కారు కొనేవారు కాస్త ఆగండయ్యా.. కియా కొత్త కారులో పిచ్చెక్కించే ఫీచర్లు ఉన్నాయి.. ధర రూ. 10 లక్షల లోపే!
దేశంలో కియా కార్లకు క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. భారత్‌లో అడుగుపెట్టిన ఐదేళ్లలోనే ఈ సంస్థ టాప్ 5లో స్థానం సంపాదించింది. ఈ దక్షణ కొరియా దిగ్గజ కంపెనీ ఇప్పుడు భారత మార్కెట్‌ని మరో సర్‌ప్రైజ్‌తో ముందుకు వస్తోంది. ఈ సారి మార్కెట్‌ని పూర్తి స్థాయిలో శాసించే విధంగా సరికొత్త కారుని విడుదల చేయనుంది. ఈ కారుని ముఖ్యంగా మాస్ మార్కెట్‌ని టార్కెట్ చేస్తూ తీసుకువస్తుంది. కావున ఈ కారు ధర రూ. 10 లక్షల లోపే ఉండనుంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి కియా సెల్టోస్, సోనెట్, కేరెన్స్ అమ్మకాల్లో అదరగొడుతున్నాయి. త్వరలో విడుదల కానున్న ఆ కారు నుంచి భారీ అప్‌డేట్ వచ్చింది ఆ వివరాలు ఈ కథనంలో..
సైరోస్ ఎస్‌యూవీ పేరుతో మార్కెట్‌లో కొత్త కారుని కియా ప్రవేశపెట్టనుంది. ఈ కారు అతి త్వరలో రోడ్లపై కనిపించనుంది. ఇప్పటికే దీనికి ఈ కారు టెస్టింగ్‌కి సంబంధించిన వీడియోలు కూడా విరివిగా కనిపించాయి. కంపెనీ ఫేమస్ లైనప్స్‌లో సోనెట్, సెల్టోస్ పేరు వచ్చేలా దీనిని పేరు పెట్టారు. ఈ కారు విడుదలకు ముందు కారులోని ఫీచర్లను ఒక్కొక్కొటిగా కంపెనీ ప్రవేశపెడుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

దేశంలో భారతీయులు ఎక్కువగా కోరుకునే ఫీచర్లలో పనోరమిక్ సన్‌రూఫ్ ఒకటి. కార్లు కొనేముందు జనాలు కచ్చితంగా ఈ ఫీచర్ ఉందో లేదో చెక్ చేసుకుంటున్నారు. త్వరలో కియా తీసుకురాబోయే ఈ కారులోనూ ఈ ఫీచర్‌ని తీసుకువస్తున్నట్లు టీజర్‌ని విడుదల చేసింది. దీంతో పాటు వీటిలో వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్స్, డ్రైవ్ మోడ్స్, ట్రాక్షన్ మోడ్స్, లెథరెట్ అప్‌హోల్‌స్టరీ, బోస్ ఆడియో సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
సెల్టోస్, సోనెట్ తర్వాత లాంచ్ కాబొతున్న మూడో కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కావడంతో భారీ స్పెసిఫికేషన్లను జోడించనున్నారు. ఇందులో ఇంటీరియర్, బూట్ స్పేస్ కూడా ఎక్కువే ఉండనుంది. ఇక ఎక్స్‌టీరియర్‌లో ఇది బాక్సీ డిజైన్‌తో రానుంది. దీనివల్ల ఇంటీరియర్ స్పేస్ పెరగనుంది. ఓ విధంగా ఇంది కార్నివాల్ లిమోసిన్, ఈవీ9 కి మధ్య మోడ్రన్ డిజైన్‌తో రానుంది. దూరం నుంచే ఈ డిజైన్ కస్టమర్లను ఆకట్టుకోనుంది.

ఎక్స్‌టీరియర్‌లో 'ఎల్' ఆకారపు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, వర్టికల్ LED డేటైమ్ రన్నింగ్ లైట్స్ ఉన్నాయి. బాక్సీ టెయిల్ సెక్షన్, ఫంక్షనల్ రూఫ్ రెయిల్స్ సైరోస్‌కి అదనపు ఆకర్షణను అందించనున్నాయి. ఇక ఇంజిన్ పరంగా సోనెట్, సెల్టోస్‌లలో ఉండే 1.2-లీటర్ NA పెట్రోల్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్,,1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లతో వచ్చే అవకాశం ఉంది. 6-స్పీడ్ AMT, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది.
ఐసీఈ వెర్షన్స్‌తో పాటు సైరోస్‌ని ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ కారు ఫుల్ ఛార్జ్‌పై 350 కిలోమీటర్ల రేంజ్‌ని అందించే అవకాశం ఉంది. కియా సైరోస్ మార్కెట్‌లో నేరుగా హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి బ్రెజా, స్కోడా కైలాక్ వంటి ఎస్‌యూవీలకు గట్టి పోటీని ఇవ్వనుంది. 2025 తొలి భాగంలోనే ఈ కారు మార్కెట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications