ఎట్టకేలకు మొదలైన రూ.2 కోట్ల కారు డెలివెరీ.. సారీ చెప్పిన వైస్ ప్రెసిడెంట్

ప్రముఖ కార్ల తయారీ సంస్థ లెక్సస్ (Lexus) ఎట్టకేలకు తన లగ్జరీ ఎంపీవీ ఎల్ఎమ్ 350హెచ్ (LM 350h) డెలివరీలు ప్రారంభమయ్యాయి. కంపెనీ ఈ కారు ధరలను 2023లోనే అధికారికంగా ప్రకటించినప్పటికీ.. డెలివరీలు ఇప్పుడు మొదలయ్యాయి. ఈ కార్ల డెలివరీలు ఎందుకు ఇంత ఆలస్యమయ్యాయి అనే విషయం మీద సంస్థ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. బహుశా ఉత్పత్తి వేగవంతం కాకపోవడం వల్ల లేదా గ్లోబల్ మార్కెట్లో అధిక డిమాండ్ కారణంగా డెలివరీలలో ఆలస్యమై ఉంటుందని పలువురు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

లెక్సస్ ఇండియా లాంచ్ చేసిన ఎల్ఎమ్ 350హెచ్ కారు భారతదేశానికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ (సీబీయూ) మార్గం ద్వారా దిగుమతి అవుతుంది. ఈ కారుకు భారతదేశంలో మాత్రమే కాకుండా గ్లోబల్ మార్కెట్లో కూడా అధిక డిమాండ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. రెండు వేరియంట్లలో లభించే ఈ కారు 7 సీటర్ మరియు 4 సీటర్ రూపంలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.2 కోట్లు, రూ.2.50 కోట్లు (ఎక్స్ షోరూమ్)

Lexus LM 350h MPV

లెక్సస్ 7 సీటర్ వీఐపీ వేరియంట్ ధర రూ. 2 కోట్లు, అయితే 4 సీటర్ అల్ట్రా లగ్జరీ వేరియంట్ ధర రూ. 2.50 కోట్లు. అంటే 7 సీటర్ వేరియంట్ కంటే కూడా 4 సీటర్ వేరియంట్ ధర చాలా ఎక్కువని తెలుస్తోంది. అయితే ఈ రెండు వేరియంట్లు ఒకే 2.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి, స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో జత చేయబడి ఉంటాయి.

లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ కారులోని ఇంజిన్ 190 Bhp పవర్ మరియు 240 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ ఆటోమేటిక్ కంటిన్యూయస్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (సీవీటీ)తో జతచేయబడి ఉంటుంది. ఇంజిన్ 19.28 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ కారు ఒక ఫుల్ ట్యాంక్‌తో 1200 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది.

Lexus LM 350h MPV Rear Profile

మంచి డిజైన్ కలిగిన లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ కారు పవర్డ్ రిక్లైనింగ్ సీట్లు, 23 స్పీకర్ ఆడియో సిస్టమ్‌, 48 ఇంచెస్ డిస్‌ప్లే, ఫోల్డ్ అవుట్ టేబుల్‌లు, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్‌లు, యూఎస్బీ పోర్ట్‌లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌లు మరియు రీడింగ్ లైట్లు, మ్యాట్రిక్స్ సెన్సార్ వంటి మరెన్నో ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

లెక్సస్ ఇండియా తన ఎల్ఎమ్ 350హెచ్ కారు కోసం సెప్టెంబర్ 2023లో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కంపెనీ బుకింగ్స్ ప్రారంభించిన కేవలం ఒక్క నెలలోనే కంపెనీ ఈ కారు కోసం 100 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క ఈ కారుకు దేశీయ విఫణిలో కూడా మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Lexus LM 350h MPV Interior

లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ డెలివరీ సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తన్మయ్ భట్టాచార్య మాట్లాడుతూ.. ఎక్కువ వెయిటింగ్ పీరియడ్‌కు క్షమాపణలు కోరుతున్నాము. ఇప్పటి వరకు మాకు మద్దతు ఇచ్చిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారతదేశంలోని మా కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తాము. రాబోయే రోజుల్లో డెలివరీలను వేగవంతం చేస్తామని, ఎలాంటి జాప్యం జరగకుండా చూస్తామని వెల్లడించారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, July 30, 2024, 10:20 [IST]
English summary
Lexus lm 350h mpv deliveries start in india
Read more on: #lexus #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+