కియా కొత్త కారులో కత్తిలాంటి ఫీచర్లు.. చూశారో ఇట్టే పడిపోతారు.. విడుదల ఎప్పుడంటే?
కియా మోటార్స్ భారత్‌లో టాప్ 5 కంపెనీలలో ఒకటిగా ఉంది. ఈ సంస్థ నుంచి అందుబాటులో ఉన్న కార్లు చాలా తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీని పొందాయి. ప్రతీ నెలా అమ్మకాల్లో సెల్టోస్, సోనెట్ కార్లు టాప్ 10 జాబితాలో చోటు సంపాదిస్తున్నాయి. మరింత మంది కస్టమర్లకు చేరువ అయ్యేందుకు, ముఖ్యంగా మాస్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ కొత్త కారుని తీసుకురాబోతుంది. ఈ కారుని ఈ నెల 19న భారత్‌లో లాంచ్ చేయనున్నారు. అదే కియా సైరోస్ (Kia Syros). ఈ కారు అందరికీ అందుబాటు ధరలో ప్రీమియం ఫీచర్ల రానుంది. ఈ కారుకి సంబంధించిన పూర్తి వివరాలు, తదితర అంశాలు ఈ కథనంలో మీకోసం..
ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రస్తుతం మార్కెట్‌లోని టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజా, మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO లకు గట్టి పోటీని ఇస్తుంది. భారతీయ రోడ్లపై రైడ్ చేయడానికి ఇంకా తొమ్మిది రోజులే ఉంది. ఈ క్రమంలో కస్టమర్లను తన వైపుకు తిప్పుకునే పనిలో కియా పడింది. తాజాగా కియా సైరోస్ టీజర్‌ని విడుదల చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన టెస్ట్‌రైడ్ విజువల్స్ సైతం వైరల్ అయ్యాయి.

తాజాగా టీజర్‌తో మరింత ఆసక్తిని పెంచింది. ఈ కారుకి సంబంధించిన ఫీచర్లు, ఇతర కీలక అప్‌డేట్స్‌ని కంపెనీ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది. గత కొన్ని రోజులుగా ఈ కారు ప్రమోషన్‌లో కియా చురుగ్గా పాల్గొంటోంది. ఇప్పటి వరకు ఎక్స్‌టీరియర్ లుక్, కారు స్టైలింగ్‌ని వెల్లడించే టీజర్లను విడుదల చేసిన కియా.. తాజాగా ఇందులో ఫీచర్లను వివరించే టీజర్‌ని వెల్లడించింది.
ఈ టీజర్‌లో ఇంటీరియర్‌లోని ఫీచర్లను రివీల్ చేసింది. ఎక్స్‌టీరియర్ లుక్‌కి తగిటనట్లుగానే ఇంటీరియర్‌లో హై ఎండ్ ఫీచర్లను, క్లాసీ డిజైన్‌తో అందించారు. ఇందులో లెథరెట్ సీట్లు, వైర్‌లెస్ మోబైల్ ఛార్జర్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్, 360 డిగ్రీల కెమెరా, పార్కింగ్ సెన్సార్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఈబీడీ విత్ ఏబీఎస్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వెనుక డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.

ఈ కారులో సేఫ్టీ కోసం అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ కూడా ఉంది. ఈ ఫీచర్ల వల్ల కియా సైరోస్ కోసం భారతీయులు క్యూ కడతారని ఆటోమోబైల్ నిపుణులు భావిస్తున్నారు. ఫీచర్లకు తగినట్లుగానే పవర్‌ట్రైన్‌ని సైతం అందించే అవకాశం ఉంది. ఇంజిన్ పరంగా సోనెట్, సెల్టోస్‌లలో వచ్చే 1.2-లీటర్ NA పెట్రోల్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లతోనే ఇది కూడా రానుంది.
ఇది 6-స్పీడ్ AMT, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. మాస్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తుండటంతో భారీ మైలేజీని సైతం ఇవ్వనుంది. భారత్‌లో డీజిల్ ఇంజిన్ కారు మోడళ్లకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఈ స్థితిని గ్రహించిన కియా త్వరలోనే తీసుకురాబోయే సైరోస్‌ని సైతం డీజీల్ వెర్షన్‌లో తీసుకురానుంది. దీని ధరపై ఇప్పటికీ క్లారిటీ లేదు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








