లంబోర్ఘిని నుంచి కొత్త హైబ్రిడ్ కారు వచ్చేసింది.. ధర తెలిస్తే మీకు దడ రావడం పక్కా!
లంబోర్ఘిని ఉరుస్ (Lamborghini Urus) ఈ ఇటాలియన్ బ్రాండ్ లగ్జరీ కార్లు ప్రపంచవ్యాప్తంగానే కాకుండా భారతదేశంలోనూ అత్యంత విజయవంతమైన మోడల్‌గా ఉంది. గత సంవత్సరంలో లంబోర్ఘిని ట్రిపుల్ డిజిట్ మార్క్‌ని చేరుకుంది. గత సంవత్సరంలో 103 యూనిట్లను విక్రయించింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడై సెంచరీ మ్యాజిక్ ఫిగర్‌ని చేరుకుంది. దీంతో భారత్‌ని కీలక మార్కెట్‌గా లంబోర్ఘిని ఎంచుకుంది. సరికొత్త ఉరుస్ SEని రూ .4.57 కోట్ల ప్రారంభ ధర కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఉరుస్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రావడం ఇదే మొదటిసారి. అదే విధంగా ఉందులోPHEV (ప్లగ్-ఇన్ హైబ్రిడ్ EV) మోడల్‌లో తీసుకువచ్చారు. ఈ కొత్త పవర్‌ట్రెయిన్‌తో పాటు ఉరుస్ SE కొన్ని స్టైలింగ్ అప్‌డేట్స్‌ని కూడా పొందుతుంది.
ఉరుస్ SE చూడటానికి పాత మోడల్‌ని పోలి ఉంటుంది. అయితే మీరు దీనిని లోతుగా గమనిస్తే బానెట్ కొత్త డిజైన్‌ని కనుగొంటారు. అలాగే ఇది మునుపటి కంటే గ్రిల్ కంటే చాలా దగ్గరగా ఉంటుంది. పాత మోడల్‌తో పోలిస్తే హెడ్ లైట్లు కొత్తవిగా చిన్నగా (సన్నవిగా) ఉంటాయి. దీంతో పాటు DRLలు కూడా కొత్త డిజైన్‌తో తీసుకువచ్చారు. ఇవిదాదాపు హెడ్‌లైట్లను కవర్ చేసి ఉంటాయి.

వెనకవైపు టెయిల్ గేట్ కొత్తగా ఉండటంతో పాటు ఎల్ఈడీ టెయిల్ లైట్లు కూడా ఉన్నాయి. వెనుక భాగంలో కొత్త స్పాయిలర్‌ని కూడా గమనించవచ్చు. ఉరుస్ ఎస్ఈ 35 శాతం అధిక డౌన్‌ఫోర్స్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఏరోడైనమిక్స్ పరంగా 15 శాతం మెరుగ్గా ఉంది. బయటి డిజైన్‌లో కారు అదిరిపోయే లుక్‌లో దర్శనిమిస్తుంది. వెనక నుంచి కూడా లగ్జరీ కారు లుక్‌ని క్షణాల్లో కనిపెట్టవచ్చు.
పవర్‌ట్రెయిన్: ఇంజిన్ పరంగా కూడా ఈ సూపర్ లగ్జరీ ఎస్‌యూవీ భారీ అప్‌డేట్స్‌ని కలిగి ఉంది. ఇది 4.0-లీటర్ ట్విన్-టర్బో మోటారు పూర్తిగా ఎలక్ట్రీఫైడ్ చేయబడింది. అంతే కాకుండా ఇది PHEV (ప్లగ్-ఇన్ హైబ్రిడ్ EV)తో వస్తుంది. ఈ ఇంజిన్ 620bhp పవర్ మరియు 800nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

దీనిలోని ఎలక్ట్రిక్ మోటార్, 25.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ 189 hp మరియు 483 nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇది 4WDని కలిగి ఉంది. ఎలక్ట్రిక్ వెర్షన్ 60 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ప్యూర్ ఈవీ మోడ్‌లో గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. దీని అసలు గరిష్ట వేగం 312 కిలోమీటర్లుగా ఉంది. ఇది కేవలం 3.4 సెకన్లలో 0-100 వేగాన్ని అందుకుంటుంది.
లాంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ 7 డ్రైవ్ మోడ్స్‌ని కలిగి ఉంది. సాధారణ స్ట్రాడా, స్పోర్ట్ మరియు కోర్సాతో పాటు ఆఫ్-రోడ్ కోసం ఉపయోగం నెవ్, టెర్రా మరియు సబ్బియాతో అనే మూడు మోడ్స్ ఉన్నాయి. వీటితో పాటు ఈవీ డ్రైవ్, హైబ్రిడ్, రీఛార్జ్ మరియు పెర్ఫార్మెన్స్ అనే మోడ్స్ కూడా ఉన్నాయి. ఈ సూపర్ ఎస్‌యూవీలో స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా ఎయిర్ సస్పెన్షన్ లభిస్తుంది.

దీని ఇంటీరియర్‌లో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ డ్యాష్‌బోర్డ్‌ని కలిగి ఉంది. ఇందులోని 12.3 ఇంచెస్ బిగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌లో లంబోర్ఘిని రెవ్యూయెల్టోలో కనిపించే కంట్రోల్స్ మరియు గ్రాఫిక్స్ గమనించవచ్చు. క్యాబిన్‌లో అప్‌డేటెడ్ ఎయిర్‌వెంట్స్, అల్యూమినియం యాక్సెంట్స్ మరియు డ్యాష్ బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్‌కి అనుసంధానించబడిన 12.3-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








