చర్యానికి లోనైనట్లుగా కూడా కనిపిస్తుంది. పెద్ద 17-అంగుళాల వీల్స్ సైరస్‌కు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఈ SUV డిజైన్ సరికొత్తగా ఉంది.

ముందు ఆకర్షణీయమైన హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, హై-సెట్ బానెట్, రూఫ్ రెయిల్‌లు, డిజిటల్ టైగర్ నోస్ గ్రిల్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కియా సైరస్ డిజైన్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లినట్లుగా ఉన్నాయి. లోపల ప్రయాణికుల భద్రత పరంగా కూడా ఈ ఎస్‌యూవీలో లెవెల్-2 ADAS ఉంది, ఇది రాడార్ ఆధారితంగా పనిచేస్తుంది. టీజర్‌లో కనిపించిన దాని ప్రకారం, క్యాబిన్ థీమ్ కూడా కట్టిపడేసేలా ఉంది.
ఇక కియా సైరోస్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 1.0L 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5L 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లో వస్తుంది. టర్బో పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది. అదే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, పెట్రోల్ ఇంజిన్‌కు 7-స్పీడ్ డీసీటీ (DCT), డీజిల్‌కు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌ను జోడించారు.

మిగతా కంపెనీల కంటే భిన్నంగా కియా ఆలోచించి చిన్న పాపతో కారు ఇంటీరియర్ ఫీచర్లను ప్రపంచానికి తెలిసేలా చేయడం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. దీంతో ఈ కారుపై అంచనాలు మరింత పెరిగాయి. టీజర్ విజయవంతంగా సక్సెస్ కావడంతో కంపెనీ కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. కియా సైరోస్ ఎస్‌యూవీ త్వరలో లాంచ్ అవుతుంది.


Click it and Unblock the Notifications








