కియా కొత్త కారులో ఖరీదైన ఫీచర్లు.. కారు కొనేవారు ఇవి చెక్‌ చేయండి.. మంచి నిర్ణయం తీసుకోండి!

కియా మోటార్స్ (Kia Motors) భారత్‌లోనే టాప్‌ 5 కార్ల కంపెనీలలో ఒకటిగా ఉంది. కేవలం 5 ఏళ్లలోనే ఈ మార్క్‌ని సాధించింది. మాస్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తూ కియా కార్లను విడుదల చేస్తుంది. అందులో భాగంగానే కొత్త కియా సైరస్‌ (Kia Syros) ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఈ కారు అంచనాలకు మించి భారీ ఫీచర్లతో వస్తుంది. అందులోనూ అందిరకీ అందుబాటు ధరలో వీటిని తీసుకువస్తుంది. ఈ కియా కొత్త కారు పూర్తి స్పెసిఫికేషన్లు, డిజైన్‌, ఇంజిన్‌కి సంబంధించిన టాప్‌ 5 వివరాలు మీకోసం..

డిజైన్‌: కొత్త కియా సైరోస్ ఎస్‌యూవీ ఎక్స్‌టీరియర్‌లో అత్యాధునిక బాక్సీ డిజైన్‌తో వస్తుంది. 3-పాడ్ LED హెడ్‌లైట్లు, LED డే టైమ్‌ రన్నింగ్‌ లైట్స్‌, 'L' ఆకారంలో ఉండే LED టెయిల్‌లైట్స్‌, ఫ్లాట్ టెయిల్ గేట్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్, పనోరమిక్ సన్‌రూఫ్‌ని కలిగి ఉంది.

Kia Syros Mileage

ఫీచర్లు: ఇందులో 30-ఇంచెస్‌ ట్రినిటీ పనోరమిక్ డ్యూయల్ స్క్రీన్ సెటప్‌, టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. వీటితో పాటు డ్యూయల్ జోన్ ఏసీ, 4-way పవర్డ్ డ్రైవర్ సీటు, ఇంటీరియర్‌ మొత్తంలో యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ & రియర్ సీట్లు, వైర్‌లెస్ మోబైల్‌ ఛార్జర్, అప్/డౌన్ ఆపరేట్‌ చేసేలా పవర్ విండోస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్స్: కియా సైరోస్‌లో ప్రయాణీకులకు మంచి సేఫ్టీ లభించనుంది. ఇందులో 6-ఎయిర్ బ్యాగ్స్‌, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), లెవల్ -2 ADAS (అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 360 డిగ్రీస్‌ కెమెరా, లేన్‌కీప్‌ అసిస్ట్‌తో పాటు 16 అడాప్టివ్‌ సేఫ్టీ ఫీచర్లు, వంటివి ఉన్నాయి. ఈ ఫీచర్లతో ఈ కారు మంచి సేఫ్టీ రేటింగ్‌ని సాధించే అవకాశం ఉంటుంది.

Kia Syros Price

వేరియంట్లు: ఈ కొత్త కియా సైరోస్ ఎస్‌యూవీ HTK, HTK (O), HTK ప్లస్, HTX, HTX ప్లస్, HTX ప్లస్ (O) అనే ఆకర్షణీయమైన వేరియంట్లలో లభిస్తుంది. అయితే వీటి ధరలను కంపెనీ ప్రకటించలేదు. ఈ కొత్త కియా ఎస్‌యూవీ బుకింగ్స్ జనవరి 3, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక డెలివరీలు ఫిబ్రవరి నుంచి స్టార్ట్‌ కానున్నాయి.

ఇంజిన్: ఇది రెండు పవర్‌ట్రైన్‌ ఆప్షన్స్‌తో లభిస్తుంది. ఇందులోని 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ గరిష్టంగా 120 ps పవర్‌ని, 172 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కి 6-స్పీడ్ AMT, 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ ఆప్షన్‌ జతచేయబడి ఉంటుంది. మరో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 116 ps పవర్‌ని, 250 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్‌ MT, AT ట్రాన్స్‌మిషన్స్‌తో వస్తుంది.

Kia Syros Features

ఈ కొత్త సైరోస్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.9 లక్షల నుంచి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఇందులో 5గురు హాయిగా వెళ్లవచ్చు. ఇది కియా సెల్టోస్‌కి ఎక్కువగా.. కియా సోనెట్‌కి సమానమైన ఫీచర్లు, పవర్‌ట్రైన్‌తో వస్తుంది. ధరను బట్టి ఈ కారు డిమాండ్‌ ఎలా ఉందనే విషయం త్వరలోనే తెలిసి రానుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, December 20, 2024, 11:23 [IST]
English summary
Kia syros unveiled check top 5 things details
Read more on: #kia motors #new car #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+