భారత్‌లో లాంచ్ అయిన Lexus కొత్త కారు ఇదే.. ధర, పూర్తి వివరాలు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'లెక్సస్ ఇండియా' (Lexus India) దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు 'ఎన్ఎక్స్ 350హెచ్ ఓవర్‌ట్రైల్ ఎడిషన్' లాంచ్ చేసింది. ఈ కొత్త కారు ధర, డిజైన్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర (Price)
దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త 'ఎన్ఎక్స్ 350హెచ్ ఓవర్‌ట్రైల్ ఎడిషన్' (NX 350h Overtrail Edition) ధర రూ. 71.17 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది చూడటానికి ఇటీవలే మార్కెట్లో అడుగుపెట్టిన థార్ ఎర్త్ ఎడిషన్ మాదిరిగా ఉండే పెయింట్ స్కీమ్ పొందుతుంది. ఈ కొత్త కారు చూపరులను ఒక్క చూపుతూనే ఆకర్శించే అద్భుతమైన డిజైన్ పొందుతుంది.

డిజైన్ (Design)
కొత్త లెక్సస్ ఎన్ఎక్స్ 350హెచ్ ఓవర్‌ట్రైల్ ఎడిషన్ కారు యొక్క గ్రిల్, వింగ్ మిర్రర్స్, డోర్ హ్యాండిల్స్ మరియు రూప్ రైల్స్ వంటివన్నీ నలుపు రంగులో ఉండటం చూడవచ్చు. ఈ కొత్త కారులో 18 ఇంచెస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరియు 235 / 60 టైర్స్ ఉండటం చూడవచ్చు. ఇవి కఠినమైన రోడ్ల మీద కూడా సజావుగా ముందుకు సాగటానికి ఉపయోగపడతాయి.
ఇంటీరియర్ (Interior)
లెక్సన్ ఎన్ఎక్స్ 350హెచ్ ఓవర్‌ట్రైల్ ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులోని ఆర్మ్‌రెస్ట్, సీటు అంచులు, డోర్ ప్యానెల్ వంటివన్నీ మట్టి రంగులో ఉన్నట్లు తెలుస్తోంది. హీటింగ్ ఫంక్షన్‌తో కూడిన లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్ మరియు 17 స్పీకర్ ఆడియో సిస్టం వంటి అనేక ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.

ఇంజిన్ (Engine)
ఇంజిన్ విషయానికి వస్తే.. కొత్త లెక్సన్ ఎన్ఎక్స్ 350హెచ్ ఓవర్‌ట్రైల్ 2.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో జత చేయబడి ఉంటుంది. ఇవి ఒకటి ముందు.. మరొకటి వెనుక అమర్చబడి ఉంటుంది. మొత్తం సిస్టమ్ అవుట్‌పుట్ 243 హార్స్ పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 6 టైప్ ఈ-సీవీటీ గేర్‌బాక్స్ ద్వారా అన్ని చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.
ప్రత్యర్థులు (Rivals)
దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త లెక్సస్ ఎన్ఎక్స్ 350హెచ్ ఓవర్‌ట్రైల్.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న ఆడి క్యూ5, బీఎండబ్ల్యూ ఎక్స్3, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సీ మరియు వోల్వో ఎక్స్‌సీ 60 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదురుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుందనే విషయం త్వరలోనే తెలుస్తుంది.

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థల్లో ఒకటి లెక్సస్. ఈ కంపెనీ తన ఉనికిని దేశీయ విఫణిలో ఎప్పటికప్పుడు విస్తరించడంతో భాగంగా కొత్త కొత్త కార్లను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు కూడా మరో కొత్త కారును లాంచ్ చేసింది. ఈ కొత్త కారు తప్పకుండా కస్టమర్లను ఆకర్శించడంలో సక్సెస్ సాధిస్తుందని భావిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








