భారత్‌లో కొత్త కారు లాంచ్ చేసిన Lexus.. ఫిదా చేస్తున్న ఫీచర్స్!.. ధర ఎంతో తెలుసా?

భారతీయ మార్కెట్లో ప్రజాదరణ పొందిన లెక్సన్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను లాంచ్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే కంపెనీ తాజాగా మరో కొత్త కారు 'ఎల్ఎమ్ 350హెచ్' లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

లెక్సన్ (Lexus) కంపెనీ లాంచ్ చేసిన కొత్త 'ఎల్ఎమ్ 350హెచ్' (LM 350h) ప్రారంభ ధర రూ. 2 కోట్లు (7 సీటర్). అయితే ఇందులోని 4 సీటర్ వేరియంట్ ధర రూ. 2.50 కోట్లు. ఇందులో లగ్జరీ ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. ధర పరంగా మాత్రమే కాకుండా ఫీచర్స్ పరంగా కూడా ఇప్పటికే దేశీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న టయోటా వెల్‌ఫైర్‌ను కొత్త లెక్సస్ అధిగమించింది.

Lexus LM 350h

డిజైన్

చూడటానికి మంచి డిజైన్ కలిగి ఈ లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్.. టయోటా వెల్‌ఫైర్‌ మాదిరిగానే జీఏ-కే మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ కారు భారీగా కనిపించే స్పిండిల్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌, నిలువుగా అమర్చబడిన ఫాగ్ ల్యాంప్‌ వంటి వాటిని పొందుతుంది. వెనుక డోర్స్ స్లైడింగ్ కలిగి ఉంటాయి. వెనుక వైపు వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ టెయిల్ లైట్ ఉంటుంది.

ఫీచర్స్

లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ (4 సీట్ వెర్షన్) ముందు మరియు వెనుక ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్‌లను విభజిస్తుంది. ఇందులో తగ్గించడానికి లేదా పెంచడానికి అనుకూలంగా ఉండే గ్లాస్ ప్యానెల్ కూడా ఒకటి ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఎయిర్‌లైన్-స్టైల్ రిక్లైనర్ సీట్లు, 48 ఇంచెస్ టీవీ, 23 స్పీకర్ సరౌండ్ సౌండ్ ఆడియో సిస్టం, పిల్లో స్టైల్ హెడ్‌రెస్ట్‌లు మొదలైనవి ఉన్నాయి.

Lexus LM 350h Interior

పైన చెప్పుకున్న ఫీచర్స్ మాత్రమే కాకుండా.. ఇందులో ఫోల్డ్ అవుట్ టేబుల్, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్‌లు, మల్టిపుల్ USB పోర్ట్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌లు, రీడింగ్ లైట్స్, ఫ్రిజ్, రియర్ గ్లోవ్ బాక్స్, వానిటీ మిర్రర్స్ మరియు ఇతర లేటెస్ట్ ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా ఉపయోగపడతాయి. లోపల క్యాబిన్ కూడా చాలా విశాలంగా ఉంటుంది.

సేఫ్టీ ఫీచర్స్

సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో లెక్సస్ సేఫ్టీ సిస్టం ప్లస్ 3 సాప్ట్ ఆఫ్ ఏడీఏఎస్ టెక్నాలజీ ఉంటుంది. కాబట్టి వెహికల్ డిటెక్షన్, డైనమిక్ రాడార్ క్రూయిజ్ జనుత్రోల్, స్టీరింగ్ అసిస్ట్‌తో లేన్ డిపార్చర్ అలర్ట్, లేన్ ట్రేసింగ్ అసిస్ట్, ఆటోమాటిక్ హై బీమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతకు పెద్దపీట వేస్తాయి.

Lexus LM 350h Side View

ఇంజిన్

కొత్త లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ 2.5 లీటర్ 4 సిలిండర్ సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 250 హార్స్ పవర్ మరియు 239 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది eCVT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇంజిన్ నికెల్‌మెటల్ హైడ్రైడ్ బ్యాటరీతో కలిసి మంచి పనితీరుని అందిస్తుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, March 16, 2024, 11:08 [IST]
English summary
Lexus lm 350h launched in india at rs 2 crore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+