అన్యదేశ్య కార్లకు అస్సలు తగ్గని డిమాండ్.. ఇంకా 200 యూనిట్స్ పెండింగ్

'లంబోర్ఘిని' గత ఏడాది గ్లోబల్ మార్కెట్లో ఏకంగా 10000 కంటే ఎక్కువ కార్లను విక్రయించి అమ్మకాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. భారతదేశంలో కూడా 100 యూనిట్ల కంటే ఎక్కువ అమ్ముడయ్యాయి. కాగా ఇంకా 200 యూనిట్స్ డెలివరీ చేయాల్సి ఉంది.

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘినికి దేశంలో ఆదరణ రోజురోజుకి పెరుగుతూనే ఉంది. కంపెనీ ఇండియాలో ఇంకా 200 యూనిట్లను డెలివరీ చేయాల్సి ఉంది. దీన్ని బట్టి చూస్తే భారతీయ మార్కెట్లో లంబోర్ఘిని కార్లకు ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్థమైపోతుంది. భారతదేశం లంబోర్ఘినికి చిన్న మార్కెట్ అయినా.. వేగంగా అభివృద్ధి చెందుతోందని కంపెనీ సీఈఓ స్టీఫన్ వింకెల్‌మాన్ పేర్కొన్నారు.

Lamborghini Hucan Tecnica

లబోర్గిని బుకింగ్స్

లంబోర్ఘిని కార్లకు మాత్రమే కాకుండా.. బ్రాండ్ వాచెస్, యాక్ససరీస్ వంటి వాటికి కూడా భారతదేశంలో డిమాండ్ ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం కంపెనీ యొక్క రెవోల్టో (Revuelto) ఆర్డర్స్ తాత్కాలికంగా నిలిపివేయబడింది. అదే సమయంలో లంబోర్ఘిని ఉరుస్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కారు కోసం 2025 వరకు ఆర్డర్స్ పొందినట్లు సమాచారం. హురాకాన్ యొక్క బుకింగ్స్ త్వరలోనే ఐరోపాలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.

లంబోర్ఘిని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20000 యూనిట్ల బుకింగ్స్ పొందింది. అంటే 20000 లంబోర్ఘిని కార్లను కంపెనీ డెలివరీ చేయాల్సి ఉంది. బుకింగ్స్ వాల్యూ ప్రపంచ వ్యాప్తంగా 6 బిలియన్స్ లేదా రూ. 48000 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. సంస్థ భారతదేశంలో మాత్రమే 200 కార్లను డెలివరీ చేయాల్సి ఉంది. లంబోర్ఘిని డెలివరీలను మరింత వేగవంతం చేస్తుందని భావిస్తున్నాము.

Lamborghini Huracan Sterrato

లంబోర్ఘిని కార్లకు ఇండియాలో డిమాండ్

2023లో లంబోర్ఘిని కంపెనీ విక్రయాల పరంగా 10000 యూనిట్లను దాటింది. ఈ ఏడాది కూడా ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నాము. లంబోర్ఘిని కార్ల ధరలు ఎక్కువైనప్పటికీ.. వాహన ప్రియులైన సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, ఇతర ప్రముఖులు ఈ కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో లంబోర్ఘిని కార్లకు భారతదేశంలో డిమాండ్ భారీగా ఉంటుందని భావిస్తున్నాము.

లంబోర్ఘిని కంపెనీ తన ఉనికిని భారతదేశంలో విస్తరిస్తూ ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ దేశంలో మరో డీలర్‌షిప్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. దేశంలో పెరుగుతున్న మిలియనీర్ల సంఖ్య మరియు పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని లంబోర్ఘిని ముందడుగు వేస్తోంది. భవిష్యత్తులో తప్పకుండా భారతదేశంలో లంబోర్ఘిని కంపెనీ తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని లాంబోర్గిని సేల్స్ హెడ్ 'ఫ్రాన్సిస్కో ఫోస్సినీ' చెప్పారు.

Lamborghini Aventador Ultimae Roadster

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..

భారతదేశం ప్రస్తుతం టాప్ 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది. రాబోయే రోజుల్లో ఇది మూడో స్థానానికి చేరుకుంటుందని, అప్పుడు వికసిత భారత్ సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని లంబోర్ఘిని.. భారతదేశంలో త్వరలో అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని.. అప్పటికే తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ తన నెట్‌వర్క్‌ను విస్తృతంగా విస్తరిస్తోంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, May 17, 2024, 11:00 [IST]
English summary
Lamborghini has nearly 200 units orders pending in indian market
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+